దినోదొరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Dindori జిల్లా

दिन्डोरी जिला
Madhya Pradesh లో Dindori జిల్లా స్థానము
Madhya Pradesh లో Dindori జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంMadhya Pradesh
పరిపాలన విభాగముjabalpur
ముఖ్య పట్టణంDindori, Madhya Pradesh
విస్తీర్ణం
 • మొత్తం6 కి.మీ2 (2,366 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం7,04,218
 • సాంద్రత110/కి.మీ2 (300/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత65.47 per cent
 • లింగ నిష్పత్తి1004
జాలస్థలిఅధికారిక జాలస్థలి

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో దినోదొరి జిల్లా ఒకటి.దినోదొరి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా జబల్పూర్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 6,128 చ.కి.మీ. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర తూర్పు భూభాగంలో చత్తీస్‌ఘడ్ సరిహద్దులో ఉంది.

సరిహద్దులు[మార్చు]

జిల్లా తూర్పు సరిహద్దులో మండ్ల జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఉమరియ జిల్లా, దక్షిణ సరిహద్దులో చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన బిలాస్‌పూర్ జిల్లా ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి :-దిందోరి, షాపురా, మెహంద్వని, అమర్పుర్, బజగ్, కరంజియ మరియు సమ్నపుర్.

ప్రజలు[మార్చు]

జిల్లాలో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకు చెందిన బైగా ప్రజలు 64% ఉన్నారు. వీరిని ఈ ప్రానానికి చెందిన స్థానికులుగా భావిస్తున్నారు.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దినోదొరి జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో గోధుమ, వరి, మొక్కజొన్న, కొడొ - కుత్కి, రాంతిల్, ఆవాలు, మసూర్, మాతర్, పప్పుధాన్యాలు, అల్సి, సోయాబీన్ ప్రధానంగా పండించబడుతున్నాయి..

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 704,218, [2]
ఇది దాదాపు. భూటాన్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 501వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 94 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.26%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 1004:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 65.47%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

ఖనిజ వనరులు[మార్చు]

  • బాక్సైట్ : ఈ ఖనిజ కుకురి దాదర్ (బాల్కో) లో అందుబాటులో ఉంది.
  • బొగ్గు : ఈ ఖనిజ దుల్లాపూర్ (షాపురా) లో అందుబాటులో ఉంది.
  • 'ఒక్రాస్' : ఈ ఖనిజ అమ్నిపిపరియ, లొడాఝిర్మల్, అమ్నిపిపరియా ఆర్.వై.టి అందుబాటులో ఉంది.
  • వైట్ యాష్ : ఈ ఖనిజ ముద్కి మాల్ లో అందుబాటులో ఉంది.
  • హై ఐరన్ లాటరైట్ : ఈ ఖనిజ పదరియా మల్, పదరియ, కలామల్, నయాగయోన్ మాల్ లో అందుబాటులో ఉంది.
  • 'సున్నపురాయి ' : ఈ ఖనిజ బాసి కియరి, కంహరి అందుబాటులో ఉంది.
  • 'కాటరైట్ ': ఇది ఖనిజ నివాస్ మాల్ లో అందుబాటులో ఉంది.

భాషలు[మార్చు]

దినోదొరి జిల్లాలో పలు భాషలు వాడుకలో ఉన్నాయి. చత్తీస్‌గరి, 72.91% హిందీ భాషను పోలి ఉన్న బఘేలి భాష ప్రజలలో అధికంగా వాడుకలో ఉంది.[5] (జర్మన్ భాషతో పోలిస్తే జర్మన్ భాష 60% ఆంగ్లభాషను పోలి ఉంటుంది ) [6] ఈ భాష 7 800 000 మంది భగేల్‌ఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది[5]

వృక్షశిలాజాలు[మార్చు]

దినోదరి జిల్లా " ది ఘుఘుయా ఫాసిల్ నేషనల్ పార్క్ మధ్య ప్రదేశ్ "లో అపురూపమైన వృక్షసంబంధిత అమూల్యమైన శిలాజ సంపద ఉంది. ఈ శిలాజాలు 31 గెనరాకు చెందిన 18 వృక్షకుంటుమాలకు చెందినవని భావిస్తున్నారు . ఈ వృక్షాలు ఈ ప్రాంతంలో జీవ ఆవిర్భావం గురించిన పలు రహస్యాలను వెలువరుస్తున్నాయి. ఈ శిలాజాలు 66 మిలియన్ సంవత్సరాల పూర్వపువని భావిస్తున్నారు. చక్కగా సరంక్షించబడుతున్న ఈ శిలాజాలలో వృక్షాలు, క్లైంబర్స్, పండ్లు మరియు విత్తనాలు కనుగొనబడ్డాయి. వీటిలో పలు ఏకదళబీజ వృక్షాలు ఉన్నాయి. 66 మిలియన్ సంవత్సరాల పూర్వం నాటివని భావిస్తున్న శిలాజాలు " ఘుఘుయా ఫాసిల్ పార్క్‌లో చక్కగా సంరక్షించబడుతున్నాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Bhutan 708,427 line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Alaska 710,231 line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
  5. 5.0 5.1 M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  6. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "English". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దినోదొరి&oldid=2350797" నుండి వెలికితీశారు