Coordinates: 16°30′N 80°48′E / 16.5°N 80.8°E / 16.5; 80.8

దావాజిగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దావాజిగూడెం
—  రెవెన్యూ గ్రామం  —
దావాజిగూడెం is located in Andhra Pradesh
దావాజిగూడెం
దావాజిగూడెం
అక్షాంశరేఖాంశాలు: 16°30′N 80°48′E / 16.5°N 80.8°E / 16.5; 80.8
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గన్నవరం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి తిరివీధి మరియమ్మ
పిన్ కోడ్ 521 101.
ఎస్.టి.డి కోడ్ 08656

"దావాజిగూడెం" కృష్ణా జిల్లా గన్నవరం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 101., ఎస్.టి.డి.కోడ్ = 08656.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఎన్.టి.టి.ఎఫ్. సాంకేతిక విద్యా కళాశాల[మార్చు]

నెట్టూరు టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్, వృత్తివిద్య కళాశాల.

ప్రభుత్వ పాలిటెక్నిక్[మార్చు]

ఈ కళాశాలలో 2.77 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండవదశ భవన సముదాయాన్ని, 2016, జనవరి-26న ప్రారంభించారు. మూడవ దశలో 4.84 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన నిర్మించారు. [7]

శ్రీ ముక్కామల జగదీశ్వరరావు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  1. ఈ పాఠశాలలో, నూజివీడు డివిజనులోని 77వ గ్రిగ్ మెమోరియల్ ఆటలపోటీలను, 2013-డిసెంబరు 9,10 తేదీలలో నిర్వహించారు. ఈ పాఠశాలలో 2014, నవంబరు-1న, నూతనం,గా ఏర్పాటుచేసిన సురక్షిత త్రాగునీటి పథకాన్ని, ప్రారంభించెదరు. [1]&[5]
  2. ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016, ఫిబ్రవరి-21వ తేదీ శనివారంనాడు సందడిగా సాగినది. [8]
  3. ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న తిరివీధుల అశోక్ అను విద్యార్థి, 2015-16 విద్యాసంవత్సరం పోటీపరీక్షలలో పాల్గొని, జాతీయ ఉపకారవేతనానికి అర్హత సాధించాడు. దీని ప్రకారం ఈ విద్యార్థి, నాలుగు సంవంవత్సరాల పాటు, ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల ఉపకారవేతనం అందుకుంటాడు. [9]

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016, ఏప్రిల్-6వ తేదీనాడు సందడిగా సాగినది. [10]

సి.ఎస్.ఐ.ప్రాధమిక పాఠశాల[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

సప్తగిరి గ్రామీణ బ్యాంకు. ఫోన్ నం. 08676/256622; చిరునామా:- కళ్యాణి ఆసుపత్రి భవనం, దావాజీగూడెం రహదారి, గన్నవరం-521 101.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామం బుద్దవరం గ్రామానికి శివారు గ్రామం.
  2. 2013జూలైలో బుద్ధవరం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తిరివీధి మరియమ్మ సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామములోని పామర్తినగర్‌లో వేచేసియున్న ఈ ఆలయంలో, 2017,మార్చి-8వతేదీ బుధవారంనాడు, పండితుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ, ఈ ఆలయ పునఃప్రతిష్ఠ, శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షించారు. గ్రామప్రముఖులు, దాతలు సమకూర్చిన బంగారు, వెండి, పంచలోహ ఆభరణాలను సీతారాములకు అలంకరించి పట్టాభిషేకం నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు మద్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు గన్నవరం, బుద్ధవరం, అల్లపురం తదితర గ్రామాల నుండి నుండి భక్తులు తరలిరావడంతో గ్రామములో పండుగ వాతావరణం నెలకొన్నది. కళ్యాణం, పట్టాభిషేకం అనంతరం, 9వతేదీ గురువారంనాడు శ్రీ సీతారాముల శోభాయాత్ర (గ్రామోత్సవం) కన్నులపండువగా నిర్వహించారు. ఆలయం నుండి బయలుదేరిన ఈ శోభాయాత్ర గన్నవరం మీదుగా వెళ్ళి, తిరిగి ఆలయానికి చేరుకున్నది. ప్రదర్శన ముందు ఎద్దులు, గుర్రాలు, ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. భక్తులు ఇళ్ళ ముందు అడుగడుగునా నిలిచి, నూతన దంపతులకు హారతి పట్టినారు. [14]

శ్రీ అభయాంజనేయస్వామివారి మందిరం[మార్చు]

దావాజీగూడెం గ్రామములో వేంచేసియున్న శ్రీ కోదండరామాలయం ఆవరణలో, నిర్మించనున్న ఈ మందిర నిర్మాణానికి, 2015, మే-31వ తేదీ ఆదివారంనాడు, తొలుత వేదపండితులు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, వాస్తుపూజ, వాస్తుహోమం నిర్వహించి, అనంతరం, శంకుస్థాపన నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిలకించేందుకు భక్తజనం అశేషంగా తరలివచ్చారు. [6]

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,మార్చి-5వతేదీ ఆదివారం ప్రారంభమైనవి. గ్రామములోని శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయ సమీపంలో, నూతనంగా ఆలయ నిర్మాణం చేసి, అక్కడ శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠాను 6వతెదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. [13]

శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం[మార్చు]

దావాజీగూడెం శివారు పామర్తినగర్‌లో వేంచేసియున్న ఈ ఆలయంలో, స్వామివారి జాతరను, 2017,ఫిబ్రవరి-23వతేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సంద్రభంగా ఆలయంలోని దేవేరులను ఏలూరుకాలువ వరకు గ్రామోత్సంగా తీసుకుని వెళ్ళి, పుణ్యస్నాలాచరింపజేసినారు. తిరిగి ఆలయానికి తీసికుని వచ్చి, ఆలయంలో విఘ్నేశ్వరపూజ, దీపారాధన నిర్వహించారు. స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. [12]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]

శ్రీ రణ అంకమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 2016, ఏప్రిల్-8, శుక్రవారంనాడు, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని, వేకువఝామునే అమ్మవారికి ప్రత్యేక అలంకారం జరిపిన భక్తులు, పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేక వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు డప్పువాయిద్యాలకు లయబద్ధంగా చిందులు వేసుకుంటూ సందడి చేసారు. దావాజీగూడెం పరిసరప్రాంతాల భక్తులు ఈ అధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొన్నారు. [11]

ఈ ఆలయ దశమ వార్షికోతవం,2017,ఆగస్టు-19వతేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు, అన్న సంతర్పణ నిర్వహించారు. [15]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు విజయవాడ/గన్నవరం; 2013,డిసెంబరు-11; 2వపేజీ. [2] ఈనాడు విజయవాడ; 2014,మార్చి-29; 9వపేజీ. [3] ఈనాడు విజయవాడ; 2014,ఆగస్టు-4; 5వపేజీ. [4] ఈనాడు విజయవాడ; 2014,ఆగస్టు-28; 5వపేజీ. [5] ఈనాడు విజయవాడ; 2014,నవంబరు-1; 4వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,జూన్-1; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2016,జనవరి-28; 4వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-21; 4వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2016,మార్చి-5; 5వపేజీ [10] ఈనాడు అమరావతి; 2016,ఏప్రిల్-7; 4వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2016,ఏప్రిల్-9; 4వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2017,ఫిబ్రవరి-24; 7వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2017,మార్చి-7; 6వపేజీ [14] ఈనాడు అమరావతి; 2017,మార్చి-10; 7వపేజీ [15] ఈనాడు అమరావతి; 2017,ఆగస్టు-20; 7వపేజీ.