Jump to content

దినేష్ ఫడ్నిస్

వికీపీడియా నుండి
దినేష్ ఫడ్నిస్
2010లో దినేష్ ఫడ్నిస్
జననం(1966-11-02)1966 నవంబరు 2
బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
మరణం2023 డిసెంబరు 5(2023-12-05) (వయసు: 57)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1998–2019
ప్రసిద్ధిసిపడి లో ఫ్రెడరిక్స్
భార్య / భర్తనయనా
పిల్లలు1

దినేష్ ఫడ్నిస్ (1966 నవంబరు 2 - 2023 డిసెంబరు 5), ఒక భారతీయ టెలివిజన్ నటుడు. విజయవంతమైన భారతీయ టీవీ షోలలో ఒకటైన సిఐడి లో ఆయన ఇన్స్‌పెక్టర్ ఫ్రెడెరిక్స్ పాత్రను పోషించి ప్రసిద్ధిచెందాడు.[1]

ఈ టెలివిజన్ ధారావాహికలో ఇన్స్‌పెక్టర్ గా నటించడమే కాకుండా, ఆయన సిఐడి లోని కొన్ని భాగాలను కూడా రాసాడు. ఆయన బాలీవుడ్ చిత్రాలు సర్ఫరోష్, సూపర్ 30లో కూడా నటించాడు. ఆయన ఒక మరాఠీ చిత్రానికి కూడా కథ అందించాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

దినేష్ ఫడ్నిస్ 1966 నవంబరు 2న ముంబై (అప్పటి బొంబాయి మహారాష్ట్ర)లో జన్మించాడు. ఆయన పాఠశాలలో ఉన్నప్పుడు నటనపై మక్కువ పెంచుకున్నాడు. వివిధ రంగస్థల నిర్మాణాల ద్వారా తన నటనా సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుని, నాటక నిర్మాణాలలో ఉత్సాహంగా నిమగ్నమయ్యాడు. తన పాఠశాల తరువాత, ఆయన తన సహజ ప్రతిభ, నిబద్ధతతో నటనను కెరీర్ గా ఎంచుకున్నాడు.[2] ఆయన బోరివలి తూర్పు లోని శాంతివన్ లో నివసించాడు.[3]

కెరీర్

[మార్చు]

దినేష్ ఫడ్నిస్ తన కెరీర్ 1990లలో ప్రారంభించాడు. ఆయన సిఐడి షోలో ఇన్స్‌పెక్టర్ ఫ్రెడెరిక్స్/ఫ్రెడ్డీ పాత్ర కోసం ఆడిషన్ చేయబడ్డాడు. ఈ కార్యక్రమం 1998లో ప్రారంభమైంది, ఆయన పాత్ర ఐకానిక్ గా మారింది. ఆయన హాస్యానికి ఈ పాత్ర బాగా ప్రసిద్ధి చెందింది. అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ ధారావాహిక 2018లో ముగిసింది.[4]

సిఐడితో పాటు, ఆయన సర్ఫరోష్ వంటి అనేక హిందీ సినిమాలు, అదాలత్, తారక్ మెహతా కా ఉల్టా చష్మా వంటి టీవీ షోలలో కూడా భాగంగా ఉన్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

దినేష్ ఫడ్నిస్ నయనాను వివాహం చేసుకున్నాడు. వారికి తను అనే కుమార్తె, ద్రువి అనే మనుమరాలు ఉన్నారు.[5]

మరణం

[మార్చు]

దినేష్ ఫడ్నిస్ 2023 డిసెంబరు 1న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరాడు.[6] ఆరోగ్యం విషమించడంతో ఆయన 2023 డిసెంబరు 5న, 57 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచాడు.[7][8][9][10]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
1999 సర్ఫరోష్ సబ్ ఇన్స్‌పెక్టర్
2000 మేళా 'మేలా దిలోం కా' పాటలో అతిధి పాత్ర
2001 ఆఫీసర్ ఇన్స్‌పెక్టర్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం షో పాత్ర గమనిక
1997 ఆహత్ అమిత్ సీజన్ 1 ఎపిసోడ్ 80
1998–2018 సిఐడి ఇన్స్‌పెక్టర్ ఫ్రెడెరిక్స్
2005 సిఐడి: స్పెషల్ బ్యూరో సబ్ ఇన్స్‌పెక్టర్ ఫ్రెడెరిక్స్
2012 అదాలత్ ఇన్స్‌పెక్టర్ ఫ్రెడెరిక్స్ అతిథి
2014 తారక్ మెహతా కా ఉల్టా చష్మా
2019 సీఐఎఫ్ కానిస్టేబుల్ శంభు తావ్డే సహాయక పాత్ర

మూలాలు

[మార్చు]
  1. Gupta, Gargi (27 July 2010). "The TV show with the highest ratings". Rediff.com. Retrieved 3 May 2019.
  2. "Who Was Dinesh Phadnis, Freddie Of CID? Age, Wife, Death, Net Worth & More".
  3. "Just what makes CID so popular". Rediff.com. 20 March 2012. Retrieved 3 May 2019.
  4. "Dayanand Shetty on CID going off-air: 'The channel should have informed us about it in advance". Times Now News. Archived from the original on 27 November 2019. Retrieved 27 November 2019.
  5. "'CID' actor Dinesh Phadnis shared pic with granddaughter in last post before death". Inshorts - Stay Informed (in ఇంగ్లీష్). Retrieved 2024-10-24.
  6. "'CID's' Dayanand Shetty Reveals Dinesh Phadnis Aka Fredericks Has Liver Damage: There's No Major Improvement".
  7. "CID fame Dinesh Phadnis passes away; co-star and close friend Dayanand Shetty confirms". The Times of India. 5 December 2023. Retrieved 5 December 2023.
  8. "Dinesh Phadnis, Fredericks of CID, passes away; last rites to be performed today". Hindustan Times (in ఇంగ్లీష్). 5 December 2023. Retrieved 5 December 2023.
  9. "'CID' fame actor Dinesh Phadnis dies at 57". The Hindu.
  10. "To Actor Dinesh Phadnis, Tributes From Team CID: "We Will Miss You Freddy Sir"".