దిల్లీ హాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Coordinates: 28°34′23″N 77°12′31″E / 28.573162°N 77.208511°E / 28.573162; 77.208511

దిల్లీ హాట్, ఢిల్లీ

దిల్లీ హాట్ అనేది ఢిల్లీ ప్రధాన ప్రాంతంలో, ఫుడ్ ప్లాజా మరియు క్రాఫ్ట్ బజార్ కలయికతో ఉన్న ప్రాంతం, ఒకటి INA మార్కెట్ ఎదురుగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సమీపాన శ్రీ అరబిందో మార్గ్‌లో ఉంది, మరియు రెండవది నేతాజీ సుభాష్ ప్లేస్ మెట్రో స్టేషను ప్రక్కన ఉన్న నేతాజీ సుభాష్ ప్లేస్ వద్ద ఉంది. దిల్లీ హాట్లో భారతదేశంలోని ప్రతి రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహించే అంగళ్ళు ఉన్నాయి, ఇవి భారతదేశ వ్యాప్తంగా లభ్యమయ్యే సంపూర్ణ రకాల యొక్క అభిరుచులను అందిస్తున్నాయి.

అవలోకనం[మార్చు]

దిల్లీ హాట్ యొక్క నేచర్ బజార్ వద్ద కొనుగోళ్ళు మరియు అమ్మకాలు

భారతదేశం అంతటా ఉన్న చేతివృత్తుల యొక్క దుకాణాలను, భారతదేశం యొక్క సాంస్కృతిక సంప్రదాయాల భిన్నత్వం నుండి ఏర్పరచబడినాయి. 2003 సమయంలో, ఈ మార్కెట్లో వీల్ ఛైర్‌తో ప్రవేశించటానికి, అలానే వీల్ ఛైర్‌తో బాత్ రూమ్‌లోకి కూడా వెళ్ళటానికి కుడా సౌకర్యం ఉన్నది.[1][2][3] ఈ సౌకర్యం భారతదేశంలో సాధారణంగా ఉండదు.

మరిన్ని దిల్లీ హాట్లను ఢిల్లీలోని మిగిలిన ప్రాంతాలలో ఆరంభించాలని ప్రణాళికలు ఉన్నాయి, ఒకదానిని పీతంపూరలో తెరిచారు.

సంప్రదాయంగా వారానికి ఒకసారి పెట్టే మార్కెట్ (వీక్లీ మార్కెట్), విలేజ్ హాట్ల వలే కాకుండా దిల్లీ హాట్ శాశ్వతమైన ఏర్పాటును కలిగి ఉంది. కొన్ని దుకాణాలు శాశ్వతమైన ఏర్పాటును కలిగి ఉన్నాయి, కానీ మిగిలిన విక్రయదారులు సాధారణంగా పదిహేను రోజులకొకసారి మారుతూ ఉంటారు.[4] ఇక్కడ అందించే ఉత్పత్తులలో ఎర్రచందనం మరియు గంధం చెక్కలతో చెక్కబడిన బొమ్మలు, అలంకరించబడిన ఒంటె చర్మపు చెప్పులు, కృత్రిమమైన వస్త్రాలు మరియు పరదాలు, రత్నాలు, పూసలు, ఇత్తడివస్తువులు, లోహపు చేతి వస్తువులు, మరియు పట్టు ఇంకా ఉన్ని వస్త్రాలు ఉన్నాయి. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రదర్శనా మందిరంలో చేతి కళలను మరియు మగ్గాల మీద నేసిన వాటిని ప్రోత్సహించటానికి ప్రదర్శనలు నిర్వహించబడతాయి. కుమ్మరి వస్తువులను అమ్మడానికి దరఖాస్తు పద్ధతి ఉంది మరియు విక్రయించడానికి ప్రదేశాలను విక్రయదారుడు ఏ రాష్ట్రం నుంచి వచ్చాడో అనేదాని మీద ఆధారపడి కేటాయించబడుతుంది.[5]

దిల్లీ హాట్లో కొనుగోలు చేయటానికి నామమాత్రపు ప్రవేశ రుసుము చెల్లించవలసి ఉంటుంది.[6]

దిల్లీ హాట్ వద్ద ఉన్న వివిధ చేతికళల దుకాణాలు[మార్చు]

సూచనలు[మార్చు]

  1. Society for Accessible Travel & Hospitality. "The first barrier free tourist spot in New Delhi, India".
  2. "Barrier-free Dilli Haat fails to provide a wheel chair". The Hindu. 2004-08-29.
  3. "Module 4:Design Considerations" (PDF). Rehabilitation Council of India. External link in |publisher= (help) (పేజీ 36 దిల్లీ హాట్ వద్ద ఉన్న వీల్ చైర్ ఏటవాలు దారి ఛాయాచిత్రంను చూపిస్తుంది)
  4. "Dilli Haat". Delhi Guide.
  5. "Dilli Haat Operation and Management Rules– 2006".
  6. "Dilli the Haat".

బయటి లింకులు[మార్చు]