Jump to content

దిగ్విజయ్ సింగ్ (బిహార్ రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి

దిగ్విజయ్ సింగ్
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి
In office
21 నవంబర్ 1990 – 22 డిసెంబర్ 1991
ప్రధాన మంత్రిచంద్రశేఖర్
కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి
In office
28 నవంబర్ 1990 – 22 జూన్ 1991
ప్రధాన మంత్రిచంద్రశేఖర్
రైల్వే శాఖ మంత్రి
In office
13 అక్టోబర్ 1999 – 21 జూలై 2001
ప్రధాన మంత్రిఅటల్ బిహారీ వాజపేయి
అంతకు ముందు వారుబంగారు లక్ష్మణ్
తరువాత వారుఓ. రాజగోపాల్
వ్యక్తిగత వివరాలు
జననం(1955-11-14)1955 నవంబరు 14
గిధౌర్ బీహార్, భారతదేశం
మరణం2010 జూన్ 24(2010-06-24) (వయసు: 54)
లండన్, ఇంగ్లాండ్
జీవిత భాగస్వామిపుతుల్ కుమారి
సంతానంశ్రేయస్ సింగ్ సహా ఇద్దరు కుమార్తెలు
నివాసంగిధౌర్, బీహార్
కళాశాలపట్నా విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, టోక్యో విశ్వవిద్యాలయం

దిగ్విజయ్ సింగ్ ( 1955 నవంబర్ 14– 2010 జూన్ 24) భారతీయ రాజకీయ నాయకుడు, బీహార్ రాష్ట్రానికి చెందిన వారు. ఆయన జార్జ్ ఫెర్నాండిస్‌ సన్నిహితుడు, జనతాదళ్ తరువాత సమతా పార్టీలో సభ్యుడు.[1] ఆయన బాంకా పార్లమెంట్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు అనేకసార్లు ఎన్నికయ్యారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.

ప్రారంభ జీవితం విద్య

[మార్చు]

దిగ్విజయ్ సింగ్ బీహార్ రాష్ట్రం లోని జముయ్ జిల్లా గిధౌర్లో జన్మించారు. ఆయన కుమార్ సురేంద్ర సింగ్, సోనా దేవి దంపతుల కుమారుడు. పట్నా విశ్వవిద్యాలయంలో చదివి, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఎం పి హెచ్ ఎల్ పూర్తి చేశారు. తర్వాత కొంతకాలం టోక్యో విశ్వవిద్యాలయంలో కూడా చదివారు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1983లో చంద్రశేఖర్ భారత యాత్రలో పాల్గొన్నారు.[3]

1990లో రాజ్యసభకు ఎన్నికై, 1996 వరకు పనిచేశారు. జార్జ్ ఫెర్నాండెజ్ సమతా పార్టీని స్థాపించినప్పుడు, నితీష్ కుమార్తో కలిసి దిగ్విజయ్ సింగ్ ఆ పార్టీకి వ్యవస్థాపక సభ్యులలో ఒకరుగా ఉన్నారు. ఆయన 1998 1999 లో బాంకా నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.[4]

కేంద్ర మంత్రిగా

[మార్చు]

దిగ్విజయ్ సింగ్ 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఆర్థిక విదేశాంగ శాఖ సహాయ మంత్రి గా పనిచేశారు. తరువాత అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం (1999–2004) కాలంలో రైల్వే, వాణిజ్య విదేశాంగ శాఖ సహాయ మంత్రి గా మంత్రిగా పనిచేశారు.[5]

క్రీడా రంగంలో

[మార్చు]

దిగ్విజయ్ సింగ్ 1999 నుంచి మరణించే వరకు భారత జాతీయ షూటింగ్ సంఘం (NRAI) అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన పదవీకాలంలోనే భారత షూటర్లు రెండు ఒలింపిక్ పతకాలు సాధించారు — రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ (2004) అభినవ్ బింద్రా (2008).[6]

మరణం

[మార్చు]

2010 జూన్‌లో లండన్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయనకు మెదడు లో రక్తస్రావం జరిగింది. జూన్ 24న మరణించారు. ఆయన అంత్యక్రియలు బీహార్‌లోని గిధౌర్ వద్ద నక్తి నది తీరంలో జరిగాయి.[7]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన భార్య పుతుల్ కుమారి కూడా రాజకీయ నాయకురాలు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిలో ఒకరు శ్రేయసి సింగ్ — ఆమె భారతదేశానికి షూటింగ్ క్రీడాకారిణిగా కామన్‌వెల్త్ క్రీడలు లో బంగారు పతకం సాధించింది.[8]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Former Union minister Digvijay Singh dead". Hindustan Times. Retrieved 5 సెప్టెంబరు 2020.
  2. ↑ "Digvijay Singh Biography - About family, political life, awards won, history". Elections in India. Retrieved 5 సెప్టెంబరు 2020.
  3. ↑ "Digvijay Singh, Bihar". The Times of India.
  4. ↑ "Banka bypoll: Digvijay's wife likely to have smooth sailing". Indian Express. Retrieved 5 సెప్టెంబరు 2020.
  5. ↑ "Ministers in Atal Bihari Government". PMO India.
  6. ↑ "Digvijay Singh slams Bihar government over Mahabodhi shrine security". The Economic Times. Retrieved 5 సెప్టెంబరు 2020.
  7. ↑ "Bihar MP Digvijay Singh passes away". The Hindu. PTI. 24 జూన్ 2010. Retrieved 5 సెప్టెంబరు 2020.
  8. ↑ "CWG: Bihar girl Shreyasi Singh shoots historic gold". Times of India. Retrieved 5 సెప్టెంబరు 2020.

బాహ్య లింకులు

[మార్చు]