దాసరి లోకేష్ వశిష్ట
స్వరూపం
దాసరి లోకేష్ వశిష్ట | |
|---|---|
| 1991 జనవరి 5 | |
| వృత్తి | జర్నలిస్ట్, సినిమాటోగ్రాఫర్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 2013 – ప్రస్తుతం |
| Spouse | దాసరి శ్రావణి వశిష్ట |
| పిల్లలు | త్రిదార వశిష్ట యజ్ఞశ్రీ వశిష్ట యశో శౌర్యా వశిష్ట |
దాసరి లోకేష్ వశిష్ట (జననం: 1991 జనవరి 5) భారతీయ జర్నలిస్ట్ సినిమాటోగ్రాఫర్. ప్రస్తుతం CNN న్యూస్ 18 తెలుగు ఛానల్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లా రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. చలనచిత్ర రంగంలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్, అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ ఆపరేటివ్ కెమెరామన్‌గా పనిచేసిన అనుభవం ఉంది.దాసరి లోకేష్ వశిష్ట సినిమాటోగ్రాఫర్ వర్క్ చెసి తరువాత జర్నలిస్ట్ గా మారాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]దాసరి లోకేష్ వశిష్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి పట్టణంలో దాసరి ఉత్తన్న, దాసరి జ్ఞానమ్మ దంపతులకు జన్మించాడు.
విద్య
[మార్చు]- శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ (B.Sc) డిగ్రీ పూర్తి చేశారు.
- చెన్నై ఫిల్మ్ స్కూల్ లో కెమెరా విభాగంలో డి.ఎఫ్. టెక్ (DF Tech) పూర్తి చేశారు.
చలనచిత్ర ప్రస్థానం
[మార్చు]డి.ఎఫ్. టెక్ పూర్తి చేసిన తరువాత తెలుగు చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు.
- అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిఊహలు గుసగుసలాడే జో అచ్యుతానంద సినిమాలకు అసిస్టెంట్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
- రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అనుక్షణం సినిమాకి ఆపరేటివ్ కెమెరామన్‌గా పనిచేశారు.
జర్నలిజం
[మార్చు]చలనచిత్ర రంగంతో పాటు జర్నలిజంలో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు.
- 2024 నుండి CNN న్యూస్ 18 తెలుగు లో ఉమ్మడి అనంతపురం జిల్లా రిపోర్టర్‌గా పని చేస్తున్నారు.
- ఇప్పటివరకు న్యూస్ 18 తెలుగులో 1000కి పైగా వార్తా కథనాలు చేశారు.
- 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా బీబీసీ తెలుగు కోసం ఫ్రీలాన్స్ కెమెరా పర్సన్‌గా పనిచేశారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]దాసరి లోకేష్ వశిష్ట భార్య పేరు దాసరి శ్రావణి వశిష్ట. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు:
- త్రిదార వశిష్ట
- యజ్ఞశ్రీ వశిష్ట
- యశో శౌర్యా వశిష్ట