దాహ్యాబాయి పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాహ్యాబాయి పటేల్
వ్యక్తిగత వివరాలు
జననం1906
మరణం1973 (aged 66–67)
తండ్రిVallabhbhai Patel

దాహ్యాబాయి పటేల్ (1906[1]–1973) భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభభాయి పటేల్ కుమారుడు. అతను భారత పార్లమెండు సభ్యునిగా తన సేవలనందించాడు. అతను బొంబాయిలో విద్యాభ్యాసం చేసాడు. గుజరాత్ విద్యాపీఠ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. తరువాత ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగిగా చేరి బొంబాయిలో స్థిరపడ్డాడు. అతని మొదటి భార్య యశోధ మరణించింది. అతనికి బిపిన్ అనే కుమారుడు కలడు. తరువాత అతను భానుమతిని వివాహం చేసుకున్నాడు. వారికి గౌతం అనే కుమారుడు కలిగాడు. అతను ప్రాథమికంగా వ్యాపారవేత్త అయినప్పటికీ భారత స్వాతంత్ర్య సమరంలో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942 నుండి 1944 వరకు జైలు శిక్ష అనుభవించాడు.

భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాఅత అతను 1962 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభకు ఎన్నికైనాడు. తరువాతి కాలంలో రాజ్యసభ సభ్యునిగా కూడా తన సేవలనందించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "Birth anniversary: Interesting facts about Sardar Vallabhbhai Patel", Mid Day, 31 October 2016, archived from the original on 24 జూలై 2017, retrieved 13 జనవరి 2019
  2. "Members of Rajya Sabha". Archived from the original on 14 ఫిబ్రవరి 2019. Retrieved 12 July 2012.