దివ్యవాణి
దివ్యవాణి | |
---|---|
జననం | |
విద్య | 10వ తరగతి |
వృత్తి | తెలుగు సినిమానటి |
క్రియాశీల సంవత్సరాలు | 1987-2018 |
గుర్తించదగిన సేవలు | పెళ్ళి పుస్తకం, మొగుడు పెళ్ళాల దొంగాట |
పిల్లలు | కిరణ్ కాంత్, తరుణ్యాదేవి |
తల్లిదండ్రులు | ఆదినారాయణరావు, విజయలక్ష్మి |
దివ్యవాణి తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉషారాణి. ఈమె సర్దార్ కృష్ణమనాయుడు చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వెలువడిన ఈ సినిమాలో ఈమె కృష్ణ కూతురుగా నటించింది. తరువాత ఒక కన్నడ చిత్రంలో నటించింది. ఆ చిత్రదర్శకుడు ద్వారకేష్ ఈమె పేరును దివ్యవాణిగా మార్చాడు. 2019 లో ఈమె తెలుగు దేశం పార్టీలో చేరింది. 2022 లో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె స్వగ్రామం తెనాలి. ఈమె తండ్రి ఆదినారాయణరావు, తల్లి విజయలక్ష్మి.[2] ఈమె గుంటూరులో పదవ తరగతి వరకు చదువుకుంది.ఈమెకు ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. సోదరి బేబీ రాణి నృత్యకళాకారిణి. చిన్నవయసులోనే అంటే 17యేళ్ళ వయసులోనే ఈమెకు దేవానంద్ అనే పారిశ్రామిక వేత్తతో వివాహం జరిగింది. వీరికి కిరణ్ కాంత్ అనే కుమారుడు, తరుణ్యాదేవి అనే కుమార్తె కలిగారు. దివ్యవాణి భర్త యుక్తవయసులోనే మరణించాడు.
ఈమె సుమారు 40 తెలుగు సినిమాలలో నటించింది. వివాహం తరువాత సినిమాలకు కొంత విరామమిచ్చి తరువాత రాధా గోపాళం సినిమాతో మళ్ళీ నటించడం ప్రారంభించింది. వీర మొదలైన సినిమాలలో దుష్టపాత్రలలో నటించింది. ఈమె పుత్తడిబొమ్మ (ఈటీవి తెలుగు) వంటి కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది.[3]
దివ్యవాణి నటించిన తెలుగు చిత్రాలు
[మార్చు]- సర్దార్ కృష్ణమనాయుడు (1987)
- మా తెలుగుతల్లి (1988)
- అడవిలో అర్ధరాత్రి (1989)
- ముత్యమంత ముద్దు (1989) - విశాలి
- కొండవీటి దొంగ (1990)
- ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ (1991) - రుక్మిణి
- ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం (1991) - జయలక్ష్మి
- పెళ్ళి పుస్తకం (1991) - సత్యభామ
- లేడీస్ స్పెషల్ (1991) - దుర్గ
- గౌరమ్మ (1992)
- దోషి (1992)
- పెళ్ళినీకు శుభం నాకు (1992)
- మొగుడు పెళ్ళాల దొంగాట (1992)
- రగులుతున్న భారతం (1992) - శ్వేత
- సంసారాల మెకానిక్ (1992)
- నా మొగుడు నా ఇష్టం (1993)
- పిల్లలు దిద్దిన కాపురం (1993) - పద్మ
- దొంగ రాస్కెల్ (1994)
- పెళ్ళికొడుకు (1994) - వాణి
- కవి సార్వభౌమ
- రాధా గోపాళం (2005) -
- పంచాక్షరి (2010)
- వీర (2011) - పెదరాయుడు భార్య
- మహానటి (2018) - సుభద్రమ్మ
మూలాలు
[మార్చు]- ↑ May 31, Samdani MN / TNN /; 2022; Ist, 17:35. "Actress Divyavani quits Telugu Desam Party | Amaravati News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-03.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ వందన శేషగిరిరావు. "దివ్య వాణి , Divyavani". Tollywood Photo Profiles. Archived from the original on 11 జూన్ 2020. Retrieved 11 June 2020.
- ↑ వెబ్ మాస్టర్. "Divya Vani". nettv4u. Archived from the original on 11 జూన్ 2020. Retrieved 11 June 2020.
బయటిలింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దివ్యవాణి పేజీ