దిలీప్ వెంగ్‌సర్కార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిలీప్ వెంగ్‌సర్కార్
DilipVengsarkar.jpg
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ మీడియం
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 116 129
పరుగులు 6868 3508
బ్యాటింగ్ సగటు 42.13 34.73
100లు/50లు 17/35 1/23
అత్యుత్తమ స్కోరు 166 105
ఓవర్లు 6.5 1
వికెట్లు 0 0
బౌలింగ్ సగటు 0 0
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 0 0
క్యాచ్ లు/స్టంపింగులు 78/- 37/-

As of ఆగష్టు 22, 2005
Source: [1]

1956 ఏప్రిల్ 6మహారాష్ట్ర లోని రాజాపూర్ లో జన్మించిన దిలీప్ బల్వంత్ వెంగ్‌సర్కార్ (Dilip Balwant Vengsarkar) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, ప్రస్తుత భారత జట్టు సెలెక్షన్ కమిటి చైర్మెన్. కొలోనెల్ అనే ముద్దుపేరు కల ఈ బ్యాట్స్‌మెన్ డ్రవ్‌లు కొట్టడంలో నేర్పరి. 1975-76 లో న్యూజీలాండ్తో జరిగిన ఆక్లాండ్ టెస్ట్ ద్వారా ఓపెనర్ గా అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేసాడు. అతను అంతగా సఫలం కాకున్ననూ భారత్ ఈ మ్యాచ్ గెల్చింది. 1983లో ప్రపంచ కప్ గెల్చిన భారత జట్టులో ఇతను ప్రాతినిధ్యం వహించాడు. 1985 నుంచి 1987 వరకు చక్కగా రాణించి పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, వెస్ట్‌ఇండీస్, శ్రీలంక లపై సెంచరీలు సాధించి ఆ సమయంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ గావతరించాడు. వెస్ట్‌ఇండీస్ క్రికెట్ ప్రపంచాన్ని శాసించే సమయంలో మార్షల్, హోల్డింగ్, రోబెర్ట్స్ ల బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొని ఆ జట్టుపై 6 సెంచరీలు సాధించాడు. టెస్ట్ క్రికెట్ అత్యుత్తమ వేదికలలో ఒకటైన లార్డ్స్ మైదానంలో వరుసగా 3 సెంచరీలు సాధించి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా నిల్చాడు. 1987 ప్రపమ్చ కప్ తర్వాత కపిల్ దేవ్ నుంచి నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. టెస్ట్ క్రికెట్ లో అతను 116 టెస్టులు ఆడి 6868 పరుగులు సాధించాడు. ఇందులో 17 సెంచరీలు, 35 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డే క్రికెట్ లో 129 మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీతో సహా మొత్తం 3508 పరుగులు చేసాడు. క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తర్వాత Elf-Vengsarkar Academy[1]ని స్థాపించాడు.2003లో వెంగ్‌సర్కార్ ముంబాయి క్రికెట్ అసోసియేషన్ కు ఉపాద్యక్షుడిగా ఎన్నికైనాడు.[2] ఆ తర్వాత బి.సి.సి.ఐ సెల్క్షన్ కమీటీ చైర్మెన్ గా నియమించబడ్డాడు. 2006 మార్చిలో మ్యాచ్ రెఫరీ చేయుటకు అతని పేరు ప్రతిపాదించిననూ [3] సెలక్షన్ కమీటీ అధిపతిగా ఉండుటకు మాత్రమే అతను మొగ్గుచూపుటంతో అది ముందడుగు పడలేదు.[4] తాజాగా దినపత్రికలో కాలమ్స్ వ్రాయుటకు నిషేధం విధించడంతో అతను బోర్డు నిర్ణయానికి ఒప్పుకోవాల్సి వచ్చింది.

గుర్తింపులు, బిరుదులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Vengasarkar as Match-Referee". ELF.com. Archived from the original on 2007-01-11. Retrieved 2007-11-28.
  2. "Vengasarkar wins MCA Elections". Rediff.com.
  3. "Vengasarkar as Match-Referee". Cricinfo.com.
  4. "2006/08 Selection Committee Announcement". Cricinfo.com.
  5. "Dilip Vengasarkar". Wisden Almanack.

ఇవి కూడా చూడండి[మార్చు]