ది రెడ్ రిబ్బన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ది రెడ్ రిబ్బన్ (ఆంగ్లం: The Red Ribbon) ఒక అవగాహన రిబ్బన్‌.[1] ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల సంఘీభావానికి చిహ్నంగా, మాదక ద్రవ్యాల నిరోధం, [2] మద్యం సేవించి వాహనాలు నడపడం గురించి అవగాహన, నివారణ కోసం ఉపయోగిస్తారు.[3] కెనడాలో రెడ్ రిబ్బన్ మల్టిపుల్ స్క్లెరోసిస్ (కండరబలహీనత) ఉన్న కెనడియన్లను సూచిస్తుంది.

2007 డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో భారతీయ రైల్వేలచే HIV/AIDS అవగాహన ప్రచార రైలు రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ని ప్రవేశపెట్టి "జీవిత ప్రయాణాన్ని ప్రారంభించడం" అనే నినాదం జోడించారు.

చరిత్ర[మార్చు]

1991లో AIDS సంక్షోభం ఉచ్ఛస్థితిలో ఒక అర్ధవంతమైన చిహ్నాన్ని రూపొందించడానికి కళాకారుల బృందం కలిసి వచ్చారు. ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారికి, వారి సంరక్షకులకు మద్దతు తెలుపడానికి రెడ్ రిబ్బన్ చిహ్నం రూపోందించారు.

రెడ్ రిబ్బన్ ఇంటర్నేషనల్ అనేది 1993లో స్థాపించబడిన ఒక సంస్థ, దీని ముఖ్య ఉద్దేశం హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV), అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియెన్సీ సిండ్రోమ్ (AIDS) రిలేటెడ్ కాంప్లెక్స్ (ARC) నివారణ గురించి అవగాహన కలిపించడం.

అవగాహన చిహ్నం[మార్చు]

ఈ ఎరుపు రంగు రిబ్బన్ అనేది ప్రపంచవ్యాప్తంగా HIV/AIDSతో నివసించే ప్రజలకు అవగాహన, మద్దతు తెలిపే సార్వత్రిక చిహ్నం. ఎయిడ్స్ కి వ్యతిరేకంగా పోరాటానికి మాత్రమే కాకుండా కెనడాలో మల్టిపుల్ స్క్లెరోసిస్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, బ్రెజిల్‌లోని లాభాపేక్ష లేని సంస్థ ద్వారా డ్రంక్ డ్రైవింగ్ నివారణ, మాదకద్రవ్యాల నివారణ వంటి వాటిపై ప్రజలలో అవగాహన కల్పించడానికి కూడా ఈ చిహ్నం వినియోగిస్తారు. రెడ్ రిబ్బన్ చిహ్నాన్ని ఉపయోగించే సంస్థలకు ఉదాహరణలుగా రెడ్ రిబ్బన్ ఫౌండేషన్, మదర్స్ ఎగైనెస్ట్ డ్రంక్ డ్రైవింగ్ (MADD), కెనడియన్ మల్టిపుల్ స్క్లెరోసిస్ సొసైటీ వంటివి చెప్పుకోవచ్చు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ రిబ్బన్ ధరించడం ఒక గొప్ప మార్గం.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "World AIDS Day - 1 December". Retrieved 2009-02-13.
  2. "Red Ribbon Week". Retrieved 2017-11-23.
  3. "Project Red Ribbon". MADD Canada. Retrieved 2017-11-23.