దిబ్బగూడెం లక్ష్మీపురం
Appearance
దిబ్బగూడెం లక్ష్మీపురం, ఏలూరు జిల్లా, పెదవేగి మండలానికి చెందిన గ్రామం.[1]. ఇది పెదవేగి శివారు గ్రామం.[1] దిబ్బగూడెం సెంటర్ నుండి పాత విమానాశ్రయానికి వెళ్ళే దారిలో ఉన్నది. గ్రామం సమీపంలో మిరపకుంట చెరువు ఉంది. ఇక్కడి వ్యవసాయం మెరక పంటల వ్యవసాయం. మొక్కజొన్న, చెరకు, వరి, కొబ్బరి, ప్రొద్దు తిరుగుడు, పామాయిల్ ప్రధాన పంటలు.
వూళ్ళో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఒక రామాలయం ఉంది. ఈ గ్రామం సమీపంలో రెండు ప్రధానమైన నిర్మాణాలున్నాయి.
- పాత విమానాశ్రయం (రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో కట్టింది) ఆవరణలో జాతీయ నూనె గింజల పరిశోధనా సంస్థను నెలకొలిపారు.
- దానికి సమీపంలోనే సాయిబాబా గుడి ఉంది. అక్కడ వెయ్యి అడుగుల సాయిస్తూపం ఉంది.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.