Jump to content

దిల్ తో పాగల్ హై

వికీపీడియా నుండి
దిల్ తో పాగల్ హై
దర్శకత్వంయష్ చోప్రా
స్క్రీన్ ప్లేఆదిత్య చోప్రా
తనూజ చంద్ర
పమేలా చోప్రా
యష్ చోప్రా
కథఆదిత్య చోప్రా
నిర్మాతయష్ చోప్రా
తారాగణం
ఛాయాగ్రహణంమన్మోహన్ సింగ్
కూర్పువీ. కర్ణిక్
సంగీతంఉత్తమ్ సింగ్
నిర్మాణ
సంస్థ
యష్ రాజ్ ఫిల్మ్స్
పంపిణీదార్లుసోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్
విడుదల తేదీ
30 అక్టోబరు 1997 (1997-10-30)
సినిమా నిడివి
180 నిమిషాలు
దేశంభారతదేశం
భాషభారతదేశం
బడ్జెట్₹90 మిలియన్లు [1]
బాక్సాఫీసు₹718.6 మిలియన్లు [1]

దిల్ తో పాగల్ హై 1997లో విడుదలైన హిందీ సినిమా. యష్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా ఉత్తమ్ సింగ్ సంగీతమందించగా, పాటలు ఆనంద్ బక్షి రాశారు.[2]

దిల్ తో పాగల్ హై అక్టోబర్ 30న ప్రింట్ & అడ్వర్టైజింగ్ ఖర్చులతో కలిపి ₹ 90 మిలియన్ల (US$2.48 మిలియన్లు) బడ్జెట్‌తో రూపొందించగా ప్రపంచవ్యాప్తంగా ₹ 710 మిలియన్లు (US$19.55 మిలియన్లు) వసూలు చేసి ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ సినిమాగా నిలిచింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకొని దర్శకత్వం, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, సినిమాటోగ్రఫీ, షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, అక్షయ్ కుమార్ పాత్రలలో నటనకు అధిక ప్రశంసలు లభించాయి.[3][4]

దిల్ తో పాగల్ హై 45వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంతో సహా 3 అవార్డులను గెలుచుకుంది. నిషా పాత్రలో కపూర్ నటనకు ఆమెకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. ఈ సినిమా 43వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ దర్శకుడు (యష్ చోప్రా), ఉత్తమ సహాయ నటుడు (అక్షయ్ కుమార్) తో సహా 11 నామినేషన్లను అందుకొని ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (షారుఖ్ ఖాన్), ఉత్తమ నటి (మాధురీ దీక్షిత్), ఉత్తమ సహాయ నటి (కరీనా కపూర్) సహా వివిధ విభాగాలలో 8 అవార్డులను గెలుచుకుంది.[5]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటగాయకులుపాట నిడివి
1."దిల్ తో పాగల్ హై"లతా మంగేష్కర్ , ఉదిత్ నారాయణ్05:40
2."అరే రే అరే"లతా మంగేష్కర్ , ఉదిత్ నారాయణ్05:38
3."భోలీ సి సూరత్"లతా మంగేష్కర్ , ఉదిత్ నారాయణ్04:17
4."ధోల్నా"లతా మంగేష్కర్ , ఉదిత్ నారాయణ్05:21
5."లే గయీ"ఆశా భోంస్లే (ఫీట్. ఉదిత్ నారాయణ్ (ఎక్స్‌టెండెడ్ ఫిల్మ్ వెర్షన్)05:46
6."ప్యార్ కర్"లతా మంగేష్కర్ , ఉదిత్ నారాయణ్06:48
7."కోయి లడ్కీ హై"లతా మంగేష్కర్ , ఉదిత్ నారాయణ్05:34
8."ఏక్ దుజే కే వాస్తే"లతా మంగేష్కర్, హరిహరన్03:30
9."అరే రే అరే" (పార్ట్ 2)లతా మంగేష్కర్ , ఉదిత్ నారాయణ్02:06
10."కిత్నీ హై బెకరార్ యే"లతా మంగేష్కర్ , కుమార్ సాను05:51
11."ది డాన్స్ అఫ్ ఎన్వీ"ఇంస్ట్రుమెంటల్03:15
మొత్తం నిడివి:54:34

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 https://www.boxofficeindia.com/movie.php?movieid=2635
  2. "Dil to Pagal Hai Cast List | Dil to Pagal Hai Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama". Bollywood Hungama. 30 October 1997. Archived from the original on 21 January 2022. Retrieved 3 July 2023.
  3. "Review by Omar Ahmed (Empire)". Archived from the original on 3 డిసెంబరు 2013. Retrieved 13 డిసెంబరు 2012.
  4. "Best of Yash Chopra". Archived from the original on 26 అక్టోబరు 2012. Retrieved 13 డిసెంబరు 2012.
  5. [1] Archived 16 మార్చి 2016 at the Wayback Machine
  6. "6 interesting moments of Madhuri-Juhi on Koffee With Karan". The Times of India. Archived from the original on 2 మార్చి 2014. Retrieved 3 మార్చి 2014.
  7. "Rediff on the NeT, Movies: Karisma Kapoor interview". Archived from the original on 22 March 2018. Retrieved 22 March 2018.
  8. "Was Akshay Kumar Never Paid For His Role In Dil To Pagal Hai?". News18. 11 May 2023.

బయటి లింకులు

[మార్చు]