ది గ్రేటెస్ట్ షో ఆన్ ద ఎర్త్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది గ్రేటెస్ట్ షో ఆన్ ద ఎర్త్
సినిమా పోస్టర్
దర్శకత్వంసిసిల్ బి.డి మిల్లీ
స్క్రీన్ ప్లే
  • ఫ్రెడ్రిక్ ఎం.ఫ్రాంక్
  • థియోడర్ సెయింట్ జాన్
  • బారే లిండన్
కథ
  • ఫ్రెడ్రిక్ ఎం.ఫ్రాంక్
  • థియోడర్ సెయింట్ జాన్
  • ఫ్రాంక్ కావెట్
నిర్మాతసిసిల్ బి.డి మిల్లీ
తారాగణం
  • బెట్టీ హట్టన్
  • కార్నెల్ వైల్డ్
  • ఛార్ల్‌టన్ హెస్టన్
  • డోరతీ లామర్
  • గ్లోరియా గ్రాహమ్‌
  • హెన్రీ విల్‌కాక్సన్
  • లైల్ బెట్జర్
  • జేమ్స్ స్టూవర్ట్
Narrated byసిసిల్ బి.డి మిల్లీ
ఛాయాగ్రహణంజార్జ్ బార్నెస్
కూర్పుఅన్నే బాచెన్స్
సంగీతంవిక్టర్ యంగ్
పంపిణీదార్లుపారమౌంట్ పిక్చర్స్
విడుదల తేదీ
1952 జనవరి 10 (1952-01-10)
సినిమా నిడివి
152 నిమిషాలు
దేశంఅమెరికా
భాషఇంగ్లీషు
బడ్జెట్$4 మిలియన్లు[1]
బాక్సాఫీసు$36 మిలియన్లు[1]

'ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్' సిసిల్ బి.డి మిల్లీ స్వీయదర్శకత్వంలో నిర్మించి 1952లో పారామౌంట్ పిక్చర్స్ ద్వారా విడుదల చేసిన టెక్నికలర్‌ అమెరికన్ చలనచిత్రం.[2] రింగ్లింగ్ బ్రదర్స్ అండ్ బార్నమ్ & బెయిలీ సర్కస్ కంపెనీకి చెందిన 1400 మంది సర్కస్ కళాకారులను, వందలాది జంతువులను, 60 రైల్‌రోడ్ కార్ల సర్కస్ సామాగ్రి, టెంట్లు వగైరా ఈ సినిమాలో వాడుకున్నారు.

కథ[మార్చు]

నిజానికి 'ది గ్రేట్ షో ఆన్ ఎర్త్' చిత్రం కథ ఒక సర్కస్ కంపెనీ యజమాని గురించి! ఆ యజమానికి సర్కస్‌కు మించింది మరొకటిలేదు. దీనికోసం అతను మనుషులు, వారి ప్రాణాలను సైతం పరిగణనలోకి తీసుకోడు. ఇక అతని గర్ల్ ఫ్రెండ్ కూడా సర్కస్‌లో ఒక ఫ్లయింగ్ ఆర్టిస్టుగా పనిచేస్తుంటుంది. సర్కస్‌లో ఉండే విదూషకుడు (జోకర్) ఒక హత్య కేసులో నిందితుడు కావటంతో పోలీసులు అతన్ని వెంటాడుతుంటారు. అదే సర్కస్ కంపెనీలో పనిచేస్తూ ఏనుగులకు ట్రైనింగ్ ఇచ్చే పాత్ర మరొకటి. అతన్ని ప్రేమించనంటూ పంతం పట్టే మరో సర్కస్ కళాకారిణి. మొత్తం మీద సర్కస్ డేరా క్రింద మనుషుల మధ్య జరిగే నాటకం అంతా ఈ చిత్రంలో కథారూపంలో మనకు దర్శనం ఇస్తుంది. కథలో భాగంగా ఒక సర్కస్ కంపెనీ జీవితం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడవచ్చు. సర్కస్ కంపెనీ ఒకచోట నుంచి మరొక చోటికి మారటానికి జరిగే ప్రయత్నం, సర్కస్ జంతువులను, సామగ్రిని రైళ్లలో తరలించటం, కొత్త ప్రదేశానికి చేరి అక్కడ మళ్లీ టెంటు వేయటం, షోను ప్రారంభించటం.. ఇదంతా కథలో భాగంగా చూపిస్తారు. చిత్రం చివరలో ఆ సర్కస్ ట్రెయిన్ ఒక ప్రమాదానికి గురై చాలా వస్తువులు, జంతువులు నశించిపోయినా, మళ్లీ మరునాటి ఆటకు అందరూ సిద్ధం కావటం ఈ చిత్రంలోని పాజిటివ్ దృక్పథానికి నిదర్శనం. ఏం జరిగినా జీవితం ఆగకుండా కొనసాగుతుంది (ది షో మస్ట్ గో ఆన్) అనే సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుంది.[2]

నటీనటులు[మార్చు]

హోలీ పాత్రలో బెట్టీ హటన్
ది గ్రేట్ సెబాస్టియన్‌గా కార్నెల్ వైల్డ్
  • బెట్టీ హటన్ - హోలీ
  • కార్నెల్ వైల్డ్ - ది గ్రేట్ సెబాస్టియన్
  • చార్ల్‌టన్ హెస్టన్- బ్రాడ్ బ్రాడెన్
  • జేమ్స్ స్టూవర్ట్- బటన్స్ (జోకర్)
  • డోరతి లేమూర్ - ఫిల్లిస్
  • గ్లోరియా గ్రాహమ్‌ - ఏంజెల్
  • హెన్రీ విల్‌కాక్సన్ - ఎఫ్.బి.ఐ.ఏజెంట్
  • లారెన్స్ టైర్నీ - మిస్టర్ హెండర్సన్
  • లైల్ బెట్జర్ - క్లౌస్
  • బాబ్ కార్సన్ - రింగ్ మాస్టర్
  • జాన్ రిడ్జ్లీ - అసిస్టెంట్ మేనేజర్
  • ఫ్రాంక్ విల్‌కాక్స్ - సర్కస్ డాక్టర్
  • బ్రాడ్ జాన్సన్ - విలేఖరి
  • జాన్ కెల్లాగ్ - హారీ
  • సిసిల్ డి మిల్లీ - వ్యాఖ్యాత
  • ఛార్మిన్ హార్కర్ - ఛార్మిన్[3]

ఈ సినిమాలో సుమారు 85 రింగ్లింగ్ బ్రదర్స్ అండ్ బార్నమ్ & బెయిలీ సర్కస్ మాంటేజ్ దృశ్యాలున్నాయి. అందులో నిజమైన సర్కస్ కళాకారులు కనిపిస్తారు. జాన్ రింగ్లింగ్ నార్త్ ఆ సర్కస్ యజమాని అదే పాత్రలో కనిపిస్తాడు.[4]

పురస్కారాలు[మార్చు]

25 అకాడమీ పురస్కారాలకు ఈ చిత్రం ఐదు విభాగాలలో నామినేట్ కాగా రెండింటిని గెలుచుకుంది.

అకాడమీ అవార్డు ఫలితం విజేత
ఉత్తమచిత్రం గెలుపు సిసిల్ బి. డి మిల్లీ, పారమౌంట్ పిక్చర్స్
ఉత్తమ దర్శకుడు ప్రతిపాదన సిసిల్ బి. డి మిల్లీ
ఉత్తమ కథా రచన గెలుపు ఫ్రెడ్రిక్ ఎం.ఫ్రాంక్, థియోడర్ సెయింట్ జాన్, ఫ్రాంక్ కావెట్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, కలర్ ప్రతిపాదన ఎడిత్ హెడ్, డోరతీ జీకిన్స్, మైల్స్ వైట్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ ప్రతిపాదన అన్నే బాచెన్స్

ప్రభావాలు[మార్చు]

ఈ సినిమా ప్రభావంతో అనేక సినిమాలు, టెలివిజన్ సీరియళ్ళు రూపొందించ బడ్డాయి. ఇదే పేరుతో 30 ఎపిసోడ్ల టి.వి.సీరీస్ 1963-64లో ఎబిసి ఛానల్‌లో ప్రదర్శింబడింది. 1989లో దూరదర్శన్‌లో సర్కస్ అనే పేరుతో ఒక హిందీ సీరియల్ ప్రసారమయ్యింది. అజీజ్ మీర్జా, కుందన్ షా ల దర్శకత్వంలో వెలువడిన ఈ 19 ఎపిసోడ్ల సీరియల్‌లో షారుఖ్ ఖాన్, మకరంద్ దేశ్‌పాండే, అశుతోష్ గోవారికర్, నీరజ్ వోరా, రేణుకా సహాని మొదలైన నటీనటులున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్‌పై ఈ సినిమా ప్రభావం చాలా ఉంది. అతడు దర్శకత్వం వహించిన వార్ ఆఫ్ ది వరల్డ్ (2005), సూపర్ 8 (2011), ది ఫేబుల్ మాన్స్ (2022) చిత్రాలలో కొన్ని సన్నివేశాలకు ఈ సినిమాయే ప్రేరణ.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "ది గ్రేటెస్ట్ షో ఆన్ ద ఎర్త్ (1952)". బాక్సాఫీస్ మోజో. Retrieved August 17, 2016.
  2. 2.0 2.1 పాలకోడేటి సత్యనారాయణరావు (1 April 2007). హాలీవుడ్ క్లాసిక్స్ మొదటి భాగం (1 ed.). హైదరాబాదు: శ్రీ అనుపమ సాహితి. pp. 72–73.
  3. Lentz, Robert J. (2014-01-10). గ్లోరియా గ్రాహమ్‌, బ్యాడ్ గర్ల్ ఆఫ్ ఫిల్మ్ నోయిర్: ది కంప్లీట్ కెరీర్ (in ఇంగ్లీష్). మెక్ ఫార్‌లాండ్. ISBN 978-0-7864-8722-6.
  4. ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్, జనవరి 2, 1952 సమీక్ష వెరైటీ పత్రిక నుండి.

బయటి లింకులు[మార్చు]