దిలీప్ బాబాసాహెబ్ భోస్లే
జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోసలే | |
|---|---|
| జ్యుడిషియల్ సభ్యుడు, లోక్‌పాల్ | |
| Assumed office 23 మార్చి 2019 | |
| Appointed by | రామ్‌నాథ్ కోవింద్ |
| అంతకు ముందు వారు | Position Established |
| అలహాబాద్ హైకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి | |
| In office 30 జూలై 2016 – 23 అక్టోబరు 2018 | |
| Appointed by | ప్రణబ్ ముఖర్జీ |
| అంతకు ముందు వారు | ధనంజయ వై. చంద్రచూడ్ |
| తరువాత వారు | గోవింద్ మాథుర్ |
| హైదరాబాదు హైకోర్టు న్యాయమూర్తి | |
| In office 8 డిసెంబరు 2014 – 29 జూలై 2016 | |
| Appointed by | ప్రణబ్ ముఖర్జీ |
| కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి | |
| In office 6 జనవరి 2012 – 7 డిసెంబరు 2014 | |
| Appointed by | ప్రతిభా పాటిల్ |
| ముంబై హైకోర్టు న్యాయమూర్తి | |
| In office 22 జనవరి 2001 – 5 జనవరి 2012 | |
| Appointed by | కె.ఆర్. నారాయణన్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1956 అక్టోబరు 24 |
| జీవిత భాగస్వామి | అరుంధతి (వి. 1982) |
| సంతానం | 2 |
| తండ్రి | బాబాసాహెబ్ భోసలే |
| కళాశాల | ప్రభుత్వ న్యాయ కళాశాల (ముంబై)[1] |
జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోసలే (జ. 1956 అక్టోబరు 24) భారత న్యాయమూర్తి. 2019, మార్చి 23 నుండి లోక్‌పాల్ కమిటీ జ్యుడిషియల్ సభ్యుడిగా ఉన్నాడు. 70 సంవత్సరాల వయస్సు తరువాత ఈ పదవి నుంచి పదవీ విరమణ చేయనున్నాడు. 2016 జూలై నుండి 2018 అక్టోబరు వరకు అలహాబాదులోని హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[2]
జీవిత విషయాలు
[మార్చు]దిలీప్ 1956, అక్టోబరు 24న మహారాష్ట్ర లోని సాతారా జిల్లాలో జన్మించాడు.[3] ఇతని తండ్రి బాబాసాహెబ్ భోసలే 1982 నుండి 1983 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మామయ్య శివాజీరావు ఔరంగాబాదులోని మరాఠ్వాడ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. జస్టిస్ భోసలే ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించాడు.[4][5]
వృత్తిజీవితం
[మార్చు]1980 జూన్ నెలలో బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు అక్కడి బార్ అసోసియేషన్ లో చేరాడు. 1986 నుండి 1991 వరకు కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశాడు. 2001, జనవరిలో బొంబాయి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. రెండు సంవత్సరాల తరువాత శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతిని కూడా పొందాడు. 2012 నుండి కర్ణాటక హైకోర్టులో సిట్టింగ్ జడ్జిగా ఉన్నాడు.[6][7] ఆయన 2014 డిసెంబరు 8 [8] నుండి 2016 జూలై 29 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి 2016, జూలై 30న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు. 2018, అక్టోబరు 23న హైకోర్టు నుంచి పదవీ విరమణ చేశాడు.
గుర్తించదగిన తీర్పులు
[మార్చు]- భోసలే, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్ నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీ వరకు ఎన్నికల జాబితా నుండి నకిలీ పేర్లను తొలగించే అధికారాన్ని భారత ఎన్నికల సంఘానికి ఉందని తీర్పు ఇచ్చింది.[9]
మూలాలు
[మార్చు]- ↑ "Hon'ble Mr. Justice Dilip Babasaheb Bhosale (CJ)". www.allahabadhighcourt.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-16.
- ↑ "Lokpal: Meet the men and women who will probe corruption". qrius.com. the original నుండి 2019-03-29 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-16.
- ↑ "Hon'ble Mr.Justice Dilip Babasaheb Bhosale". www.supremecourtcaselaw.com. the original నుండి 2016-10-04 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-16.
{{cite web}}: More than one of|archivedate=and|archive-date=specified (help); More than one of|archiveurl=and|archive-url=specified (help) - ↑ "The Hon'ble The Acting Chief Justice Dilip Babasaheb Bhosale". hc.tap.nic.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-16.
- ↑ Sakshi (6 December 2014). "హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భోస్లే". ఒరిజినల్ నుండి 18 అక్టోబరు 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 October 2021.
- ↑ "Hon'ble Mr. Justice Dilip Babasaheb Bhosale". www.supremecourtcaselaw.com. the original నుండి 2016-10-04 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-16.
{{cite web}}: More than one of|archivedate=and|archive-date=specified (help); More than one of|archiveurl=and|archive-url=specified (help) - ↑ "Former Hon'ble Judges of High Court of Karnataka elevated as Chief Justice of other High Courts". karnatakajudiciary.kar.nic.in. 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-16.
- ↑ Sakshi (9 December 2014). "హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భోస్లే బాధ్యతల స్వీకరణ". ఒరిజినల్ నుండి 18 అక్టోబరు 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 October 2021.
- ↑ "Allahabad high court: Voter list can be corrected till last date of filing nomination". The Times of India. 2017-01-14. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-16.