దియోరియ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Deoria జిల్లా
देवरिया जिला
Uttar Pradesh జిల్లాలు
Uttar Pradesh రాష్ట్రంలో Deoria యొక్క స్థానాన్ని సూచించే పటం
Uttar Pradesh రాష్ట్రంలో Deoria యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Uttar Pradesh
డివిజన్ Gorakhpur
ముఖ్యపట్టణం [[Deoria]]
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Deoria
విస్తీర్ణం
 • మొత్తం 2
జనాభా (2011)
 • మొత్తం 3
 • సాంద్రత 1
జనగణాంకాలు
 • అక్షరాస్యత 73.53
 • లింగ నిష్పత్తి M:F 1000:1013
సగటు వార్షిక వర్షపాతం 864.38 మి.మీ
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో దియోరియా జిల్లా (హిందీ:) ఒకటి. దియోరియా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. దియోరియా జిల్లా గోరక్‌పూర్ డివిషన్‌లో భాగంగా ఉంది.

ఆసియా[మార్చు]

దియోరియ ప్రాంతం కోసల రాజ్యంలో భాగంగా ఉంది. కోసల రాజ్యం ఆర్యన్ సంప్రదాయ రాజ్యాలలో ఒకటి.

సరిహద్దు[మార్చు]

జిల్లా సరిహద్దులో హిమాలయాలు, దక్షిణ సరిహద్దులో ష్యండిక నది, పశ్చిమ సరిహద్దులో మగధ్ రాజ్యం, తూర్పు సరిహద్దులో బీహార్ రాష్ట్రం ఉన్నాయి.పురాణాలలో ఈ ప్రదేశ ప్రస్తావన ఉంది. జిల్లాలోని పలు ప్రదేశాలలో ఆర్కియాలజీ అవశేషాలు, శిల్పాలు, నాణ్యాలు, ఇటుకలు, ఆలయాలు మరియు బుధ్ మఠాలు కనుగొనబడ్డాయి.

పురాతన చరిత్ర ఆధారంగా ఈ నగరం గురించి రామాయణ కావ్యంలో ప్రస్తావించబడింది. రాముడు తన కుమారుడైన కుశుని కుశ్వంతి రాజ్యానికి పట్టాభిషిక్తుని చేసాడు. అదే ప్రస్తుత ల్హుషీనగర్. మహాభారత కాలానికి ముందు ఈ ప్రాంతం మహాసుదర్శన్ మల్లు రాజ్యంలో భాగంగా ఉందని విశ్వసిస్తున్నారు. ఈ జిల్లాకు సమీపంలో దట్టమైన అరణ్యం ఉంది. ఖుషినగర్ సకలసమృద్ధితో తులతూగిందని భావిస్తున్నారు. ఈ ప్రాంతం క్రీ.శ 1114- 1154 మధ్యకాలంలో మయూర రాజులు, మౌర్యరాజులు, గుప్తరాజులు, బీహార్ రాజులు, మరియు గార్వార్ రాజుల పాలనలో ఉండేది.

ఆధునిక కాలం[మార్చు]

1946 మార్చి 16 న గోరక్‌పూర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి దియోరియా జిల్లా రూపొందించబడుతుంది. దేవారణ్య మరియు దేవిపురా అనే పేరు దియోరియా అయిందని భావిస్తున్నారు. జిల్లాకేంద్రం దియోరియా పేరు జిల్లాకు నిర్ణయించబడింది. ఇక్కడ పలు ఆలయాలు ఉన్నాయి. అందుకే ఇది దేవిపురం అయింది. జిల్లాలోని దేహ్రౌలి (రుద్రపూర్) కి చెందిన బిభుతి మణి త్రిపాఠీ నాయకత్వంలో జిల్లా ప్రజలు భారతస్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. ఆయన యువకులలో ఉత్తేజం కలిగించడానికి సుభాస్ చంద్రబోసుని ఈ జిల్లాకు ఆహ్వానించాడు. దియోరియా జిల్లా లోని ఈశాన్య భూభాగం వేరుచేసి 1994 మే మాసంలో ఖుషీనగర్ జిల్లా రూపొందించబడింది.

భౌగోళికం[మార్చు]

దియోరియా జిల్లా 26 ° 6' నుండి 27° 8' ఉత్తర అక్షాంశం మరియు 83° 29' నుండి 84° 26' తూర్పు రేఖాంశం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులలో ఖుషినగర్ జిల్లా, తూర్పు సరిహద్దులలో బీహార్ రాష్ట్ర గోపాల్‌గంజ్జిల్లా మరియు శివన్ జిల్లా, దక్షిణ సరిహద్దులలో మౌ జిల్లా మరియు బలియా జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులలో గోరక్‌పూర్ జిల్లా ఉన్నాయి. .[1] జిల్లాలో ప్రధానంగా ఘఘర నది, పశ్చిమ రప్తి నది మరియు చోటీ గందక్ నదులు ప్రవహిస్తున్నాయి. [1] జిల్లాలో అదనంగా సలెంపూర్ బర్హజ్ మరియు భాత్పర్ రాణి వంటి ప్రధాన నగరాలు ఉన్నాయి.

దియోరియా జిల్లా 16 బ్లాకులను కలిగి:

  • బైతల్పుర్
  • బంకత
  • బర్హజ్
  • భాగల్పూర్
  • భలుబని
  • భత్ని
  • భత్పర్ రాణి
  • దియోరియా
  • దేశాయ్ దియోరియా
  • గౌరీ బజార్
  • లర్
  • పథర్దెవ
  • రాంపూర్ కర్ఖన
  • రుద్రపూర్
  • సలెంపుర్
  • తర్కుల్వ
  • రామ్ నగర్
  • నుంఖర్
  • అహిలీపుర్

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,098,637,[2]
ఇది దాదాపు. మంగోలియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. లోవ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 114 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 1220 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.23%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 1014:1000,[2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 73.53%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

భాషలు[మార్చు]

జిల్లాలో తూర్పు హిందీ భాషాకుటుంబానికి చెందిన భోజ్‌పురి భాష 4,00,00,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.ఇది వ్రాయడానికి దేవనాగరి మరియు కైతి లిపిని ఉపయోగిస్తున్నారు. [5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Deoria". Deoria district administration. Retrieved 2010-08-05. 
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Mongolia 3,133,318 July 2011 est. 
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Iowa 3,046,355 
  5. M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30. 

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దియోరియ&oldid=1986186" నుండి వెలికితీశారు