ది గ్రడ్జ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The Grudge
దస్త్రం:The Grudge movie.jpg
Kayako eyes the camera ominously on the movie poster
దర్శకత్వంTakashi Shimizu
నిర్మాతSam Raimi
Robert Tapert
రచనStephen Susco
నటులుSarah Michelle Gellar
Jason Behr
William Mapother
KaDee Strickland
Clea DuVall
Bill Pullman
సంగీతంChristopher Young
ఛాయాగ్రహణంKatsumi Yanagishima
కూర్పుJeff Betancourt
పంపిణీదారుColumbia Pictures
విడుదల
అక్టోబరు 22, 2004 (2004-10-22)
నిడివి
92 minutes
దేశంUnited States
భాషEnglish
Japanese
ఖర్చు$10 million[1]
బాక్సాఫీసు$187,281,115

ది గ్రడ్జ్ అనేది 2004లో అమెరికన్ ఆంగ్ల భాషలో పునర్నిర్మించిన జపాన్ చిత్రంJu-on: The Grudge . దీనికి జు-ఆన్ శ్రేణిలోని తొలి భయానక చిత్రం జు-ఆన్ 1 మాతృక. ఇది అమెరికా భయానక చలనచిత్ర శ్రేణి ది గ్రడ్జ్ యొక్క మొదటి భాగం. దీనిని కొలంబియా పిక్చర్స్,[2] సంస్థ 22 అక్టోబరు 2004న ఉత్తర అమెరికాలో విడుదల చేసింది. మాతృక శ్రేణి,[3] దర్శకుడు తకాషి షిమిజు దీనికి దర్శకత్వం వహించగా, పునర్నిర్మాణానికి స్టీఫెన్ సుస్కో స్క్రిప్ట్ అందించాడు. మాతృక శ్రేణి శైలిలోనే ఈ చిత్ర కథాంశం ఒక విరళ సంఘటనల పరంపర ద్వారా చెప్పబడుతుంది. అలాగే ఇందులో వివిధ వ్యతిచ్ఛేదన ఉప కథాంశాలు కూడా ఉంటాయి.

ఈ చిత్రానికి రెండు కొనసాగింపులను తీశారు. అవి ది గ్రడ్జ్ 2 (13 అక్టోబరు 2006న విడుదలయింది) మరియు ది గ్రడ్జ్ 3 (12 మే 2009న విడుదలయింది).[4]

సారాంశం[మార్చు]

ది గ్రడ్జ్ అనేది విపరీతమైన ఉద్రేకం లేదా తీవ్రమైన విచారంతో మరణించిన వారి వల్ల కలిగే శాపాన్ని తెలుపుతుంది (ఆన్రో (జపాన్ లోకగాథకు చెందిన ఒక పౌరాణిక ఆత్మ)ను చూడండి). వ్యక్తి చనిపోయిన చోట ఈ శాపం ఆవరిస్తుంది. ఈ అతిక్రూరమైన అతీంద్రియ శక్తిని ఎదుర్కొన్న వారు మరణిస్తారు. తద్వారా శాపం పునరావృతమవుతుంది. ఒక బాధితుడి నుండి మరొకరికి, ముగింపు అనేది లేకుండా వ్యాపిస్తూ పోతుంది. చివరకు భయానక పరిస్థితులు ఒక గొలుసు మాదిరిగా పెరుగుతాయి. దిగువ తెలిపిన సంఘటనలను వాటి యొక్క వాస్తవిక క్రమం ద్వారా వివరించడం జరిగింది (దీనికి చిత్రంలో చూపించిన వరుస క్రమంతో తేడా ఉంటుంది).

ఉపోద్ఘాతం[మార్చు]

బాల్కనీపై నిల్చుని, ఏదో ఇబ్బందికర పరిస్థితి ఎదురైన వైనం ముఖంలో కనిపించే పీటర్ కిర్క్ (బిల్ పుల్‌మ్యాన్‌)ని చూపించడం ద్వారా చిత్రం ప్రారంభమవుతుంది. అతని భార్య మేరియా(రోసా బ్లాసి) వారి అపార్ట్‌మెంట్ లోపలి నుంచి అతన్ని చూసి, ఏమి అదోలా ఉన్నావని అడుగుతుంది. మరో మాట లేదా ఎలాంటి సంశయం లేకుండా అతను బాల్కనీ నుంచి కిందకు దూకి, ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో ఒక్కసారిగా దిగ్బ్రాంతి చెందిన మేరియా నిశ్చేష్టురాలవుతుంది.

విలియమ్స్ కుటుంబం[మార్చు]

మాథ్యూ విలియమ్స్ (విలియం మాపోదర్), అతని భార్య జెన్నీఫర్ (క్లియా డువాల్) మరియు అనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి ఎమ్మా సాకి గృహంలోకి ప్రవేశిస్తారు. జపాన్‌లో తన జీవితం పట్ల జెన్నీఫర్ అసంతృప్తిగా ఉంటుంది. అక్కడి భాష కూడా ఆమె మాట్లాడలేకపోతుంది. దాంతో ఒకసారి నడుస్తూ వెళుతుండగా కుప్పకూలిపోతుంది. పరిస్థితులు మెరుగుపడుతాయని మాథ్యూ ఆమెకు ధైర్యం చెబుతాడు. వారికి నచ్చకుంటే కుటుంబమంతా కలిసి తిరిగి అమెరికా సంయుక్తరాష్ట్రాలకు వెళ్లిపోతామని అంటాడు.

జెన్నీఫర్ తాను ఉంటున్న గదిలోని మంచంపై అలాగే పడుకుని నిద్రపోతుంది. ఆమెకు ఒక పాత్ర తగలడంతో అది నేలపై పడుతుంది. ఆ శబ్దానికి ఆమె లేచి కింద పడిన పాత్రను మరియు ఎక్కడపడితే అక్కడ చెల్లాచెదురైన అందులోని పదార్థాలను గుర్తిస్తుంది. తొలుత ఆమె ఎమ్మాను తిడుతుంది. తర్వాత గది వరకు ఉండే పిల్లల కాలిముద్రల జాడను గుర్తిస్తుంది. మెట్లపై నుంచి దిగుతున్నప్పుడు ఆమె ఒక పిల్లిని చూస్తుంది. తాను చూసిన జత ఆయుధాలను కూడా వెంటనే తీసుకుంటుంది. అలాగే మెట్లెక్కుతూ తన పడకగదిలోకి వెళుతుంది (అది తోషియో అంతకుముందు వాడుతున్న పడకగది). ఆమె వెనుక నుంచి తలుపు మూసుకుంటుంది.

పని ముగించుకుని ఇంటికి తిరిగొచ్చిన మాథ్యూ చెత్తాచెదారంతో గందరగోళంగా మారిన ఇంటిని చూస్తాడు. వెంటనే తన భార్యను పిలుస్తాడు. అయితే ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాదు. ఎట్టకేలకు తమ పడకగదిలో కదల్లేక లేదా మాట్లాడలేక మరియు శ్వాసపీల్చడానికి ఇబ్బంది పడుతున్న ఆమెను గుర్తిస్తాడు. అతను అంబులెన్స్‌ను పిలవడానికి ముందు తోషియో (యుయా ఓజెకి) పేరుతో పిల్లి మాదిరిగా ఒక యువకుడు ఉన్నట్లుండి శబ్దాలు చేయడంతో అతన్ని అనుసరిస్తాడు. తన తలపై హఠాత్తుగా తోషియో కన్పించడంతో ఒక్కసారిగా సమీపంలోని గదిని అతను ఆశ్రయిస్తాడు.

తర్వాత మాథ్యూ సోదరి సుసాన్ ఆఫీసు నుంచి బయలుదేరి రావడానికి సిద్ధమవుతుంటుంది. పిలవడానికి ప్రయత్నించిన తర్వాత, మాథ్యూని చేరుకోలేకపోవడంతో సుసాన్ తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఆమె తన కార్యాలయ భవనం నుంచి బయటకు రావడం ప్రారంభిస్తుంది. అయితే గది నుంచి మూలుగుల శబ్దం రావడంతో ఆమె ఆగుతుంది. వెంటనే మెట్లు దిగుతుంది. అయితే లైట్లు మినుకుమినుకు మంటూ వెలగడం మరియు అవి పగిలిపోవడంతో ఆమె భయపడుతుంది. తర్వాత మెట్లు ఎక్కుతున్న కయాకో (తకాకో ఫుజి) దెయ్యంను చూడటానికి సుసాన్ పిట్టగోడపై ఎక్కుతుంది. సమీపంలోని హాలు దగ్గరకు సుసాన్ పరుగులు తీస్తుంది. అయితే కయాకో ఆమె సెల్‌ఫోన్ పనిచేయకుండా చేసి, దానిని లాగేసుకుంటుంది. దాంతో రక్షణ కోసం సుసాన్ భద్రతా కార్యాలయాన్ని ఆశ్రయిస్తుంది. అక్కడ పరిస్థితిని పరిశీలిస్తానని సెక్యూరిటీ గార్డు ఆమెకు హామీ ఇస్తాడు. సెక్యూరిటీ గార్డు పరిశీలిస్తుండగా, సుసాన్ మానిటర్‌ను గమనిస్తుంది. భయపడాల్సింది ఏమీ లేదని చెప్పి, అక్కడ నుంచి అతను వెళ్లిపోతాడు. తర్వాత లైట్లు మినుకుమినుకుమని వెలగడం మరియు గదిలోని చీకట్ల నుంచి కయాకో ఒక్కసారిగా అగుపించి, సెక్యూరిటీ కెమేరా దిశగా కదులుతుంది. దాంతో సుసాన్ పరుగెడుతుంది.

సుసాన్ తన అపార్ట్‌మెంట్‌కు తిరిగి వెళ్లడానికి ఒక టాక్సీని ఆశ్రయిస్తుంది. సుసాన్ ఒక ఎలివేటర్‌లోకి ప్రవేశిస్తుంది. అందులో ఆరోహణ క్రమంలో నిర్మించిన అనేక అంతస్తులుంటాయి. అయితే ఎలివేటర్ తలుపుల ప్రతి వరుస బయట తోషియో నిలబడి ఉండటాన్ని గమనించని సుసాన్ అటుగా బయలుదేరుతుంది. చివరకు ప్రతి అంతస్తు యొక్క ముగింపుకు దగ్గరగా వెళుతుంది. తన ఫోన్ మోగడంతో సుసాన్ లోపలి వైపు భద్రంగా ఉండగలుగుతుంది. తన అపార్ట్‌మెంట్ నంబర్ మరిచిపోయానని మాథ్యూ చెబుతాడు. లోపలి వైపు శబ్దం చేయమని సూచిస్తాడు. తనను ఎక్కడ వెతకాలో అతనికి చెప్పిన ఆమె ఫోన్‌ బజర్ ద్వారా పని చేసేలా చేస్తుంది. ఫోను సంభాషణలను ఆమె ఆపిన వెంటనే డోర్‌బెల్ మోగుతుంది. ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డ మాథ్యూకి రావడానికి తగిన సమయం లేదు. మరోవైపు తలుపుకు బిగించి ఉండే వీక్షణరంధ్రాన్ని ఆమె పరిశీలిస్తుంది. అందులో నుంచి తొంగిచూడగా, మాథ్యూ కనిపించడంతో ఆమె ఒక్కసారిగా కంగుతింటుంది. అతనే తనను ఆటపట్టిస్తున్నాడని ఆమె భావిస్తుంది. కోపంతో తలుపు వేస్తుంది. అయితే అక్కడ ఎవరూ ఉండరు. సుసాన్ చేతిలోని ఫోన్ నుంచి పెద్ద శబ్దంతో మృత్యు ఘోష బయటకు వస్తుంది. దాంతో ఫోన్‌ను ఆమె కింద పడేయడంతో అది పగిలిపోతుంది. అయినా సరే తర్వాత కూడా ఆ శబ్దం వస్తూనే ఉంటుంది. పడకపై గజగజ వణికిపోతున్న సుసాన్ మంచం కవర్ల అంచుకు చేరుకుంటుంది. ఆమె తన ఫోన్ నుంచి కుందేలు కాలు ఫోన్ శక్తిని తొలగిస్తుంది. భయంతో దానిని కింద పడేస్తుంది. కవర్ల కింది భాగం నుంచి కెరటం మాదిరిగా లేచిన ఒక బొబ్బ సుసాన్ వైపు కదులుతుంది. ఆమె దుప్పట్లకు పైకెత్తగానే కయాకో ముఖం కనబడుతుంది. వెంటనే ఆమె కిందకు లాగేయబడుతుంది. దాంతో ఇద్దరూ పూర్తిగా అదృశ్యమవుతారు.

సామాజిక కార్యకర్తలు[మార్చు]

(ఈ విభాగంలోని సంఘటనలు విలియం ఇంటిలోకి ప్రవేశించిన వెంటనే చోటుచేసుకున్నప్పటికీ, అవి చలనచిత్రం అంతటా చూపించబడ్డాయి). యోకో (యోకో మాకి) అనే అమ్మాయి ఎమ్మా సంరక్షణ బాధ్యతతో పాటు ఇంటిని శుభ్రపరచడం చేస్తుంటుంది. గచ్చు మరియు మెట్లపై చెత్త తీస్తుండగా, పై అంతస్తులో ఎవరో నడుస్తున్న శబ్దాన్ని ఆమె వింటుంది. దాంతో పడకగదిలోని ఒక మూలకు చేరుకున్న యోకో పై అంతస్తులోకి ప్రవేశించే వీలుగా ఉండే పైకప్పు వద్ద ఉన్న ఒక చిన్న తలుపును చూస్తుంది. లైటర్‌ సాయంతో యోకో తలుపు ద్వారా లోపల చూస్తుంది. శబ్దానికి కారణమేంటని కొద్దిసేపు అన్వేషిస్తుంది. ఆమె ఎట్టకేలకు ప్రస్తుతం కయాకో సాకిగా మారిన ఆన్రో కి ఎదురుపడుతుంది. అది ఆమెపై దాడి చేసి, సమీపంలోకి ఒక చిన్న గదిలోకి ఈడ్చుకెళుతుంది.

యోకో అదృశ్యమైన తర్వాత ఆ ఇంట్లో పనికి మరియు ఎమ్మా సంరక్షణ కోసం కరెన్ డేవిస్ (సారా మిచెల్లీ గెల్లార్) ని పిలిపిస్తారు. పనిచేస్తుండగా, మూసివేయబడిన ఒక చిన్న గది నుంచి పిల్లి మాదిరి శబ్దాలు రావడాన్ని కరెన్ గుర్తిస్తుంది. ఆమె గదికి ఉన్న టేపును తొలగించి, తలుపును తీస్తుంది. అందులో ఒక చిన్న బాలుడు (తోషియో) ఉండటాన్నిగుర్తిస్తుంది. అయితే కిందకు దిగిరావడానికి అతను నిరాకరిస్తాడు. దాంతో పేరు చెప్పమని అతన్ని అడుగుతుంది. "తోషియో," అంటూ శబ్దంలేని ఒక భయగ్రస్త కంఠంతో అతను చెబుతాడు. ఎమ్మా వేరే గదిలో శబ్దం చేయడం మరియు గొణుగుడు చేస్తుంటుంది. ఇదంతా ఆమే చేస్తోందని కరెన్ చెప్పడంతో ఆ గదిలోని ఒక మూల నుంచి వెంట్రుకల యొక్క నల్లటి నీడ కనిపిస్తుంది. దాంతో ఎమ్మా భయపడుతుంది. ఎమ్మాను సమీపిస్తున్న కయాకోను కరెన్ చూస్తుంది. కయాకో ముఖాన్ని కప్పుతున్న ఆమె వెండ్రుకలు ఆమె కళ్ల తెలుపు భాగం కనిపించే విధంగా వెనుకకు లేచాయి. నేత్ర విభాజకాలు క్రమ పద్ధతిలో అమరాయి. భయంతో వెనక్కు వెళ్లిపోతున్న కరెన్‌పై అవి దృష్టి పెట్టాయి.

కరెన్ యజమాని అలెక్స్ అపస్మారక స్థితిలో ఉన్న ఎమ్మాను మరియు దిగ్బ్రాంతి చెందిన ఆమెను చూడటానికి వస్తాడు. కరెన్‌ను ఆసుపత్రికి తరలించగా, డిటెక్టివ్‌లు అలెక్స్‌ను విచారించారు. అక్కడ నివసిస్తున్న వారి వివరాల గురించి డిటెక్టివ్ నకాగవా (రియో ఇషిబాషి) అలెక్స్‌ను అడుగుతాడు. పని నుంచి యోకో తప్పిపోయిన విషయాన్ని అతనికి చెబుతాడు. ఊయల నుంచి ఫోన్ హ్యాండ్‌సెట్ కనిపించకుండా పోయిన విషయాన్ని గుర్తించిన డిటెక్టివ్‌లు పేజ్ బటన్‌ను ముందుకు నెట్టుతారు. పైన ఉండే విశాలమైన గది నుంచి వస్తున్న శబ్దాలను, మాథ్యూ మరియు అతని భార్య శవాలను వారు గుర్తిస్తారు. అలాగే ఒక మనిషి దవడను కూడా వారు గుర్తిస్తారు. అది ఎవరిదై ఉండొచ్చని ఒకింత ఆశ్చర్యానికి గురైన వారు మిగిలిన శరీరం గురించి వెతుకుతారు. సినిమాలో తర్వాత అలెక్స్, కరెన్ మరియు యోకో పనిచేసిన సంరక్షక భవంతి మెట్ల నుంచి యోకో కాళ్లు కదపకుండా దిగడాన్ని అలెక్స్ గుర్తిస్తాడు. అతను ఆమె వైపు నడుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అతను ఒక ద్రవంపై జారుతాడు. తీరా దాన్ని తాకి చూస్తే, అది రక్తమని అతను గుర్తిస్తాడు. యోకును అలెక్స్ పదే పదే పిలుస్తాడు. అయితే ఆమె మెట్ల కిందకు చేరేంత వరకు అతని అరుపులకు ఏ మాత్రం స్పందించదు. తర్వాత తన ముఖం చూపించడానికి ఆమె తిరుగుతుంది. దాంతో అలెక్స్ భయాందోళనకు గురై, మరణిస్తాడు. ఆమె ముఖం అత్యంత భయంకరమైన రీతిలో కింది దవడ లేకుండా మరియు నాలుక వేలాడుతూ కనిపిస్తుంది. తెర కూడా నలుపు రంగులోకి మసకబారుతుంది.

కరెన్ ఆమె కథను డిటెక్టివ్‌లకు వివరిస్తుంది. బాలుడి యొక్క రూపును స్పష్టీకరిస్తుంది. తర్వాత కొద్ది రోజుల పాటు ఆమె స్నానపు గదిలోని షవర్ వద్ద, బస్సుపైన తదితర చోట్ల కయాకో వల్ల మానసిక ఆందోళనకు గురవుతుంది. భయపడినప్పటికీ, సంబంధిత ఇంటి యొక్క చరిత్రపై పరిశోధన జరపాలని ఆమె తీర్మానించుకుంటుంది. ఎట్టకేలకు మరణాల గురించి ఆమె తెలుసుకుంటుంది.

వరుసగా సంభవిస్తున్న మరణాలు మరియు మనుషులు అదృశ్యమవడానికి ఆ ఇల్లే కారణమంటూ సుసాన్ కార్యాలయ భవంతి వద్ద అమర్చిన సెక్యూరిటీ వీడియోని పూర్తిగా పరిశీలించిన అనంతరం డిటెక్టివ్ నకాగవా స్పష్టం చేస్తాడు. కయాకో గది కిందకు రావడాన్ని అతను చూస్తాడు. తర్వాత అది కెమేరాకి అభిముఖంగా రావడంతో వీడియో పనిచేయదు. దాంతో అతను రెండు క్యాన్ల పెట్రోలు తీసుకుని సాకి ఇంటికి తిరిగి వెళతాడు. స్నానపు తొట్టెలో తోషియో మునుగుతున్న శబ్దాలతో అతను కలవరపాటుకు గురవుతాడు. తొట్టెలో తేలాడుతున్న బాలుడ్ని అతను గుర్తిస్తాడు. అతన్ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. అతని కళ్లు పాక్షికంగా తెరుచుకుని ఉంటాయి. టకియో (తకాషి మట్సుయామా) అతని వెనుక ఉన్నట్లు కన్పిస్తుంది. తోషియో మాదిరిగానే టకియో తనను స్నానపు తొట్టెలోకి తోసివేయడానికి ముందు దానిని ఎదుర్కోవడానికి నకాగవాకు మాత్రమే సమయం ఉంటుంది.

ఇంటిలో ఏమి జరుగుతుంతో తెలుసుకునే ప్రయత్నం చేయని పీటర్ యొక్క వితంతువు మేరియా కిర్క్‌ను మరియు అందులో ఉంటున్నవారిని ఆమె భర్త ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని కరెన్ ప్రశ్నిస్తుంది. పాత ఫోటోల ద్వారా పరిశీలన చేసుకునే విధంగా కరెన్‌ను ఆమె అనుమతిస్తుంది. ప్రతి ఫోటో వెనుక భాగంలో కయాకో ఉండటాన్ని మరియు ఆ జంటను స్పష్టంగా వెంటాడటాన్ని కరెన్ గుర్తిస్తుంది. తర్వాత కరెన్ తన ప్రియుడు డౌ (జాసన్ బెర్) తో వారి అపార్ట్‌మెంట్ వద్ద మాట్లాడుతుంది. అయితే అతను తన సొంత పరిశీలన తర్వాత ఆమెను వెదుక్కుంటూ వెళ్లాడన్న విషయాన్ని ఆమె తెలుసుకుంటుంది. డౌను అన్వేషిస్తూ కరెన్ ఇంటికి తిరిగొస్తుంది.

ఇంటి లోపల పీటర్ కిర్క్ సందర్శన యొక్క గతస్మృతి అనుభూతిని కరెన్ పొందుతుంది. కయాకో ప్రొఫెసర్ పీటర్ కిర్క్ యొక్క ఒకప్పటి విద్యార్థిని అని మరియు ఆమె అతనితో చొరవగా ఉండేదన్న విషయం తెలుస్తుంది. కయాకో భర్త టకియో ఆమె యావను తెలుసుకుని, ఆవేశంతో ఆమెను మరియు తమ కుమారుడు తోషియోను హతమారుస్తాడు. ఇదే అసలు కళంకం. ఇంటి యొక్క 'ప్రతీకారం' (ఆన్రో). ఇంటిలోని తమ శవాలను పీటర్ గుర్తించినట్లు కరెన్ గతస్మృతి తెలుపుతుంది. కయాకోను టకియో ఘోరంగా హత్య చేయడాన్ని తట్టుకోలేక తీవ్ర ఉద్వేగానికి గురైన కరెన్ తడబడుతూ మెట్ల నుంచి కిందకు దిగుతుంది. తర్వాత ఇల్లు ప్రస్తుత కాలానికి తిరిగి చేరుకుంటుంది. ఆమె బయలుదేరడానికి ముందు డౌ ఆమె కాలిని గట్టిగా పట్టేసుకుంటాడు. ఆమెను నిలువరించే శక్తి అతనికి లేకపోవడంతో అతన్ని తలుపు వరకు ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. పై అంతస్తులకు వెళ్లడానికి ఒక తలుపు తెరుచుకుంటుంది. ప్రస్తుతం కయాకోగా మెట్లపై నుంచి పాకుతూ కిందకు దిగిన ఆన్రో వారి వైపు వచ్చి, డౌను అంతం చేస్తుంది. కరెన్ తలుపు తెరుస్తుంది. అయితే కయాకో ఆత్మ అక్కడకు హఠాత్తుగా చేరుకుంటుంది. వెంటనే ఆమె తలుపు వేసి, గ్యాస్ క్యాన్లలో ఒకదానిని ప్రయోగిస్తుంది. ఉన్నట్లుండి డౌ కయాకోగా మారడంతో ఆమె అతని లైటర్ తీసుకుని గ్యాస్‌కు అంటిస్తుంది. దాంతో తెర తెలుపు రంగులోకి మారిపోతుంది. (ప్రత్యేకంగా కూర్పు చేసిన వెర్షన్‌ (డైరెక్టర్స్ కట్) లో కరెన్‌ను అంబులెన్స్‌ వ్యానులో ఎక్కించే సన్నివేశాలు ఉన్నాయి).

తగలబడకుండా ఇల్లు రక్షించబడిందని కరెన్ ఆసుపత్రి వద్ద తెలుసుకుంటుంది. అలాగే డౌ మృతదేహం వద్ద విలపిస్తుంది. హఠాత్తుగా కయాకో వెండ్రుకలు మరియు చెయ్యి అతన్ని కప్పి ఉన్న దుప్పటి కింద నుండి వస్తాయి. అయితే ఇది తన భ్రమ (చేతులు మామూలుగా మారినప్పుడు) అని కరెన్ అనుకుంటుంది. కయాకో తర్వాత కరెన్ వెనుక కన్పిస్తుంది. కయాకో ఆమె మృత్యుఘోషను వినిపించడంతో ఆమె దృశ్యం ద్వారా ఈ చిత్రం సమాప్తమవుతుంది.

తారాగణం[మార్చు]

 • కరెన్ డేవిస్‌గా సారా మిచెల్లీ గెల్లార్. ఆమె ఒక మారకపు విద్యార్థినిగా సామాజిక చదువుల ఘనతను పొందడానికి సంరక్షక ఉద్యోగం చేస్తుంటుంది.
 • డౌగా జాసన్ బెర్. కరెన్ ప్రియుడైన ఇతను టోక్యో విశ్వవిద్యాలయంలో చదువుతుంటాడు. ఒక రెస్టారెంట్‌లో స్వల్పకాలిక ఉద్యోగం చేస్తుంటాడు.
 • మాథ్యూ విలియమ్స్‌గా విలియం మాపోదర్. ఇతను ఒక "గణకుడు"గా పనిచేస్తుంటాడు. ఇతను టోక్యోకు తిరిగి మకాం మార్చే విధంగా తన పై అధికారుల నుంచి పదోన్నతి పొందుతాడు.
 • జెన్నీఫర్ విలియమ్స్‌గా క్లియా డువాల్. మాథ్యూ యొక్క ఒంటరి భార్యగా జపాన్‌లో కొత్త జీవితానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తుంటుంది.
 • సుసాన్ విలియమ్స్‌గా కాడీ స్ట్రిక్‌ల్యాండ్. మాథ్యూ చిన్న సోదరియైన ఈమె టోక్యోలో ఉంటూ, అక్కడే పనిచేస్తుంటుంది. ఈమె తన సోదరుడు, వదిన మరియు తల్లి తమ కొత్త ఇంటిని ఎంచుకుని, అందులోకి వెళ్లే విధంగా వారికి సాయపడుతుంది.
 • ఎమ్మా విలియమ్స్‌గా గ్రేస్ జాబ్రిస్కీ. మాథ్యూ తల్లిగా ఈమె మృదుల చిత్తవైకల్యం మరియు తీవ్రమైన అతినిద్రతో బాధపడుతుంటుంది.
 • పీటర్ కిర్క్‌‌గా బిల్ పుల్‌మ్యాన్‌. టోక్యోలో టీచర్‌గా పనిచేస్తుంటాడు. తనకు తెలియని కయాకో అనే యువతి నుంచి ఇతను అసంఖ్యాక ప్రేమ లేఖలు అందుకుంటాడు.
 • మేరియా కిర్క్‌గా రోసా బ్లాసి. ఈమె పీటర్ భార్య.
 • అలెక్స్‌గా టెడ్ రైమి. ఈయన యోకో మరియు కరెన్ ఆశ్రయం పొందిన సంరక్షణ కేంద్రం యొక్క డైరెక్టర్.
 • Det.నకాగవాగాగా రియో ఇషిబాషి. ఇతను ఒక డిటెక్టివ్. సాకి కుటుంబం హత్య కేసుకు సంబంధించిన పరిశోధన చేస్తున్న సమయంలో ఇతని సహచరులందరూ అనుమానాస్పద రీతిలో చనిపోవడం లేదా అదృశ్యమవుతారు. ఇతనికి సదరు ఇంటి వివరాలు మరియు దాని విచిత్రమైన చరిత్ర గురించి తెలుసు.
 • యోకోగా యోకో మాకి. ఆంగ్లం మాట్లాడగలిగే ఒక జపాన్ సంరక్షక కార్యకర్తయైన ఈమె ఎమ్మా విలియమ్స్ సంరక్షణ కోసం నియమించబడుతుంది.
 • కయాకో సాకిగా తకాకో ఫుజి. వివాహితురాలైన ఈమె పీటర్ కిర్క్‌‌పై మోజు పెంచుకుంటుంది.
 • తోషియో సాకిగా యుయా ఓజెకి. కయాకో మరియు టకియో సాకి దంపతుల యొక్క ఎనిమిదేళ్ల కుమారుడు.
 • టకియో సాకిగా తకాషి మట్సుయామా. ఇతను కయాకో భర్త. ఆమె మరో పురుషుడిపై ఆశ పెంచుకుందని గుర్తించిన ఇతను తీవ్ర ఆవేశానికి గురవుతాడు. చలనచిత్ర సంఘటనలకు ముందు ఇతను కయాకోను చంపుతాడు. తద్వారా ఆ ఇల్లు శాపానికి గురవుతుంది.

యోగ్యతాపత్ర ప్రదానం[మార్చు]

మలేషియా 18SG, ఐస్‌లాండ్ 16, అమెరికా సంయుక్తరాష్ట్రాలు PG-13, స్వీడన్ 15, దక్షిణ కొరియా 15, న్యూజిలాండ్ R-16, జపాన్ PG-12, అర్జెంటీనా 16, ఆస్ట్రేలియా M, బ్రెజిల్ 14, కెనడా 13+ (క్యూబెక్), కెనడా 14A (అల్బెర్టా/బ్రిటీష్ కొలంబియా), కెనడా 14 (నోవా స్కాటియా), కెనడా PG (ఒంటారియో), చెక్ రిపబ్లిక్ 15, ఫిన్లాండ్ K-15, ఫ్రాన్స్: -12, జర్మనీ 16, ఐర్లాండ్ 15-PG (వాస్తవిక రేటింగ్), ఐర్లాండ్ 15 (వీడియో రేటింగ్), ఇటలీ T, నార్వే 15, ఫిలిప్పైన్స్ R-13, పోలాండ్ 18, పోర్చుగల్ M/16, సింగపూర్ PG, స్విట్జర్లాండ్ 14 (జెనీవా క్యాంటన్ (తాలుకా) ), స్విట్జర్లాండ్ 14 (వాద్ క్యాంటన్), స్విట్జర్లాండ్ 16 (జ్యూరిచ్ క్యాంటన్), UK 15, అమెరికా సంయుక్తరాష్ట్రాల రేటింగ్ ఇవ్వలేదు, నెదర్లాండ్స్ 16.

మాతృకతో తేడాలు[మార్చు]

వాస్తవిక జు-ఆన్‌ ది గ్రడ్జ్‌లో, టకియో చేత కయాకో తెరవెనుక హత్య చేయబడుతుంది. ప్రారంభంలోని ప్రకీర్ణకం మినహా ఆమె హత్య చేయబడిన తర్వాత అతను చూపించబడుతాడు. ఇది కయాకో జు-ఆన్ హత్యను ఒక రహస్యంగా మారుస్తుంది. కయాకో శరీరం మరియు ముఖంపై ఉన్న గాట్ల వల్ల ఆమె వినియోగ కత్తి ద్వారా హత్య చేయబడిందని విశ్వసించబడింది. DVD విడుదల సందర్భంగా తొలగించిన సన్నివేశంలో కయాకోను టకియో పేనాకత్తితో నరికినట్లు చూపబడింది. తమ పడకగదిలో తన డైరీని టకియో చదవడాన్ని కయాకో చూస్తుంది. అప్పుడతను ఆమెపై దాడి చేసి, ఆమెను కిందకు తోసివేసే ఆస్కారం ఉంది. మెట్లను నెమ్మదిగా పాకుతున్న ఆమెను టకియో అనుసరిస్తాడు. టకియో చేత కయాకో ఒక మూలకు నెట్టివేయబడుతుంది. తలుపు అమర్చిన గోడ ఆధారం తీసుకుంటాడు. మెట్లపై నుంచి జరుగుతున్న ఈ పరిస్థితిని అంతటినీ తోషియో గమనిస్తుంటాడు. అయితే అసలు ఏమి జరుగుతుందో అతనికి అర్థం కాదు. కయాకో మెడను కోయడానికి టకియో తన చేతిని ముందుకు ఎత్తుతాడు. దాంతో తోషియో అక్కడ నుంచి వెళ్లిపోయి, తన గదిలో దాక్కుంటాడు. కయాకోను టకియో తమ పడకగది వరకు ఈడ్చుకెళ్లి, అక్కడ వినియోగ కత్తితో ఆమెపై గాట్లు వేస్తాడు. తర్వాత ఆమెను ఒక ప్లాస్టిక్ సంచిలో మూటగట్టి, అటకపై వేస్తాడు. తర్వాత తోషియోని పట్టుకుని, అతని పీక కోస్తాడు. పిల్లితో ఉన్న తోషియోను టకియో గది చివరకు నెట్టేస్తాడు. కయాకో మృతదేహం అటకపై కన్పిస్తుంది. కయాకో ఆత్మ వల్ల సమీపంలోని వీధిలో టకియో మరణిస్తాడు (వాస్తవిక జు-ఆన్ ది కర్స్‌లో చూపించబడింది). అయితే కత్తితో కయాకో హతమవడానికి ముందు ఆమె మెడ విరిగినట్లు కూడా కన్పిస్తుంది. ఆమె తన మెడను కదిలించినప్పుడు వినిపించిన విరిగిన శబ్దాల ఆధారంగా ఇది గుర్తించబడింది.

అదే పునర్నర్మాణంలో, టకియో మెడ విరిచినప్పుడు కయాకో హతమవుతుంది. నరమేధానికి సంబంధించిన సన్నివేశాలు థియేట్రికల్ కట్లో తెరవెనుక చూపించబడగా, సన్నివేశాలన్నీ డైరెక్టర్స్ కట్‌ (ప్రత్యేకంగా కూర్పు చేసిన వెర్షన్) లో చూపించడం జరిగింది. డైరెక్టర్స్ కట్‌లో చలనచిత్రం ముగింపుకు ముందు చూపించే గతస్మృతిలో కయాకో తన పడకగది తలుపు ద్వారా వద్ద నిల్చుని ఉన్నట్లు చూపించబడుతుంది. టకియో తన డైరీ చదివాడని మరియు పీటర్ కిర్క్ పట్ల తన వాంఛ గురించి అతనికి తెలిసిపోయిందని ఆమె గ్రహించినట్లు అర్థం చేసుకోబడుతుంది. తర్వాత అతను హాలులో ఆమెను వెంటాడి, పట్టుకుంటాడు. బలవంతంగా ఆమె బట్టలు ఊడదీస్తాడు. నలువైపులా ఉన్న గోడలకు ఆమెను కొట్టడంతో ఆమె కాలికి తీవ్ర గాయమవుతుంది. దాంతో తప్పించుకోవడానికి కయాకో మెట్లపై నుంచి నెమ్మదిగా పాక్కుంటూ కిందకు దిగే ప్రయత్నం చేస్తుంది. అయితే టకియో ఆమెను పట్టుకుని, తన రెండు చేతులతో ఆమె మెడను విరిచేస్తాడు. ఈ సంఘటనలను కళ్లారా చూసిన తోషియో అతనితో పాటు ఉండే పిల్లి వెంటనే హతమార్చబడతారు. (ది సాకి మర్డర్స్‌లో వివరించబడింది).

ఒక ఆసక్తికరమైన ఉపగమనికగా జు-ఆన్‌లో, తోషియో మృతదేహం గురించి అసలు వివరించలేదన్న విషయాన్ని పదే పదే పేర్కొనడం జరిగింది. బహుశా అతని తల్లి కయాకో అతన్ని తినేసి ఉండొచ్చనే అభిప్రాయం ఏర్పడింది.

కాలక్రమం[మార్చు]

ఈ చిత్రంలో కయాకోను టకియో హత్య చేయడం ప్రాథమికమైనది. అది 1 నవంబరు 2001న అతని కుమారుడు తోషియో హత్యతో పాటు జరుగుతుంది. అది జరిగిన ఏళ్ల తర్వాతే విలియమ్స్ కుటుంబం కథ 2004 మొదట్లో ప్రారంభమవుతుంది. తర్వాత కరెన్ మరియు యోకో కథలు అక్టోబరు, 2004లో జరుగుతాయి.

ఆదరణ[మార్చు]

ఈ చిత్రం ఉత్తర అమెరికా[5]లో 3,348 థియేటర్లలో ప్రదర్శించబడింది. ఇది విడుదలైన తొలి వారాంతానికి (అక్టోబరు 22-24, 2004) టిక్కెట్ల విక్రయాల ద్వారా $39.1 మిలియన్లను వసూలు చేసింది. రెండో వారాంతానికి వసూళ్లు 43% మేర తగ్గి, $21.8 మిలియన్లకు పడిపోయాయి. హౌస్ ఆన్ హాంటెడ్ హిల్ తర్వాత హాలోయన్ బాక్సాఫీసు వద్ద ఇది తొలి భయానక చిత్రంగా అగ్రస్థానంలో నిలిచింది.[6] ఈ చిత్రం బాక్సాఫీసు విశ్లేషకులు మరియు సోనీ పిక్చర్స్ అధికారుల అంచనాలను మించి, ఒక్క ఉత్తర అమెరికాలోనే US$ 110,359,362, ప్రపంచవ్యాప్తంగా $187,281,115 వసూలు చేసింది. ఈ చిత్ర నిర్మాణ వ్యయం $10 మిలియన్ల కంటే తక్కువగానే ఉంటుందని సోనీ తెలిపింది. తద్వారా ఆ ఏడాది అత్యధిక లాభాలను ఆర్జించి పెట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.[7].

ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. రోటెన్ టమోటాస్ (తాజాగా పరిగణలోకి తీసుకున్న 151 చలనచిత్ర సమీక్షలలో 59) లో దీనికి 39% "రోటెన్" (చెత్త) రేటింగ్‌ లభించింది. తానిప్పటి వరకు చూసిన చిత్రాల్లో ఇది అత్యంత భయానక చిత్రమని క్లాసిక్ FMకు చెందిన సినీ విమర్శకుడు సైమన్ బేట్స్ అభివర్ణించాడు.

కొనసాగింపులు[మార్చు]

దీనికి కొనసాగింపు (సీక్వెల్) గా ది గ్రడ్జ్ 2ని ఇది విడుదలైన[8] మూడు రోజులకు ప్రకటించారు. ఇది 2006లో విడుదలైంది. కొనసాగింపు చిత్రంలో కరెన్ చిన్న సోదరి అబ్రేగా అంబర్ తాంబ్లిన్ నటించింది. కరెన్‌ను జపాన్ నుంచి ఇంటికి తీసుకురావడానికి అబ్రేను తన తల్లితో పాటు అక్కడకు పంపుతారు.

కామిక్-కాన్ 2006 సమయంలో ది గ్రడ్జ్ 3ని సోనీ ప్రకటించింది. ఈ కొనసాగింపు చిత్రానికి దర్శకత్వం వహించమని తొలుత తనకు ప్రతిపాదన వచ్చిందని, అయితే నిర్మించడానికే తాను మక్కువ చూపానని తకాషి షిమిజు తెలిపాడు.[9] 2007 అక్టోబరు 23న ఈ చిత్రానికి టాబీ విల్కిన్స్ దర్శకత్వం వహిస్తాడని స్పష్టమైంది. లఘు చిత్రాలు రూపొందించిన ఆయన 2006లో ది గ్రడ్జ్ 2 చిత్రం విడుదలకు ప్రచార వస్తువుగా టేల్స్ ఫ్రమ్ ది గ్రడ్జ్‌ను రూపొందించాడు.[10] దీనిని తకాషి షిమిజు మరియు శామ్ రైమి సంయుక్తంగా నిర్మిస్తారు. దీనికి సంబంధించిన కథనం యొక్క రెండో ముసాయిదా పూర్తయింది, [4][11] ఈ సినిమా చిత్రీకరణ తదుపరి స్క్రిప్ట్ రూపకల్పన ఆధారంగా జనవరి, 2008 మొదట్లో ప్రారంభం కావొచ్చు. ది గ్రడ్జ్ శ్రేణిలో ఇదే ఆఖరు చిత్రం.[12]

2007 అక్టోబరు 31న ఈ చిత్రం కథనాన్ని బ్రాడ్ కీనీ రచించాడన్న విషయంతో పాటు దీని సారాంశం కూడా బహిర్గతమైంది. కథ విషయానికొస్తే..."ఒక జపాన్ మహిళ గ్రడ్జ్ శాపాన్ని ముగించడానికి ఒక రహస్యాన్ని తనలోనే దాచుకుంటుంది. ఆమె తరచుగా సందర్శించే చికాగో అపార్ట్‌మెంట్ భవనానికి వెళుతుంది. అక్కడ దెయ్యాల (ఆత్మల) నుంచి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న ఒక కుటుంబాన్ని ఆమె కలుసుకుంటుంది. ఆసన్న విషాద విధి నుంచి తమ ఆత్మలను రక్షించుకోవడానికి వారు కయాకో దెయ్యాన్ని కలిసి ఎదుర్కొంటారు." [13]

2008 జనవరి 19న మాథ్యూ నైట్ జేక్ పాత్రను తిరిగి పోషిస్తాడని వెల్లడైంది. చిత్ర నిర్మాణం మార్చి, 2008లో బల్గేరియాలో మొదలుకావొచ్చని తెలిసింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలకాక పోవచ్చని, దానికి బదులు నేరుగా DVDలు విడుదలవ్వొచ్చని కూడా తెలి సింది.[14]

జులై, 2010 నాటికి ఈ శ్రేణి కొనసాగింపుపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.

హోమ్ రిలీజ్[మార్చు]

ఈ చిత్రం DVD మరియు UMD 2005 ఫిబ్రవరి 1న విడుదలయ్యాయి. కొన్ని ప్రత్యేక విశిష్టతలతో మాత్రమే ఈ చిత్రం ఒక ప్రామాణిక వెర్షన్‌గా విడుదలైంది.[15] 2005 మే 17న ది గ్రడ్జ్ యొక్క MPAA-రేటింగ్‌రహిత డైరెక్టర్స్ కట్ DVD ఉత్తర అమెరికాలో విడుదలైంది. గమనం మరియు కథాంశ కారణాల చేత MPAA మరియు ఇతర సంస్థల నుంచి తక్కువ రేటింగ్ పొందడం కోసం తొలగించిన అనేక సన్నివేశాలను ఈ విడుదలలో పొందుపరిచారు. ఈ చిత్రం వెర్షన్‌ను జపాన్‌లో ధారావాహిక ప్రదర్శన మాదిరిగా ఉపయోగించారు. ఇందులో కొత్తగా తొలగించిన సన్నివేశాలు, వ్యాఖ్యానాలు, కార్నర్‌లోని కథలు మరియు మరిన్ని ఇతర అంశాలు కూడా ఉన్నాయి.[16]

దీనిని ఐట్యూన్స్‌లో కొనుగోలు చేసే సదుపాయాన్ని 2008లో కల్పించడం జరిగింది.

2008లో జర్మనీలో ఈ చిత్రం బ్లూ-రే డిస్క్‌ విడుదలైంది. అలాగే 2009 మే 12న అంటే ది గ్రడ్జ్ 3 DVD విడుదలైన రోజే U.S.లో దీని బ్లూ-రే డిస్క్ విడుదలైంది.

డైరెక్టర్స్ కట్[మార్చు]

సోనీ/కొలంబియా సంస్థలు విడుదల చేసిన సమకాలీన డైరెక్టర్స్ కట్/రేటింగ్‌రహిత DVDల్లో కొన్ని మాత్రమే ప్రయోజనకరమైన విస్తృత వెర్షన్లుగా నిరూపించుకున్నాయి. వాటిలో స్వల్ప PG-13 రేటింగ్ పొందే విధంగా సూక్ష్మీకరించబడిన ది గ్రడ్జ్ ఒకటి. విస్తరించిన దిగ్బ్రాంతి క్షణాలు, విపరీతమైన హింస మరియు నిగూఢమైన పాత్రలు ఈ వెర్షన్‌ను నిర్వచిస్తాయి (దీనిపై పూర్తి అధికారం దర్శకుడు షిమిజుదే). అందువల్ల ప్రదర్శన సంబంధ వెర్షన్ ఉపయోగించడానికి తగనిదిగా మారింది.

థియేటర్ సంబంధిత వెర్షన్ (థియేట్రికల్ కట్) లో లేని మరియు ప్రత్యేకంగా డైరెక్టర్స్ కట్ DVD ద్వారా అందుబాటులో ఉన్న కొన్ని సన్నివేశాలు దిగువ పేర్కొనబడ్డాయి.

 • అతి దగ్గరి నుంచి తీసిన పీటర్ కిర్క్ ముఖ చిత్రం. అతని తల కింద నుంచి చెల్లాచెదురుగా పడిన రక్తం.
 • నెత్తుటితో తడిసి, బంకలాగే ఉండే ఒక టేపును ఇటీవల దానిని అదుపులోకి తీసుకున్న ఎమ్మా నుంచి యోకో స్వీకరించింది.
 • కయాకో చేతిలో హతమవడానికి ముందు సాకి ఇంటి యొక్క అనేక ప్రదేశాలను యోకో శుభ్రపరుస్తుండే సుదీర్ఘమైన, ప్రత్యామ్నాయ సన్నివేశం.
 • కరెన్‌ను డౌ ముద్దాడుతాడు. జపాన్‌లో ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచడం అమర్యాద అని అతనికి ఆమె గుర్తు చేస్తుంది. తర్వాత అక్కడ ఒక బల్లపై కూర్చొని ఉన్న జపాన్ జంటను చూసి, ఇద్దరూ ముద్దాడుకుంటారు. ఇదంతా దాదాపు సామాజిక కార్యకర్తల కంటే ఆలస్యంగా ఆమె రావడానికి ముందు చోటు చేసుకునే సన్నివేశానికి ముందుగా జరిగేది.
 • ఎమ్మా వేలిపై రక్తంతో తడిసిన కట్టు గురించి ఆమెను కరెన్ అడుగుతుంది. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన రాదు.
 • డైరెక్టర్స్ కట్ మొత్తంగా ఒక కొత్త సన్నివేశాన్ని సమర్పించింది. అంతస్తుల పై భాగాన ఉన్న గదిలోకి సుసాన్ ప్రవేశించి, అక్కడ ఒక బల్లపై ఉన్న నల్ల పిల్లి పింగాణీ ప్రతిమను చూస్తుంది. గది నుంచి బయటకు వచ్చే సమయంలో గోడలపై చిత్రీకరించిన పిల్లుల చిత్రాలను ఆమె చూస్తుంది. ఆమె గదిని వీడిన తర్వాత హాలును పై నుంచి చూస్తున్న మరో చిత్రం కూడా ఉంది.
 • జెన్నీఫర్‌కు నిద్రపట్టక పైకి లేస్తుంది. ఆమె పడకగదికి ఎదురుగా ఉండే పిట్టగోడపై వాలింది. అలసిపోయినట్లు కన్పిస్తోంది.
 • విలియమ్స్ కుటుంబానికి సంబంధించిన ప్రత్యామ్నాయ సన్నివేశం: సాకి శాపం యొక్క రుజువును మాథ్యూ, జెన్నీఫర్ వర్ణించడం చివరికి వారి చావుకు దారితీసింది. మాథ్యూ (ప్రస్తుతం అతను టకియో నియంత్రణలో ఉన్నాడు) జెన్నీఫర్ జుత్తు పట్టుకుని (ఆమెను కయాకో ఆవహించింది) ఆమెను అటకపైకి ఈడ్చుతాడు. దాదాపు కయాకో, టకియో మధ్య చోటు చేసుకునే గతస్మృతి సన్నివేశం మాదిరిగానే. ప్రత్యామ్నాయంగా సుసాన్ ఇంటిలోకి అడుగుపెడుతుంది. కిందికి వచ్చి, భోజనం చేయమని జంటను పిలుస్తుంది. తర్వాత ఆమె ఉద్వేగంతో భయపడేలా సిద్ధమవ్వండి అనే సంకేతమిస్తుంది. మెట్లపై మౌనంగా కూర్చొని ఉన్న ఆవహించిన మాథ్యూ భయపెట్టడంతో ఆమె ఉన్నట్లుండి మెట్లను ఎక్కుతుంది. అసాధారణ అతీంద్రియ శక్తి కలిగినట్లు కనిపించే మాథ్యూ ఒక్కసారిగా సుసాన్‌ను ఇంటి బయట విసిరి పారేసే ప్రయత్నం చేస్తాడు. ఈ పరిణామంతో అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని సుసాన్ ఆత్రుత చెందుతుంది. మాథ్యూ నెమ్మదిగా మెట్లు ఎక్కుతాడు. అతను గదిలోకి ప్రవేశించగానే ఉన్నట్లుండి నలుపు రంగు దేహం కలిగిన వ్యక్తి అతన్ని అనుసరిస్తాడు. అది నలుపు రంగులో మారురూపాన్ని సంతరించుకున్న కయాకో ఆత్మ మాదిరిగా కన్పిస్తుంది. గది తలుపు దానికదే మూసుకుంటుంది. తర్వాత తెర నలుపు రంగులోకి మసకబారుతుంది.
 • కయాకో నుంచి తప్పించుకున్న తర్వాత సుసాన్ తన అపార్ట్‌మెంట్‌కు వెళుతుంది. అక్కడ కుళాయి కారుతున్నట్లు ఆమెకు శబ్దం వినిపిస్తుంది. దాంతో ఆమె కుళాయి దగ్గరకు నడుచుకుంటూ వెళుతుంది. అక్కడ కదులుతున్న కయాకో చేతిని ఆమె చూస్తుంది. దాంతో భయపడ్డ ఆమె తన పడకగదిలోకి వెళుతుంది. అయితే ఆమె దుప్పటి కింద ఉన్న కయాకో చివరకు ఆమెను హతమారుస్తుంది.
 • ముఖాల్లో నెత్తుటి చుక్క లేని విధంగా కనిపించే విలియమ్స్ జంట యొక్క క్లోజప్ చిత్రం. థియేట్రికల్ వెర్షన్‌లో ఈ చిత్రం చాలా దూరం నుంచి తీయబడి ఉంటుంది.
 • పీటర్ కిర్క్ భార్యతో కరెన్ సంభాషణను పొడగించారు.
 • అతి దగ్గరి నుంచి తీసిన యోకో యొక్క దవడ చిత్రం డైరెక్టర్స్ కట్‌లో మరింత పొడవుగా ఉంది. అదే థియేట్రికల్ వెర్షన్‌లో ప్రత్యేకించి దృష్టి పెట్టి చూడాల్సిన పరిస్థితి.
 • రూపురేఖలు మారిపోయిన యోకో ఆత్మ అలెక్స్ వద్దకు వచ్చే సన్నివేశం నిడివి పొడవుగా ఉంటుంది. థియేట్రికల్ కట్‌లో ఆమె ముఖాన్ని మనం కొద్ది సెకన్లే చూస్తాం. అయితే అదే సన్నివేశం ఆమె వెనుకకు మరలడం మరియు బిగ్గరగా అరవడం చేసే డైరెక్టర్స్ కట్‌లో మాత్రం దాదాపు పది సెకన్లు ఉంటుంది.
 • డైరెక్టర్స్ కట్‌లో డౌ అమెరికా రెస్టారెంట్‌కు చెందిన అనేక మంది ఉద్యోగులకు పలకరిస్తాడు.
 • ముగింపులో మెట్లపై కిందకు పాకుతున్న రక్తసిక్తమైన కయాకోను మనం చూస్తాం.
 • కయాకో మరియు తోషియో మరణ సన్నివేశం థియేట్రికల్ వెర్షన్‌లో కంటే ఎక్కువ నిడివి కలిగి, అత్యంత హింసాత్మకంగా ఉంటుంది.

ప్రధాన ప్రసక్తులు[మార్చు]

 1. IMDB (October 20, 2006). "The Grudge production budget". IMDB. Retrieved 2006-10-20.
 2. IMDB (October 5, 2006). "The Grudge release date". IMDB. Retrieved 2006-10-20.
 3. IMDB (October 20, 2006). "Grudge 2 directed by original Ju-on director". IMDB. Retrieved 2006-10-20.
 4. 4.0 4.1 Shock Till You Drop (October 16, 2007). "Screenplay sent in to Ghost House Pictures". Shock Till You Drop. మూలం నుండి 2009-05-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-10-16.
 5. Box Office Mojo (October 20, 2006). "Grudge opens on 3,348 theatres". Box Office Mojo. Retrieved 2006-10-20.
 6. Box Office Mojo (October 20, 2006). "Grudge tops box office". Box Office Mojo. Retrieved 2006-10-20.
 7. Box Office Mojo (October 20, 2006). "The Grudge was expected to generate 20 Million". Box Office Mojo. Retrieved 2006-10-20.
 8. IMDB (September 10, 2006). "Grudge 2 announced 3 days after the release of The Grudge". IMDB. Retrieved 2006-10-20.
 9. Bloody Disgusting (October 20, 2006). "Grudge 3 announced at Comic Con". Bloody Disgusting. Retrieved 2006-10-20.
 10. Bloody Disgusting (October 22, 2007). "Toby Wilkins attached to direct The Grudge 3". Bloody Disgusting. Retrieved 2007-10-22.[permanent dead link]
 11. Bloody Disgusting (October 16, 2007). "Sam Raimi sends in a second draft for screenplay". Bloody Disgusting. Retrieved 2007-10-16.[permanent dead link]
 12. Shock Till You Drop (October 22, 2007). "Production to begin January 2008". Shock Till You Drop. Retrieved 2007-10-22.
 13. Bloody Disgusting (October 31, 2007). "Story for The Grudge 3 revealed". Bloody Disgusting. మూలం నుండి 2011-10-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-10-31.
 14. Bloody Disgusting (January 19, 2008). "First Official 'Grudge 3' Casting News!". Bloody Disgusting. మూలం నుండి 2009-02-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-01-19.
 15. Amazon (October 20, 2006). "Standard Version release". Amazon. Retrieved 2006-10-20.
 16. Amazon (October 20, 2006). "Uncut Version release". Amazon. Retrieved 2006-10-20.

ప్రత్యేకమైన ప్రసక్తులు[మార్చు]

 • 39. 2009 జూన్ 13న పునరుద్ధరించబడింది.
 • Gray, Brandon (1 November 2004). "'Ray,' 'Saw' See Robust Bows". Box Office Mojo. Cite news requires |newspaper= (help). 2009 జూన్ 13న పునరుద్ధరించబడింది.
 • "The Grudge". Box Office Mojo. Retrieved June 13, 2005.
 • "The Japanese Version of 'The Grudge' Exposed!!!". Bloody-Disgusting. March 5, 2005. Cite news requires |newspaper= (help). 2009 జూన్ 13న పునరుద్ధరించబడింది.
 • "The Dance". October 13, 2006. Retrieved June 13, 2006. Cite web requires |website= (help)
 • "How to do the grudge moves!!!". Youtube. October 5, 2006. Cite news requires |newspaper= (help). రిట్రీవడ్ 2006 అక్టోబరు 5.

బాహ్య లింకులు[మార్చు]

మూస:The Grudge మూస:Renaissance Pictures