దాసగణు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గణపతిరావ్ దత్తాత్రేయ సహస్రబుద్ధే (దాసగణు)

బాబా గురించి హరికథల ద్వారా కీర్తనల ద్వారా ప్రచారం చేసిన భాగ్యశాలి దాసగణు అతని అసలు పేరు గణపతిరావ్ దత్తాత్రేయ సహస్రబుద్ధే అతడొక పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంలో ప్రమోషన్లు తెచ్చుకుని సమాజంలో గొప్పగా బ్రతకాలని అతని కోరిక. ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి భగవంతునిపై భక్తి పెద్దగా లేకపోయినా అలవాటుగా ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించేవాడు ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ ఉండేవాడు అటువంటి దాసగణులో భక్తిని పెంపొందించి హరికథలు కీర్తనలు ద్వారా తమను కీర్తిస్తూ పుణ్యజీవితం గడిపేలా చేసారు సాయి.

దాసగణుకు "తమాషా" లనే వీధి నాటకాలలో ఆడవేషం వేసి "లావణీ" లనే ఆశుకవిత్వం చెబుతూ ప్రజలను మెప్పించడమంటే చాలా ఇష్టం నానా చందోర్కర్ అనే భక్తుని ద్వారా మొట్టమొదటి సారి బాబాను దర్శించాడు దాసగణు బాబా దాసగణును చూడగానే అతడేమీ చెప్పకముందే "ఇతడు వీధి నాటకాలలో పాల్గొనడం ఉద్యోగం చేయడం మానుకోవాలి" అన్నారు కళలు భగవంతుని సేవించేందుకు ఉపయోగపడాలి కానీ ప్రజలను మెప్పించడం కోసం ఉపయోగపడకూడదని బాబా బోధించ దలచారు అలాగే భగవంతుని సేవలో జీవితం గడపాలి అందుకు ఉద్యోగం ఉపాధికి మాత్రమే ఉపయోగపడాలి ఈ విషయం దాసగణుకు బోధించదలచారు బాబా.

దాసగణు వెంటనే తమాషాలను మానేశాడు కానీ ఉద్యోగం మానుకోవడం మాత్రం అతని వల్ల కాలేదు బాబా అతనితో ఒకసారి "నీవు ఉద్యోగం మానాలంటే ఏమి చేయాలో నాకు తెలుసు" అన్నారు. ఒకసారి ఒక పేరు మోసిన దొంగను పట్టుకోవడానికి కొంతమంది పోలీసులను తీసుకుని వెళ్ళాడు దాసగణు ఆ దొంగ మిగిలిన పోలీసులను చంపేశాడు దాసగణు ప్రాణభయంతో ఆ ఆపద తొలిగితే ఉద్యోగం మానేస్తానని మొక్కుకున్నాడు అతడికి ఆ ఆపద తొలగిపోయింది అప్పుడు ఉద్యోగం మానేసాడు దాసగణు.

దాసగణుకు సాయి ముస్లిమేమోననే అనుమానం ఉండేది కనుక బ్రాహ్మణుడైన తానూ ముస్లిమైన సాయిని సేవించవచ్చో లేదోనని సందేహించేవాడు అతడు ఈ విషయం ఎంతోమంది మహాత్ములను సాధువులను అడిగాడు కూడా వారంతా సాయి కులమతాల కతీతుడైన భగవంతుడేనని సమర్ధ సద్గురుడని కనుక అతడు బాబాను నిస్సందేహంగా సేవించవచ్చనీ చెప్పారు అయినా అతడి అనుమానం తీరలేదు ఒకసారి బాబా తమ పాదాలనుండి గంగాయమునలు ప్రసాదించి తాము సకల తీర్ధ స్వరూపుడైన భగవంతుడేనని అతనికి నిరూపించారు.

దాసగణు ప్రతి సంవత్సరము రెండు నెలలు పండరిలో గడిపేవాడు ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించేవాడు కానీ అతడెప్పుడూ పుణ్యక్షేత్రాలకు వెళతానన్నా బాబా అతనిని వెళ్లనిచ్చేవారు కాదు సకల దేవతా స్వరూపుడైన సాయి ఉన్న శిరిడీ కంటే గొప్ప క్షేత్రమేమున్నది? ఈ విషయం తెలుసుకోకుండా ఊరికే పుణ్య క్షేత్రాలు దర్శిస్తే ఉపయోగముండదని అతనికి బోధించదలచారు బాబా.

స్వతహాగా ఆచారవంతుడవడం వల్ల పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉండడం వల్ల తానెంతో గొప్ప భక్తుడనే అహంకారం దాసగణుకు ఉండేది నిజానికి సదాచారం పాటించడం వల్ల, పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల నిరంహంకారము, వినమ్రత, వివేకము, వైరాగ్యము, భగవంతునికి శరణాగతి అలవడాలి. అప్పుడే భగవంతుడి నిజమైన సాక్షాత్కారం లభిస్తుంది అవి లేనిదే భగవంతుడే సాక్షాత్కరించినా మనము గుర్తించలేము ఈ విషయాన్నే అతనికి బోధించదలచారు బాబా అందుకే అతడు భగవంతుని సాక్షాత్కారం ప్రసాదించమంటే "ఇదే భగవంతుని సాక్షాత్కారం నన్ను చూడు" అన్నారు సాయి తామే భగవంతుడనని సమర్ధ సద్గురువునని బాబా అతనికి స్పష్టంగా తెలిపారు.

భగవంతుని సాక్షాత్కారం కావాలంటే అందుకు తగిన అర్హత సాధించాలి అంటే భగవంతుని తత్త్వం అర్ధం కావాలి ఆయన లీలలు బోధలు గానం చేస్తుంటే భగవంతుని తత్త్వం మనస్సుకు స్పస్టమై ఆయనను సరిగ్గా శరణు పొందడం సాధ్యమౌతుంది అందుకే దాసగణుకు హరికథలు గానం చేయడం కీర్తనలు పాడడం సాధనగాను ఉపాధిగానూ విధించారు సాయి తద్వారా మన సాధనకుపకరించే జీవనోపాధిని కల్పించుకోవాలని సాయి బోధించారు అప్పుడు మన నిత్య జీవితం సాధనలో భాగమైపోతుంది భగవంతుని సేవలో సన్నిధిలో హాయిగా గడిచిపోతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=దాసగణు&oldid=1986127" నుండి వెలికితీశారు