దినకర్ బల్వంత్ దేవధర్
1996లో దేవధర్ జ్ఞాపకార్థం విడుదలైన భారత తపాలా బిళ్ళ | |||||||||||||||||||||||||||
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 1892 జనవరి 14 పూనా, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | ||||||||||||||||||||||||||
| మరణించిన తేదీ | 1993 ఆగస్టు 24 (వయసు: 101) పుణె, మహారాష్ట్ర, భారత్ | ||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||
| బౌలింగు | లెగ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 7 July 2019 | |||||||||||||||||||||||||||
దినకర్ బల్వంత్ దేవధర్ (14 జనవరి 1892 – 24 ఆగస్టు 1993) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఈయన 1911 నుండి 1948 వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు.
క్రికెట్ ప్రస్థానం
[మార్చు]దేవధర్ బ్రిటిష్ ఇండియాలోని పూనా (ప్రస్తుతం పుణె) లో జన్మించారు. పూణెలోని పూణె కాలేజీలో సంస్కృతం ప్రొఫెసర్‌గా పనిచేశారు.[1]
భారత క్రికెట్ పితామహుడిగా (Grand Old Man of Indian Cricket) పేరుగాంచిన దేవధర్, దూకుడుగా ఆడే కుడిచేతి వాటం బ్యాట్స్‌మ్యాన్, లెగ్ బ్రేక్ బౌలర్. 1939 నుండి 1941 వరకు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో మహారాష్ట్ర క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 81 మ్యాచ్‌లు ఆడి, 39.32 సగటుతో 4,522 పరుగులు చేశారు. ఈయన అత్యధిక స్కోరు 246 పరుగులు.[2]
దేవధర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడిగా, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, జాతీయ జట్టు సెలెక్టరుగా బాధ్యతలు నిర్వర్తించారు.
బిల్ యాష్‌డౌన్ లాగే దేవధర్ కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన కొద్దిమంది ఆటగాళ్లలో ఒకరు. 1911లో బొంబాయి ట్రయాంగులర్ లోను, 1946లో రంజీ ట్రోఫీ లోను ఈయన ఆడారు.[3] 1944లో నవనగర్ క్రికెట్ జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.[4] ఆ సమయంలో ఈయన వయసు 53 ఏళ్లు.[5]
భారత ప్రభుత్వం ఈయనకు 1965లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ పురస్కారాలను అందజేసింది.[6] నూరేళ్లు జీవించిన మొదటి భారతీయ ఫస్ట్-క్లాస్ క్రికెటర్‌గా ఈయన గుర్తింపు పొందారు. వసంత్ రాయ్ జీ 2020లో ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా నిలిచారు.[7]
వ్యక్తిగత జీవితం
[మార్చు]భారత మాజీ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్లు తారా దేవధర్, సుందర్ దేవధర్, సుమన్ దేవధర్ ఈయన కుమార్తెలు.[8]
గుర్తింపు
[మార్చు]భారతదేశంలో 1973 నుండి జరుగుతున్న లిమిటెడ్ ఓవర్ల అంతర్-మండల క్రికెట్ టోర్నమెంట్‌కు ఈయన గౌరవార్థం 'దేవధర్ ట్రోఫీ' అని పేరు పెట్టారు. 1996లో భారత తపాలా శాఖ ఈయన స్మారక బిళ్ళను విడుదల చేసింది. 2012లో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దేవధర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.[9]
మూలాలు
[మార్చు]- ↑ Krishnan, Sankhya (24 ఆగస్టు 2000). "Deodhar: Professor Emeritus of Indian cricket". ESPNcricinfo. Retrieved 7 జూలై 2019.
- ↑ "D. B. Deodhar". ESPNcricinfo. Retrieved 7 జూలై 2019.
- ↑ Coverdale, Brydon (11 మార్చి 2017). "It takes a rare cricketer to reach a century, not just make one". ESPNcricinfo. Retrieved 7 జూలై 2019.
- ↑ మూస:CricketArchive
- ↑ Bamzai, Sandeep (15 జూలై 1990). "98 Not Out !". The Indian Express. p. 23.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 జూలై 2015.
- ↑ "Vasant Raiji profile and biography, stats, records, averages, photos and videos".
- ↑ Nadkarni, Shirish (14 ఏప్రిల్ 2020). "Past Masters of Indian Badminton: The Deodhar sisters – Tara, Sunder, Suman dominated sport and left lasting legacy". First Post. Retrieved 2 సెప్టెంబరు 2024.
- ↑ Karhadkar, Amol (8 ఏప్రిల్ 2012). "Prof Deodhar immortalised in bronze". Hindustan Times. Retrieved 2 సెప్టెంబరు 2024.
బయటి లింకులు
[మార్చు]క్రిక్‌ఇన్ఫో లో దినకర్ బల్వంత్ దేవధర్ ప్రొఫైల్ ప్రొఫైల్
మూస:Padma Shri Award Recipients in Sports మూస:PadmaBhushanAwardRecipients 1990–99