దావులూరు (కొల్లిపర)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దావులూరు (కొల్లిపర)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కొల్లిపర
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,083
 - పురుషుల సంఖ్య 3,550
 - స్త్రీల సంఖ్య 3,533
 - గృహాల సంఖ్య 1,996
పిన్ కోడ్ 522 304
ఎస్.టి.డి కోడ్ 08644

దావులూరు, గుంటూరు జిల్లా, కొల్లిపర మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం.522 304.., ఎస్.టి.డి.కోడ్ = 08644.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

వెలనాడు రాజుల కాలంలో చెక్కిన శాసనాలు ఇక్కడ ఉన్నాయి.[1]

సీ ఆర్ డీ ఏ[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

ఉర్దూ పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

కళ్యాణమంటపం[మార్చు]

ఈ గ్రామములో కళ్యాణమంటప నిర్మాణానికి శ్రీ విన్నకోట వెంకటేశ్వరరావు అను దాత, రు. 4 లక్షల విలువచేసే ఖాళీ స్థలాన్ని విరాళంగా అందజేశారు. [4]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కట్టా భారతి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ శివన్నారాయణ ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

దావులూరు గ్రామము సర్వమతసమానమైనది. ఈ గ్రామములో హిందువులతో పాటు ముస్లీములు, క్రైస్తవులు కలసిమెలసి నివసిస్తున్నారు. హిందూ దేవాలయములతో పాటుగా చర్చి, మసీదులు కూడా ఉన్నాయి.

బౌద్ధస్మారక చైతన్యమున్న గ్రామాలలో దావులూరుకు ప్రత్యేక స్థానమున్నది.

శ్రీ గోకర్ణేశ్వరస్వామి ఆలయం[మార్చు]

దావులూరిలోని ఈ ఆలయం చారిత్రాత్మకమైనది. 11,12 శతాబ్దాలలో వెలనాటి చోళులపాలనలో ఈ గ్రామం ప్రసిద్ధికెక్కినట్లు చరిత్ర చెప్పుతున్నది. అలనాడు నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారు నేటికీ పూజలందుకొనుచున్నారు.

శ్రీ రామాలయం[మార్చు]

శ్రీ బాపమ్మ తల్లి, గంటయ్యస్వామివార్ల ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివార్ల తిరుణాళ్ళు, 2014,మే-18, ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. పసుపు బండ్లతో, కొలువుదీరిన బొమ్మలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారినది. అమ్మవారికి మొక్కులు తీర్చుకొనేటందుకు భక్తులు, సూర్యోదయానికే దేవాలయానికి చేరుకున్నారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పొంగళ్ళు వండి, తల్లికి సమర్పించుకున్నారు. శిడిమాను యెత్తి, తిరునాళ్ళు ప్రారంభించారు. గ్రామ బండి, తొలుత ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం, గ్రామంలోని రైతులు తమ ఎడ్లబండ్లను ఆలయం చుట్టూ త్రిప్పినారు. తరలి వచ్చిన భక్తులు తల్లికి పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. అమ్మవారి కళ్యాణం, శిడిమాను ఉత్సవాలలో భక్తులు పాల్గొని తల్లి దీవెనలు పొందినారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. [5]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం స్థానిక దావులూరు అడ్డరోడ్డులో ఉంది.

శ్రీ వినాయకస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం స్థానిక దావులూరు అడ్డరోడ్డులో ఉంది.

గ్రామములోని ప్రధాన పంటలులు[మార్చు]

దావులూరు గ్రామములో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పసుపు, కంది, మినుము, మొదలగు మెట్ట పంటలు పండుతాయి.

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

ఈ గ్రామములో అందరు వ్యవసాయము పైన ఆధార పడి ఉన్నవాళ్ళే ఎక్కువ. రైతులు, కూలీలు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

బ్రిటిషు కాలంలో ఈ గ్రామంలోనే పోలీసుస్టేషను ఉండేది. ఇప్పటికీ దాని శిథిలాలు గ్రామస్తులకు తీపి గుర్తులుగా మిగిలినవి. [2]

గణాంకాలు[మార్చు]

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 6888
  • పురుషుల సంఖ్య 3517
  • మహిళలు 3371
  • నివాస గృహాలు 1826
  • విస్తీర్ణం 1295 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు
జనాభా (2011) - మొత్తం 7,083 - పురుషుల సంఖ్య 3,550 - స్త్రీల సంఖ్య 3,533 - గృహాల సంఖ్య 1,996

మూలాలు[మార్చు]

[2] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి, 2012,జులై-12; 1వపేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2013,ఆగస్టు-3; 1వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2014,జనవరి-30; 2వపేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2014,మే-19; 2వపేజీ.

  1. నూరేళ్ళ తెనాలి ఘనచరిత్ర, రచన బిళ్ళా జవహర్ బాబు, ముద్రణ 2010, పేజీ 15
  2. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx

వెలుపలి లింకులు[మార్చు]