ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The Pursuit of Happiness
దర్శకత్వంGabriele Muccino
నిర్మాతTodd Black Jason Blumenthal James Lassiter Will Smith Steve Tisch
రచనSteven Conrad
నటులుWill Smith Jaden Smith Thandie Newton Brian Howe (actor) Brian Howe Dan Castellaneta
సంగీతంAndrea Guerra
ఛాయాగ్రహణంPhedon Papamichael
కూర్పుHughes Winborne
నిర్మాణ సంస్థ
Relativity Media Overbrook Entertainment Escape Artists
పంపిణీదారుColumbia Pictures
విడుదల
Film date 2006 12 15
నిడివి
117 minutes
దేశంFilm US
భాషఆంగ్ల భాష
ఖర్చు$55 million
బాక్సాఫీసు$307,077,295

ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది 2006లో తెరమీదకు వచ్చిన ఒక అమెరికన్ జీవితచరిత్రకు సంబంధించిన నాటకీయ చలనచిత్రం, క్రిస్ గార్డనర్ జీవితం ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రానికి గాబ్రియల్ ముకినో దర్శకత్వం వహించారు. అప్పుడప్పుడూ తలదాచుకోవడానికి ఇల్లు కూడా లేని సేల్స్‌మెన్ నుంచి స్టాక్‌బ్రోకర్‌గా మారే ఈ చిత్రంలోని గార్డనర్‌ పాత్రలో విల్ స్మిత్ నటించాడు.

స్టీవెన్ కాన్‌రాడ్ రాసిన ఈ చిత్రం యొక్క స్క్రీన్‌ప్లే, క్యూన్సీ ట్రౌప్‌తో కలిసి గార్డనర్ రాసిన బాగా అమ్మడైన మెమోయిర్ ఆధారంగా రూపుదిద్దుకుంది. కొలంబియా పిక్చర్స్ ద్వారా డిసెంబర్ 15, 2006న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలోని నటనకు గానూ, ఉత్తమ నటుడు నామినేషన్ ద్వారా స్మిత్ అకాడమీ అవార్డును మరియు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్‌ను అందుకున్నాడు.

ఇతివృత్తం[మార్చు]

1981లో, శాన్ ఫ్రాన్సిస్కోలో నివసించే క్రిస్ గార్డనర్ (విల్ స్మిత్) తన కుటుంబ పొదుపుల మొత్తాన్ని ఎముక-సాంద్రతను తెలిపే ఒక చిన్న స్కానర్ల కొనుగోలు కోసం వెచ్చించడంతో పాటు వాటి గురించి వైద్యులకు వివరించడం ద్వారా వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, అతను పెట్టిన పెట్టుబడి మొత్తం తెల్ల ఏనుగు చందమేనని నిర్ధారణ కావడంతో పాటు అది ఆర్థికంగా అతని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, ఫలితంగా అతని భార్య లిండా (తన్డీ న్యూటన్‌) అతన్ని విడిచి వెళ్లిపోతుంది, దీంతో అతను తన కుమారుడు క్రిస్టోఫర్‌ (జడెన్ స్మిత్) ను వెంటబెట్టుకుని న్యూయార్క్ చేరుకుంటాడు. ఓపక్క డౌన్‌డౌన్‌లో తన స్కానర్లలో ఒకదాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు డెన్ విట్టెర్ మేనేజర్‌ను కలిసిన క్రిస్, ఒక చిన్నపాటి క్యాబ్ ప్రయాణం సమయంలో రుబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించడం ద్వారా అతని అభిమానాన్ని సంపాదిస్తాడు. ఆవిధంగా లభించిన కొత్త అనుబంధంతో అతను ఇంటెర్న్ స్టాక్‌బ్రోకర్ అయ్యే అవకాశం లభిస్తుంది, అయితే తనకు లభించిన పదవికి జీతమేదీ లభించదని తెలియడంతో క్రిస్ దాదాపు ఆ ఉద్యోగాన్ని వదిలేయడానికి సిద్ధమవుతాడు. అయితే పన్నులు చెల్లించని కారణంగా IRS ద్వారా అతని బ్యాంక్ ఖాతా జప్తుకు గురికావడంతో అతను తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు, దీంతోపాటు అతను, అతని కుమారుడు ఇంటి నుంచి వెళ్లగొట్టబడుతారు. ఫలితంగా వారు ఇల్లులేని వారుగా మారడంతో పాటు, ఒకానొక సందర్భంలో తండ్రీకొడుకులిద్దరూ BART స్టేషన్‌లోని బాత్‌రూంలో గడపాల్సి వస్తుంది. దీంతో గ్లిడ్ మెమోరియల్ యునైటెడ్ మెథడిస్ట్ చర్చిలో చేరేందుకు క్రిస్ సిద్ధపడుతాడు, ఈ చర్చి ప్రాథమికంగా ఇల్లు లేని ఒంటరి తల్లులు మరియు వారి పిల్లలకు ఆశ్రయం కల్పిస్తుంటుంది. అక్కడ కేవలం పరిమిత సంఖ్యలో గదులకు మాత్రమే అవకాశం ఉండడంతో, వరుస సంఖ్యలో స్థలాన్ని చేజిక్కించుకోవడం కోసం ప్రతి మధ్యాహ్న సమయంలో క్రిస్ తన ఇంటర్న్‌షిప్ పని నుంచి పిచ్చివాడిలాగా పరుగులు పెట్టాల్సి వస్తుంది. మరోవైపు తన యజమాని కారుపై పార్కింగ్ టికెట్ పొందిన కారణంగా అతను ఒక రాత్రి మొత్తం జైల్లో గడపాల్సి వస్తుంది. అటుపై అతని ఖరీదైన ఎముక స్కానర్ దొంగతనానికి గురికావడంతో పాటు ఒక పిచ్చివాడి మూలంగా అది దెబ్బతింటుంది, అయితే చివరకు క్రిస్ దాన్ని చేజిక్కించుకోవడంతో పాటు దానికి మరమత్తు కూడా పూర్తి చేస్తాడు. తన పరిమిత పని గంటల ద్వారా క్రిస్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు క్లెయింట్ల సంబంధాలను పెంచుకోవాలని, తనతో పాటు పోటీపడుతున్న 19 మందిని అధిగమించి జీతం కూడా లభించే హోదాను చేజిక్కించుకోవాలంటే అదొక్కటే మార్గమని గ్రహిస్తాడు, ఇందులో భాగంగా మరింత సమర్థవంతంగా ఫోన్ ద్వారా అమ్మకాలను పెంచే దిశగా క్రిస్ అనేక మార్గాలను అభివృద్ధి చేస్తాడు. ప్రోటోకాల్‌ని ధిక్కరించి మరీ అతను శక్తివంతమైన అధిక విలువ కలిగిన వినియోగదారులను చేరుకుంటాడు. ఒక దయనీయమైన అంశం ఒకటి క్రిస్ మరియు అతని కుమారుడు ప్రొఫెసనల్ ఫుట్‌బాల్ గేమ్‌కి తీసుకెళుతుంది. క్రిస్ యొక్క సవాళ్లతో సంబంధం లేకుండా, అతను తన దుర్భరమైన పరిస్థితుల గురించి తన తోటి పనివారి వద్ద ఎప్పడూ బహిరంగపర్చడు, కనీసం బాస్ యొక్క ఐదు డాలర్లకు ఒక క్యాబ్‌ను అప్పుగా పొందాల్సి వచ్చినప్పుడు కూడా అతను తన పరిస్థితిని వెళ్లడించడు, అది చిన్న మొత్తమే అయినప్పటికీ, దాన్ని భరించగల స్థాయి అతనికి చాలా కొద్దిగా మాత్రమే ఉంటుంది.

ఇంటెర్న్‌షిప్ ముగింపు సమయంలో మేనేజర్లతో సమావేశం కావాల్సిందిగా అతనికి పిలుపొస్తుంది. అయితే, తన అత్యవసర పరిస్థితి కారణంగా అతను ఏమాత్రం చక్కగా లేని దుస్తులతో సమావేశ మందిరానికి వెళ్లినప్పటికీ, ఎట్టకేలకు వారు అతనికి ఉద్యోగాన్ని ఇస్తున్నట్టు చెప్పడంతో క్రిస్ అవస్థలన్నీ తీరిపోతాయి. దీంతో సంతృప్తి నిండిన కన్నీళ్లతోటి అతను తన కొడుకు ఉండే డేకేర్ కేంద్రానికి వెళ్లి కొడుకుని గుండెలకు హత్తుకుంటాడు. అటుపై వారు వీధి వెంట నడుస్తూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటారు, ఈ సందర్భంగా బిజినెస్ సూట్‌లో ఉండే ఒక వ్యక్తి (అతిథి పాత్రలో కనిపించే నిజమైన క్రిస్ గార్డనర్) వారిని దాటుకుని వెళ్తాడు. అటుపై క్రిస్ సొంతంగా మల్టీ మిలియన్ డాలర్ బ్రోకరేజ్ సంస్థను స్థాపించినట్టుగా చూపడంతో కథ ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

 • క్రిస్ గార్డనర్‌గా విల్ స్మిత్
 • క్రిస్టోఫర్ గార్డనర్ జూనియర్‌గా జడెన్ స్మిత్ (జడెన్ క్రిస్టోఫర్‌‌గా శ్రే స్మిత్)
 • లిండా గార్డనర్‌గా తన్డీ న్యూటన్
 • జే ట్విస్టిల్‌గా బ్రిన్ హోవ్
 • అలన్ ఫ్రాకెష్‌గా డాన్ క్యాస్టెలెనేటా
 • మార్టిన్ ఫ్రోమ్‌గా జేమ్స్ కరెన్
 • వాల్టెర్ రిబ్బన్‌గా కర్ట్ ఫుల్లర్
 • టిమ్ రిబ్బన్‌గా డొమెనిక్ బోవ్
 • వరల్డ్స్ గ్రెటెస్ట్ డాడ్‌గా కెవిన్ వెస్ట్
 • మిస్ట్రెస్ చుగా టకయో ఫిచ్చెర్

నిర్మాణం[మార్చు]

ఈ చిత్రం యొక్క అధిక భాగం శాన్ ఫ్రాన్సిస్కోలో చిత్రీకరించబడింది.[1] ఈ చిత్రం కోసం డుబోక్ పార్క్‌లో ఒక నకిలీ BART స్టేషన్‌ని నిర్మించి షూటింగ్ అనంతరం దాన్ని తొలగించారు, [2] అలాగే క్రిస్ అపార్ట్‌మెంట్‌తో సహా ఇతర సెట్ల కోసం ట్రెసర్ దీవిపై భారీ వేదికలను నిర్మించారు. ఈ చిత్రం కోసం స్థానిక సిబ్బంది అనేకమంది పనిచేశారు.

విమర్శకుల ఆదరణ[మార్చు]

ఈ చిత్రం గురించి శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్‌లో మైక్ లసల్ ఈ విధంగా వర్ణించాడు "ఈ చిత్రం యొక్క గొప్ప ఆశ్చర్యం ఉన్నది నాటకీయమైన కథలో కాదు . . . ఈ చిత్రం యొక్క అందమంతా దాని నిజాయితీలో ఉంది. కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఈ చిత్రం సాధారణంగా విజయవంతమైన చిత్రాల్లాంటిది కాదు, అశాభంగంతో నిండిన ఒక నమ్మదగిన విరామం తర్వాత విజయం వెతుక్కూంటూ రావడం అనేది ఈ చిత్రంలోని అద్భుతమైన అంశం. మిగిలిన చిత్రాల్లో కనిపించే రీతిలో కాకుండా, ఈ కథ నిజ జీవితంలో కనిపించే అత్యంత సాధారణ విధానాన్ని అనుసరించింది - కాలక్రమంలో చోటుచేసుకునే క్షోభపెట్టే వైఫల్యాలు మరియు పరాజయాలు, అవకాశాలు కోల్పోవడం, పూర్తిగా జరగని కచ్చితమైన అంశాల వంటి వాటిని ఏకకాలంలో వృద్ధిచెందే బొటాబొటీ విజయాలతో ముడిపెట్టడమన్నది తెలియని ఏదో ఒక అద్భుత భావాన్ని కలిగిస్తుంది. మరో రకంగా చెప్పాలంటే, ఇవన్నీ కూడా నిజమైనవిగా కూడా అనిపిస్తాయి" అని ఆయన రాశారు.[3]

ది న్యూయార్క్ టైమ్స్‌కి చెందిన మనోహ్లా డర్గిస్ ఈ చిత్రం గురించి రాస్తూ, ఈ చిత్రం " వాస్తవికత వైపు లాగే ఒక అద్భుతమైన కథ . . . ఈ చిత్రంలోని వినోదం అత్యంత చక్కగా మీ పొట్టలో స్థిరపడేంత దూరం వరకు చొచ్చుకుపోతుంది . . . ఈ చిత్రం సైతం పాత చిత్రాల్లో వచ్చిన కథ లాంటిదే, అయితే ఒక అమెరికన్ స్వప్నాన్ని కళాత్మకంగా చెప్పడంతో పాటు నైపుణ్యంతో దాన్ని విక్రయించారు. చివర్లో, ఈ చిత్రం అతుకుల్లేని, అలంకారాల్లేని, పారదర్శకమైన, మిస్టర్ స్మిత్ యొక్క నులివెచ్చని భావ వ్యక్తీకరణను కళ్లముందు నిలిపింది . . . ఈ కథ విషయంలో మీరు ఏవిధంగా ప్రతిస్పందిస్తారనేది మిస్టర్ స్మిత్ యొక్క మరియు అతని కుమారుని యొక్క అద్భుతమైన నటనతీరుపై ఆధారపడి ఉండవచ్చు, పేదరికం అనేది దురదృష్టం మరియు చెడ్డ ఎంపికలు వైపు దారితీస్తుందనే మీ ఆలోచనను మీలో కలగజేయడంతో పాటు వీరోచితమైన కృషి మరియు స్వప్నాల యొక్క ఫలితాల్లో విజయం సాధించడమనే వారి ప్రయత్నం మిమ్మల్ని ఆవైపు నడిపిస్తుంది"[4]

రోలింగ్ స్టోన్ యొక్క పీటర్ ట్రావెర్స్ ఈ చిత్రానికి నాలుగు నక్షత్రాలకు గానూ మూడు నక్షత్రాలను కేటాయించడంతో పాటు "విల్ స్మిత్ ఆస్కార్ దిశగా అడుగులు వేశాడు . . . [అతని] పాత్రకు గాంభీర్యం, చురుకుదనం, సమ్మోహపరిచే శక్తి, హాస్యం మరియు కృత్రిమం కాని ఒక ఆత్మ అవసరం. స్మిత్ వాటన్నింటినీ చూపించగలిగాడు. అతను ఆ పాత్రకు నిజంగా న్యాయం చేశాడు" అని వ్యాఖ్యానించారు.[5]

వెరైటీ లో, బ్రైన్ లౌరీ ఈ చిత్రం గురించి పేర్కొంటూ, "ఇది సృజనాత్మకంగా ప్రేరేపించిన దాని కంటే మరింత ఎక్కువ ప్రేరేపితంగా నిలిచింది—వృద్ధిలోకి తీసుకొచ్చే, పాఠశాల తర్వాత-ప్రత్యేక సుగుణాలు లాంటి ఉత్తేజితాలతో ఇది కాస్త ఎక్కువ పంటినొప్పిలా ఉండవచ్చు . . . అయితే, స్మిత్ యొక్క హృదయపూర్వకమైన నటనను సులభంగా ప్రశంసించవచ్చు. అయితే, ఈ చిత్రం యొక్క గంభీరమైన స్వరం, ప్రేక్షకుల యొక్క భాగానికి సంబంధించి దాని అభ్యర్థనను మారుస్తుంది, విరక్తితో కూడిన అనేక TV చిత్రాలను విజయవంతం చేయడంలో ఈ అంశమే అంగీకారంగా మారింది . . . చిత్రం చివర్లో, నిరూపిత సేల్స్‌మెన్ మిస్టర్ గార్డనర్ వ్యవహరించిన తరహాలోనే [అది] ఒక చిన్నపాటిదిగా వదిలివేయబడింది: ఖచ్చితంగా ఇది మూలానికి చేరేందుకు సులభమైన మార్గం, అయితే, సమాయాన్ని దీంతో వెచ్చించేందుకు చాలినంత వినోదం లేదు" అన్నారు.[6]

లాస్ ఏంజెల్స్ టైమ్స్‌కు చెందిన కెవిన్ క్రస్ట్ ప్రకారం, "నాటకీయంగా ఇందులో పైపై పూతగా ఉండాల్సిన క్రామర్ vs. క్రామర్ యొక్క పూత లేకపోయింది . . . కథకు సంబంధించిన విషయం గంభీరమైనదే అయినా, చిత్రం మాత్రం సున్నితంగా, మరియు ఎలాంటి శక్తినైనా ఇవ్వగల నటునిపై ఇది ఆధారపడింది. అత్యంత గంభీరమైన పాత్రలో సైతం, స్మిత్ చాలా ప్రభావాన్ని తీసుకొచ్చే వ్యక్తి, తద్వారా అతను గార్డనర్ యొక్క దురవస్థను చక్కగా ప్రదర్శించాడు . . . ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే చిత్రం నిజానికి అసాధారణ నటనతో నిండిన సాధారణమైన చిత్రం . . . సెలవు రోజులను గడిపేందుకు అనేక కష్టమైన మార్గాలున్నాయి, అయితే, అతిచిన్న మార్గంలో ఈ చిత్రం మీ పరిస్థితులను మీరే అభినందించేలా చేస్తుంది."[7]

సెయింట్. పీటర్స్‌బర్గ్ టైమ్స్‌ లో, స్టీవ్ పెర్సల్ ఈ చిత్రానికి B గ్రేడ్ ఇవ్వడంతో పాటు- "[ఇది] ఒక బాధ్యతతో కూడిన భావం-సెలవు సీజన్‌లో ఒక మంచి చిత్రం మరియు ఇందులోని బాధ్యత కొంచెం గాంభీర్యాన్ని కూడా ఆపాదిస్తుంది . . . ఈ చిత్రంలోని ఓర్చుకునే సామర్థ్యం కలిగిన హీరో ముందు అనేక అడ్డంకులు మరియు పరిష్కారాలు ఉంటాయి, భావాద్వేగాల పరంపర మరియు కాకతాళీయత లాంటివి ఈ చిత్రాన్ని అనుమానంగా భావించేలా చేస్తాయి. . . కాన్‌రాడ్ స్క్రిప్ట్ కానీ, ముకినో అద్వితీయ దర్శకత్వం కానీ [ఏమి] బాగా చదువుకున్న మరియు అత్యంత అనుభవం కలిగిన వ్యక్తులకు మించి నిజ జీవిత క్రిస్‌ను మరింత పైకి తీసుకొచ్చింది, అయితే ఇదంతా ఇద్దరు స్మిత్‌ల యొక్క గంభీరమైన నటన ద్వారా వెలుపలికి వచ్చింది. తండ్రి విల్ అరుదుగా ఈ పరిపక్వతను తెరమీదకు తీసుకొస్తాడు; ఇక చివర్లో ఆస్కార్ అవార్డును సాధించగల స్థాయి నటనను అతను అందుకున్నాడు. చిన్నారి జడెన్ సైతం తండ్రి తరహాలోనే అద్భుత నటనను వెలిబుచ్చాడు, కెమెరాల ముందు అసాధారణ స్థాయిలో రాణించాడు. నిజానికి కాన్‌రాడ్ ఎటువంటి సంఘర్షణతోనూ పరీక్షించనప్పటికీ, వారిద్దరి నిజజీవిత బంధం సైతం తెరమీద సంబంధాన్ని చక్కగా పండించడంలో ఒక వెలకట్టలేని ఆస్తిగా పరిణమించింది" అని వ్యాఖ్యానించారు.[8]

నేషనల్ రివ్యూ ఆన్‌లైన్ తన 'ది బెస్ట్ కన్జర్వేటివ్ ఫిల్మ్స్‌' జాబితాలో ఈ చిత్రానికి #7గా పేరు పెట్టింది. సెంటర్ ఫర్ ఈక్వల్ ఆపర్చునిటీకి చెందిన లిండా ఛావెజ్ సైతం, "ప్రపంచ ఆర్థికం ఏమీ లేకపోయినా దురాశతో నిండినదనే విధంగా చిత్రించే వాల్ స్ట్రీట్ మరియు ఇతర హాలీవుడ్ దూషణలకు ఈ చిత్రం మంచి విరుగుడు లాంటిది" అని పేర్కొన్నారు.[9]

బాక్సాఫీస్[మార్చు]

ఈ చిత్రం మొదటగా #1లోని ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌ వద్ద విడుదలైంది, తొలివారాంతంలో మొత్తం 27 మిలియన్ డాలర్లను ఆర్జించిన ఈ చిత్రం, అప్పట్లో అత్యధికంగా ప్రమోట్ చేయబడిన ఎరాగోన్ మరియు ఛార్లోటెస్ వెబ్ లాంటి చిత్రాలను సైతం అధిగమించింది. ఇది విల్ స్మిత్‌కు సంబంధించిన #1 ఓపెనింగ్ చిత్రాల్లో వరుసగా ఆరవది. US మరియు కెనడాల్లో 162,586,036 డాలర్ల మొత్తాన్ని వసూలు చేసిన ఈ చిత్రం, దాని నిర్మాణ ఖర్చుకు మూడింతల అధిక మొత్తాన్ని సాధించింది, అలాగే ఇతర మార్కెట్లలో ఈ చిత్రం 141,700,000 డాలర్లు సాధించింది, తద్వారా ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ మొత్తంగా 304,286,031 డాలర్లను సాధించింది.

DVD అమ్మకాలు[మార్చు]

మార్చి 27, 2007న ఈ చిత్రం DVD రూపంలో విడుదల కావడంతో పాటు 2007 నవంబర్ నాటికి US రీజియన్ 1 DVD అమ్మకాల రూపంలో 89,923,088 డాలర్లు అదనంగా లభించింది, విడుదలైన మొదటి వారంలో అమ్ముడైన మొత్తంలో సగానికంటే ఇది కొంచెం మాత్రమే తక్కువ.[10] మొత్తం 5,570,577 DVDలు అమ్ముడు కావడం ద్వారా 90,582,602 డాలర్ల ఆదాయం లభించింది.[11]

ప్రశంసలు[మార్చు]

 • అకాడమీ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ (విల్ స్మిత్, నామినీ)
 • గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ - మోషన్ పిక్చర్ డ్రామా (విల్ స్మిత్, నామినీ)
 • గోల్టెన్ గ్లోబ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (సీల్ ద్వారా పదాలు మరియు సంగీతం కూర్చబడిన "ఏ ఫాథర్స్ వే", నామినీ)
 • బ్లాక్ రీల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ (నామినీ)
 • బ్లాక్ రీల్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ మోషన్ పిక్చర్ (విల్ ‌స్మిత్, నామినీ)
 • బ్లాక్ రీల్ అవార్డ్ ఫర్ బెస్ట్ బ్రేక్‌త్రూ పెర్ఫార్మెర్ (జడెన్ స్మిత్, నామినీ)
 • NAACP ఇమేజ్ అవార్డ్ ఫర్ ఔట్‌స్టాండింగ్ మోషన్ పిక్చర్ (విజేత )
 • NAACP ఇమేజ్ అవార్డ్ ఫర్ ఔట్‌స్టాండింగ్ యాక్టర్ ఇన్ ఏ మోషన్ పిక్చర్ (విల్ స్మిత్, నామినీ)
 • NAACP ఇమేజ్ అవార్డ్ ఫర్ ఔట్‌స్టాండింగ్ సపోర్టింగ్ యాక్టర్ ఇన్ ఏ మోషన్ పిక్చర్‌ (జడెన్ స్మిత్, నామినీ)
 • NAACP ఇమేజ్ అవార్డ్ ఫర్ ఔట్‌స్టాండింగ్ సపోర్టింగ్ యాక్టరెస్ ఇన్ ఏ మోషన్ పిక్చర్‌ (తన్డీ న్యూటన్, నామినీ)
 • స్క్రీన్ యాక్టర్స్' గిల్డ్ అవార్డ్ ఫర్ ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ బై ఏ మేల్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ - మోషన్ పిక్చర్‌ (విల్ స్మిత్, నామినీ)
 • MTV మూవీ అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ పెర్ఫార్మెన్స్ (విల్ స్మిత్, నామినీ)
 • MTV మూవీ అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ బ్రేక్‌త్రూ పెర్ఫార్మెన్స్ (జడెన్ స్మిత్, విజేత )
 • టీన్ ఛాయిస్ అవార్డ్స్ ఫర్ ఛాయిస్ మూవీ: బ్రేకౌట్ మేల్ (జడెన్ స్మిత్, విజేత )
 • టీన్ ఛాయిస్ అవార్డ్స్ ఫర్ ఛాయిస్ మూవీ: కెమిస్ట్రీ (జడెన్ స్మిత్ మరియు విల్ స్మిత్, విజేత )
 • బ్రాడ్‌క్యాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ (విల్ స్మిత్, నామినీ)
 • BFCA క్రిటిక్స్' ఛాయిస్ అవార్డ్ ఫర్ బెస్ట్ యంగ్ యాక్టర్ (జడెన్ స్మిత్, నామినీ)
 • BET అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ (విల్ స్మిత్, నామినీ)
 • PFCS అవార్డ్ ఫర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ బై యూత్ ఇన్ ఏ లీడింగ్ ఆర్ సపోర్టింగ్ రోల్ - మేల్ (జడెన్ స్మిత్, విజేత )
 • ఉత్తమ నటుడు కోసం చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ (విల్ స్మిత్, నామినీ)
 • ఇటాలియన్ నేషనల్ సిండికేట్ ఆఫ్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ ఫర్ బెస్ట్ స్కోర్ (ఆండ్రియా గ్యూరా, నామినీ)
 • డేవిడ్ డి డొనాటెలో అవార్డ్స్ ఫర్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీ (గాబ్రియెల్ ముకినో, నామినీ)
 • కాప్రీ అవార్డ్ ఫర్ మూవీ ఆఫ్ ది ఇయర్ (విజేత )

వీటిని కూడా చూడండి[మార్చు]

 • 2006 అమెరికన్ చిత్రాల జాబితా

సూచనలు[మార్చు]

 1. Sanders, Adrienne (2007-02-09), "Bay Area movies still rolling", San Francisco Business Times
 2. Garchik, Leah (2005-09-19), "Leah Garchik column", San Francisco Chronicle
 3. Mick LaSalle, Chronicle Movie Critic (2006-12-15). "''San Francisco Chronicle'' review". Sfgate.com. Retrieved 2011-02-13. Cite web requires |website= (help)
 4. Dargis, Manohla (2006-12-15). "''New York Times'' review". Movies.nytimes.com. Retrieved 2011-02-13. Cite web requires |website= (help)
 5. "రోలింగ్ స్టోన్ రివ్యూ". మూలం నుండి 2009-07-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-03-08. Cite web requires |website= (help)
 6. Lowry, Brian (2006-12-07). "''Variety'' review". Variety.com. మూలం నుండి 2012-12-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-13. Cite web requires |website= (help)
 7. Boucher, Geoff (2011-01-26). "''Los Angeles Times'' review". Calendarlive.com. Retrieved 2011-02-13. Cite web requires |website= (help)
 8. "''St. Petersburg Times'' review". Sptimes.com. Retrieved 2011-02-13. Cite web requires |website= (help)
 9. Miller, John (February 23, 2009), The Best Conservative Movies, National Review Online, మూలం నుండి 2012-02-26 న ఆర్కైవు చేసారు, retrieved August 19, 2009
 10. "''The Pursuit of Happyness'' at TheNumbers.com". The-numbers.com. Retrieved 2011-02-13. Cite web requires |website= (help)
 11. "The Pursuit of Happyness - DVD Sales". The Numbers. Retrieved 2011-02-13. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.