దివితా రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దివిత రాయ్
అందాల పోటీల విజేత
జననము (1998-01-10) 1998 జనవరి 10 (వయసు 26)[1]
మంగుళూరు, కర్ణాటక, భారతదేశం
విద్యనేషనల్ పబ్లిక్ స్కూల్, రాజాజీనగర్
పూర్వవిద్యార్థిసర్ జె. జె. కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, (B.Arch)
వృత్తి
  • మోడల్
ఎత్తు5 ft 9 in (1.75 m)
బిరుదు (లు)మిస్ యూనివర్స్ ఇండియా 2022
ప్రధానమైన
పోటీ (లు)
మిస్ దివా 2021
(2వ రన్నరప్)
మిస్ దివా 2022
(విజేత)
మిస్ యూనివర్స్ 2022
(టాప్ 16)

దివిత రాయ్‌ (జననం 1998 జనవరి 10) భారతీయ మోడల్. ఆమె దక్షిణాది నుంచి భారతదేశం ప్రతినిధిగా మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లింది. ఆమె 2022 ఆగస్ట్ 28న ముంబైలో నిర్వహించిన అందాల పోటీలో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని పొందింది. ఈ కిరీటాన్ని మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఆమెకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపింది.

అమెరికా లూసియానాలోని న్యూ ఓర్లీన్స్‌ వేదికగా 2023 జనవరి 14న జరిగిన మిస్ యూనివర్స్ 2022లో భారతదేశానికి ఆమె ప్రాతినిధ్యం వహించింది. ఇందులో ఆమె టాప్ 16 సెమీ-ఫైనలిస్ట్‌లలోకి ప్రవేశించింది.[2] గతంలో భారతదేశం నుంచి సుస్మితా సేన్, లారా దత్తా, హర్మాజ్ సంధూ లకు మిస్ యూనివర్స్ కిరీటం వరించింది.

జననం, విద్య[మార్చు]

దివితా రాయ్‌ కర్ణాటకలోని మంగళూరులో 1998 జనవరి 10న జన్మించింది. అక్కడ రాజాజీనగర్‌లోని నేషనల్ పబ్లిక్ స్కూలులో విద్యాభ్యాసం చేసింది. ఆ తువాత ఆమె కుటుంబం ముంబైలో స్థిరపడడంతో సర్ జెజె కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి బీఆర్క్ చదివింది.

కెరీర్[మార్చు]

మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఆమె 2019లో ఫెమీనా మిస్ ఇండియా పోటీలకు అర్హత సాధించింది. 2021లో కూడా మిస్ దివా, మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఆ పోటీల్లో హర్నాజ్ కౌర్ సంధు గెలవడంతో దివితా రాయ్ రన్నరప్‌గా మిగిలింది. తిరిగి 2022లో మిస్ దివా యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న ఆమె విజేతగా నిలిచింది. దీంతో భారతదేశం తరుపున ప్రపంచ స్థాయిలో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది.

మూలాలు[మార్చు]

  1. "Divita Rai (Liva Miss Diva 2022) Biography, Net worth 2022, Salary, Age, Height, Educational Qualifications, Family Details, Parents, Husband, Children, Nationality, Quotes, Facts, FAQs, and more". bizadda360.com. 29 August 2022.
  2. "Miss Universe 2022: విశ్వ సుందరి కిరీటం అమెరికా భామ సొంతం". web.archive.org. 2023-01-16. Archived from the original on 2023-01-16. Retrieved 2023-01-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)