దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ
Jam-Shri-Digvijaysinhji-Ranjitsinhji-Jadeja-Maharaja-Jam-Saheb-of-Nawanagar.jpg
నవానగర్ మహారాజా జామ్ సాహిబ్
Reign1933–1948
Predecessorరంజిత్‌సింగ్‌జీ
Successorరాచరికం రద్దు చేయబడింది
నవానగర్ కు చెందిన జామ్ సాహెబ్ (నామమాత్ర)
Reign1948–1966
Predecessorరంజిత్‌సింగ్‌జీ
Successorశత్రుసల్యసింగ్‌జీ
జననం(1895-09-18)1895 సెప్టెంబరు 18
సడోదర్
మరణం1966 మార్చి 2(1966-03-02) (వయసు 70)
ముంబాయి
Spouseవివాహం| మహారాజకుమారి బైజీ రాజ్ శ్రీ కాంచన్ కున్వెర్బా సాహిబా |26 ఏప్రిల్ 1923
Issue
  • శత్రుసల్యసింగ్‌జీ
  • హెచ్. హెచ్. జామ్ సాహెబ్
Names
దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా
Houseనవానగర్
Military career
సేవలు/శాఖ British Indian Army
సేవా కాలం1919–1947
దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతివాటం
బౌలింగ్ శైలి కుడిచేతి
పాత్ర బ్యాట్స్ మ్యాన్
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1933–1934 వెస్టర్న్ ఇండియా
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ క్లాస్
మ్యాచులు 1
Runs scored 6
బ్యాటింగ్ సరాసరి 3.00
100s/50s 0/0
అత్యధిక స్కోరు 6
క్యాచులు/స్టంపులు 0/–
Source: CricInfo, 8 June 2019

దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా ( 1895 సెప్టెంబరు 18 - 1966 ఫిబ్రవరి 3) గుజరాత్ లోని నవానగర్ పట్టణానికి మహారాజు. ఇతను యదువంశీ రాజ్‌పుత్ వంశానికి చెందినవాడు. ఇతను ప్రఖ్యాత క్రికెటర్ రంజిత్‌సింగ్‌జీ మేనల్లుడు.[1]

ప్రారంభ జీవితం[మార్చు]

దిగ్విజయ్‌సింగ్‌జీ 1895 సెప్టెంబరు 18న సడోదర్‌లో జన్మించాడు. అతని మేనమామ అయిన రంజిత్‌సింగ్‌జీ ఇతన్ని దత్తత తీసుకున్నాడు.[2] ఇతను సౌరాష్ట్రలోని రాజ్‌కోట్‌లోని రాజ్‌కుమార్ కాలేజీలో, ఆ తర్వాత మాల్వెర్న్ కాలేజీలో, యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో చదువుకున్నాడు.

సైనిక వృత్తి[మార్చు]

1919లో బ్రిటిష్ ఆర్మీలో సెకండ్ లెఫ్టినెంట్‌గా నియమించబడ్డారు.[3] 1920లో ఈజిప్షియన్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్‌లో పనిచేసి, 1921లో లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందాడు. ఆ తరువాత 1922 నుండి 1924 వరకు వజీరిస్తాన్ ఫీల్డ్ ఫోర్స్లో పనిచేసి 1929లో కెప్టెన్‌గా పదోన్నతి పొందిన తరువాత, అతను 1931లో 1931లో సైన్యం నుండి పదవీ విరమణ చేసాక 1947 వరకు లెఫ్టినెంట్-జనరల్ గా ఇండియన్ ఆర్మీలో పనిచేసాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

1935 మార్చి 7న సిరోహిలో, సర్ దిగ్విజయ్‌సింగ్‌జీ మహారాజకుమారి బైజీ రాజ్ శ్రీ కంచన్ కున్వెర్బా సాహిబా (1910-1994) ను వివాహం చేసుకున్నారు, ఈమె సిరోహి మహారావ్ మహారాజాధిరాజ్ మహారావు శ్రీ సర్ సరూప్ రామ్ సింగ్‌జీ బహదూర్ రెండవ కుమార్తె. ఈ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మహారాజా జామ్ సాహిబ్[మార్చు]

1933లో అతని మేనమామ మరణానంతరం, దిగ్విజయ్‌సింగ్‌జీ మహారాజా జామ్ సాహిబ్ అయ్యాడు, తన మేనమామ అభివృద్ధి, ప్రజా సేవ విధానాలను కొనసాగించాడు. 1935లో నైట్ హోదా (బిరుదు) పొందిన సర్ దిగ్విజయ్‌సింగ్ జీ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌లో చేరారు, దీనికి 1937 నుండి 1943 వరకు అధ్యక్షుడిగా నాయకత్వం వహించారు. తన మేనమామ క్రికెట్ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, అతను 1937-1938లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా పనిచేశాడు. అనేక ప్రముఖ క్రీడా క్లబ్‌లలో సభ్యుడు. అతను 1933-34 సీజన్‌లో ఒకే ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు, భారతదేశం, సిలోన్ పర్యటనలో ఎంసిసికి వ్యతిరేకంగా వెస్ట్రన్ ఇండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు .అతను తన రెండు ఇన్నింగ్స్‌లలో 0, 6 పరుగులు చేశాడు, అతని సోదరుడు ప్రతాప్‌సింగ్‌జీ ఆడిన ఏకైక ఫస్ట్-క్లాస్ మ్యాచ్ కూడా ఇదే. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, సర్ దిగ్విజయ్‌సింగ్‌జీ ఇంపీరియల్ వార్ క్యాబినెట్, నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్‌తో పాటు పసిఫిక్ వార్ కౌన్సిల్‌లో పనిచేశారు.

ది గుడ్ మహారాజా[మార్చు]

పోలాండ్ శరణార్ధులతో మహారాజు

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942లో సోవియట్ సైన్యం పోలాండ్లో 2 నుండి 17 ఏళ్ళ మధ్య వయసున్న 600 మందికి పైగా పిల్లలని ఒక నౌకలో ఎక్కించి శరణార్థులుగా పంపించారు. ఆ నౌక ఎక్కడ ఆగిన కూడా ఎవరు ఆశ్రయం ఇవ్వలేదు. ఆ నౌక గుజరాత్ తీరంలోని నవానగర్ కి వచ్చినపుడు దిగ్విజయ్‌సింగ్‌జీ ఆశ్రయం కల్పించారు. వారి కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసారు. ఆ తర్వాత 1946 లో వారిని తిరిగి పోలాండ్ పంపించారు. ఆ తరువాత పోలాండ్, పోలిష్ రిపబ్లిక్ గా ఏర్పాటు అయిన తర్వాత "కమాండర్స్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్" అవార్డుతో సత్కరించింది. 2013లో వార్సాలోని ఒక జంక్షన్ కు 'ది గుడ్ మహారాజా స్క్వేర్' అని పేరు పెట్టారు[4]. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నవానగర్‌ను యునైటెడ్ స్టేట్ ఆఫ్ కతియావార్‌లో విలీనం చేశాడు, భారత ప్రభుత్వం ఈ పదవిని రద్దు చేసే వరకు దానికి రాజప్రముఖ్‌గా పనిచేశాడు.

అంతర్జాతీయ సంస్థల ప్రతినిధి[మార్చు]

వార్సా లోని మెమోరియల్

దిగ్విజయ్‌సింగ్‌జీ 1920 లో లీగ్ ఆఫ్ నేషన్స్ కి భారతదేశానికి ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించారు, యుఎన్ భారత ప్రతినిధి బృందానికి డిప్యూటీ లీడర్‌గా కూడా ఉన్నాడు, కొరియా యుద్ధం తరువాత, యుఎన్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్, కొరియన్ పునరావాసంపై యుఎన్ నెగోషియేటింగ్ కమిటీ రెండింటికీ అధ్యక్షత వహించాడు.

గౌరవాలు[మార్చు]

Ord.Stella.India.jpg Order of the Indian Empire Ribbon.svg India General Service Medal 1909 BAR.svg India Service Medal BAR.svg

39-45 Star BAR.svg Africa Star BAR.svg Pacific Star BAR.svg War Medal 39-45 BAR.svg

GeorgeVSilverJubileum-ribbon.png GeorgeVICoronationRibbon.png Indian Independence medal 1947.svg 3rd class

  • ఇండియా జనరల్ సర్వీస్ మెడల్ -1924
  • కింగ్ జార్జ్ V సిల్వర్ జూబ్లీ మెడల్ -1935
  • కింగ్ జార్జ్ VI పట్టాభిషేక పతకం -1937
  • నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (GCIE) -1939
  • 1939-1945 స్టార్ -1945
  • ఆఫ్రికా స్టార్ -1945
  • పసిఫిక్ స్టార్ -1945
  • యుద్ధ పతకం 1939-1945 -1945
  • నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా (GCSI) -1947 (KCSI-1935)
  • ఇండియా సర్వీస్ మెడల్ -1945
  • భారత స్వాతంత్ర్య పతకం -1947
  • కమాండర్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్ (మరణానంతరం) – 2011.

మరణం[మార్చు]

33 సంవత్సరాల పాలన తర్వాత, సర్ దిగ్విజయ్‌సింగ్‌జీ 1966 ఫిబ్రవరి 3న బొంబాయిలో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "About: Digvijaysinhji Ranjitsinhji". dbpedia.org. Retrieved 2022-03-05.
  2. "Maharaja Jam Sahib of Nawanagar: Great Indian by Heart". Times of India Blog (in ఇంగ్లీష్). 2019-02-14. Retrieved 2022-03-05.
  3. "Jam Shri Digvijaysinhji Ranjitsinhji Jadeja, Maharaja Jam Saheb of Nawanagar - National Portrait Gallery". www.npg.org.uk (in ఇంగ్లీష్). Retrieved 2022-03-05.
  4. "Sakshi Telugu Daily Hyderabad Main epaper dated Sat, 5 Mar 22". epaper.sakshi.com. Archived from the original on 2022-03-05. Retrieved 2022-03-05.