Jump to content

దార్ల నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
దార్ల నాగేశ్వరరావు
మానవుడు
పుట్టిన తేదీ1959 మార్చు
జన్మ స్థలంతెనాలి మార్చు
వృత్తిచిత్రకారుడు మార్చు
నివాసంగుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ మార్చు
జాతితెలుగు ప్రజలు మార్చు
దార్ల నాగేశ్వరరావు
జననంజనవరి 12, 1959
వృత్తిచిత్రకారుడు, రిప్లికా ఆర్టిస్ట్
భాగస్వామిజ్యోతి కుమారి
తల్లిదండ్రులు
  • దార్ల అప్పారావు (తండ్రి)
  • దార్ల సావిత్రి (తల్లి)

దార్ల నాగేశ్వరరావు చిత్రకారుడు, రిప్లికా ఆర్టిస్ట్. హైదరాబాద్ నివాసి.

జీవిత విశేషాలు

[మార్చు]

దార్ల నాగేశ్వరరావు పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి జనవరి 12 న, 1959 లో. తల్లిదండ్రులు దార్ల అప్పారావు, సావిత్రి. పదవ తరగతి తర్వాత, హైదరాబాద్ లో ఎండోమెంట్స్ డిపార్టుమెంట్స్ లో స్థాపించిన శిల్పకళాశాల నందు 4 సంవత్సరాల డిప్లొమా కోర్సు. ఆగస్టు 1985 లో హైదరాబాద్ లోని గవర్నమెంట్ సెంట్రల్ ప్రెస్ లో అసిస్టెంట్ ఆర్టిస్టుగా చేరి, చీఫ్ డిజైనర్ గా 2019, జనవరి లో పదవీ విరమణ పొందాడు.

రిప్లికా ఆర్ట్

[మార్చు]

అతని ప్రత్యేక ప్రతిభ దిన పత్రిక యొక్క మొదటి పేజీని పూర్తిగా చేతితో రాసి అబ్బురపరిచాడు. బ్లాక్ ఇంక్‌తో ఫౌంటెన్ పెన్ ఉపయోగిస్తూ ప్రతి పదాన్ని, ప్రతి పంక్తిని, ప్రతి పేరాగ్రాఫ్‌ను ఖచ్చితంగా సరిపోల్చి రాయడం అతని విధానం.[1] ఈ సమగ్ర ప్రయత్నంలో మాస్ట్‌హెడ్‌లు, శీర్షికలు, వార్తా కథనాలు, కార్టూన్లు, ప్రకటనలు తదితర అన్ని అంశాలు ఉన్నాయి. ఈ విధమైన సృజనకు నాంది పలికి రిప్లికా ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాడు. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ, ఇంగ్లీష్ వంటి పలుభాషలలో రెప్లికా చేసి పలు రికార్డులు అందుకున్నాడు.

అవార్డులు

[మార్చు]
  • శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సమితి, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్స్
  • గవర్నమెంట్ సెంట్రల్ ప్రెస్ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాదు
  • శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తిరుపతి
  • సిలికానాంధ్ర-తిరుమల తిరుపతి దేవస్థానములు-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ
  • కడప ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, కడప
  • సంఘమిత్ర సాంస్కృతిక సంఘ సేవా సంస్థ, హైదరాబాదు
  • శ్రీ అజంతా కళారామం, తెనాలి
  • కళానిలయం కల్చరల్ & సోషల్ ఆర్గనైజేషన్
  • ది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, హైదరాబాదు
  • ఆంధ్రా ఆర్టిస్ట్సు, స్కల్పటర్స్ & కార్టూనిస్ట్సు అసోసియేషన్ (ఆస్కా), విజయవాడ
  • సర్.సి.వి.రామన్ అకాడమీ(సేవాసంస్థ), హైదరాబాదు

రికార్డులు

[మార్చు]
  • ఏషియన్ రికార్డ్స్ అకాడమి
  • అమేజింగ్ వరల్డ్ రికార్డ్
  • ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్
  • మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్[2]


యితర లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Darla Nageswara Rao, displaying a handwritten copy of newspapers in 12 different Indian languages in... | The Hindu Images". thehinduimages.com. Retrieved 2026-01-20.
  2. "Details". miraclesworldrecords.com. Retrieved 2026-01-20.