దిండోరీ జిల్లా
దిండోరీ జిల్లా
दिन्डोरी जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | jabalpur |
ముఖ్య పట్టణం | Dindori, Madhya Pradesh |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,128 కి.మీ2 (2,366 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 7,04,218 |
• జనసాంద్రత | 110/కి.మీ2 (300/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 65.47% |
• లింగ నిష్పత్తి | 1004 |
Website | అధికారిక జాలస్థలి |
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో దిండోరీ జిల్లా ఒకటి.దిండోరీ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా జబల్‌పూర్ డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 6,128 చ.కి.మీ. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర తూర్పు భూభాగంలో చత్తీస్‌ఘడ్ సరిహద్దులో ఉంది.
సరిహద్దులు
[మార్చు]జిల్లా తూర్పు సరిహద్దులో మండ్లా జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఉమరియా జిల్లా, దక్షిణ సరిహద్దులో చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన బిలాస్‌పూర్ జిల్లా ఉన్నాయి.
విభాగాలు
[మార్చు]జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి :-దిందోరి, షాపురా, మెహంద్వని, అమర్పుర్, బజగ్, కరంజియ, సమ్నపుర్.
ప్రజలు
[మార్చు]జిల్లాలో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకు చెందిన బైగా ప్రజలు 64% ఉన్నారు. వీరిని ఈ ప్రానానికి చెందిన స్థానికులుగా భావిస్తున్నారు.
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దిండోరీ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]
జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో గోధుమ, వరి, మొక్కజొన్న, కొడొ - కుత్కి, రాంతిల్, ఆవాలు, మసూర్, మాతర్, పప్పుధాన్యాలు, అల్సి, సోయాబీన్ ప్రధానంగా పండించబడుతున్నాయి..
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 704,218, [2] |
ఇది దాదాపు. | భూటాన్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 501వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 94 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21.26%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1004:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 65.47%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
ఖనిజ వనరులు
[మార్చు]- బాక్సైట్ : ఈ ఖనిజ కుకురి దాదర్ (బాల్కో) లో అందుబాటులో ఉంది.
- బొగ్గు : ఈ ఖనిజ దుల్లాపూర్ (షాపురా) లో అందుబాటులో ఉంది.
- 'ఒక్రాస్' : ఈ ఖనిజ అమ్నిపిపరియ, లొడాఝిర్మల్, అమ్నిపిపరియా ఆర్.వై.టి అందుబాటులో ఉంది.
- వైట్ యాష్ : ఈ ఖనిజ ముద్కి మాల్ లో అందుబాటులో ఉంది.
- హై ఐరన్ లాటరైట్ : ఈ ఖనిజ పదరియా మల్, పదరియ, కలామల్, నయాగయోన్ మాల్ లో అందుబాటులో ఉంది.
- 'సున్నపురాయి ' : ఈ ఖనిజ బాసి కియరి, కంహరి అందుబాటులో ఉంది.
- 'కాటరైట్ ': ఇది ఖనిజ నివాస్ మాల్ లో అందుబాటులో ఉంది.
భాషలు
[మార్చు]దిండోరీ జిల్లాలో పలు భాషలు వాడుకలో ఉన్నాయి. చత్తీస్‌గరి, 72.91% హిందీ భాషను పోలి ఉన్న బఘేలి భాష ప్రజలలో అధికంగా వాడుకలో ఉంది.[5] (జర్మన్ భాషతో పోలిస్తే జర్మన్ భాష 60% ఆంగ్లభాషను పోలి ఉంటుంది ) [6] ఈ భాష 7 800 000 మంది భగేల్‌ఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది[5]
వృక్షశిలాజాలు
[మార్చు]దినోదరి జిల్లా " ది ఘుఘుయా ఫాసిల్ నేషనల్ పార్క్ మధ్య ప్రదేశ్ "లో అపురూపమైన వృక్షసంబంధిత అమూల్యమైన శిలాజ సంపద ఉంది. ఈ శిలాజాలు 31 గెనరాకు చెందిన 18 వృక్షకుంటుమాలకు చెందినవని భావిస్తున్నారు . ఈ వృక్షాలు ఈ ప్రాంతంలో జీవ ఆవిర్భావం గురించిన పలు రహస్యాలను వెలువరుస్తున్నాయి. ఈ శిలాజాలు 66 మిలియన్ సంవత్సరాల పూర్వపువని భావిస్తున్నారు. చక్కగా సరంక్షించబడుతున్న ఈ శిలాజాలలో వృక్షాలు, క్లైంబర్స్, పండ్లు, విత్తనాలు కనుగొనబడ్డాయి. వీటిలో పలు ఏకదళబీజ వృక్షాలు ఉన్నాయి. 66 మిలియన్ సంవత్సరాల పూర్వం నాటివని భావిస్తున్న శిలాజాలు " ఘుఘుయా ఫాసిల్ పార్క్‌లో చక్కగా సంరక్షించబడుతున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Bhutan 708,427
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Alaska 710,231
- ↑ 5.0 5.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
వెలుపలి లింకులు
[మార్చు]- Dindori District
- [1] List of places in Dindori