Jump to content

ది సాక్రిఫైజ్

వికీపీడియా నుండి
The Sacrifice
దర్శకత్వంతార్కి విస్కీ
రచనతార్కి విస్కీ
నిర్మాతఅన్నా-లెనా విబోమ్
తారాగణంఎర్లాండ్ జోసెఫ్సన్
సుసాన్ ఫ్లీట్వుడ్
అలెన్ ఎడ్వాల్
గోర్నున్ గిలాడోట్టిర్
స్వెన్ వోల్టెర్
వలేరీ మాయిరెస్
ఫిలిప్ప ఫ్రాన్జెన్
టామీ కెజెల్విస్ట్
ఛాయాగ్రహణంస్వెన్ నిక్విస్ట్
కూర్పుతార్కి విస్కీ
మైఖల్ లెజ్కిలౌస్కీ
సంగీతంజోహాన్ సెబాస్టియన్ బాచ్
వటజుమిదో - షుసో
పంపిణీదార్లుసాండ్రూ (స్వీడిష్ థియేట్రికల్)
విడుదల తేదీ
9 మే 1986 (1986-05-09)(స్వీడన్)
సినిమా నిడివి
142 నిముషాలు
దేశాలుస్వీడన్
యునైటెడ్ కింగ్‌డమ్
ఫ్రాన్స్
భాషలుస్వీడిష్
ఇంగ్లీష్
ఫ్రెంచ్
బాక్సాఫీసు300,653 డాలర్లు (యు.ఎస్.ఏ)

ది సాక్రిఫైజ్, 1985లో వచ్చిన స్వీడన్ చిత్రం.[1] ప్రముఖ రష్యన్ చిత్ర దర్శకుడు తార్కి విస్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అతని చివరి చిత్రం. మూడో ప్రపంచ యుద్దపు భయానకావర్ణ నేపథ్యంగా ఈ చిత్రం రూపొందించబడింది.

అలెగ్జాండర్ ఒక నటుడు. కళాకారుడిగా ఎంతో ఉన్నత శిఖరాలపై ఉన్న సమయంలోనే కుటుంబ కారణాల వల్ల ఆ వృత్తిని వదిలేస్తాడు. కానీ, తన సృజనలోని వెలితిని పూడ్చుకోడానికి వ్యాస రచయితగా, చరిత్ర అధ్యాపకునిగా పనిచేస్తుంటాడు. తనకు ఆనందం దొరికే విధంగా తనకి నచ్చిన సముద్రతీరాన ఎంతో అందంగా ఒక ఇంటిని కట్టుకుని కుటుంబం తో ఆనందంగా జీవించాలి అనుకుంటాడు. అప్పటికే పెను భారంగా మారిన యాంత్రిక జీవన వైఖరి అతడిని కుంగదీస్తూ ఉంటుంది.

భార్యతో అతడి జీవితం ప్రేమ లేని పొడి పొడి జీవితమవుతుంది. భార్యా పిల్లలతో, ప్రేమరాహిత్యం గుదిబండగా మారి అతన్ని ఇక శూన్య జీవిగా మారుస్తుంది. తాను ప్రాణంగా ప్రేమించే చిన్నకొడుకుతో, భార్యా, కూతురు, డాక్టర్ మిత్రుడితో కలిసి తన పుట్టిన రోజు వేడుకని సముద్రతీరంలోని తన ఇంట్లో ఎంతో ఆనందంగా జరపాలి అనుకుంటాడు. కానీ తనలో ఉన్న తార్కికత, జ్ఞాన భారం అతడిని రోజు రోజుకు భయానికి, ఆందోళనకు గురిచేస్తుంటాయి. దీనికి తోడు యూరోపియన్ సమాజంలో ఉన్న యుద్ద గాయాలు, కొత్త యుద్దం తాలూకు భయాలను రెట్టింపు చేస్తుంటాయి. అణుయుద్దం అనివార్యం అనుకొని కృంగిపోతాడు అలెగ్జాండర్.

జరగబోయే యుద్ద పరిణామాలు విధ్వంసం నుంచి తను ప్రేమించే కుటుంబాన్ని, ప్రపంచాన్ని ఎలా కాపాడుకోవాలో అని తీవ్రమయిన వేదనకు గురయ్యి తన ఇంట్లో పని మనిషి మరియా శరణు వేడుకుంటాడు ఆమెలో వుండే దైవిక కారుణ్య హృదయ శక్తి ముందు మోకరిల్లి తన ప్రేమను తెలుసుకుంటాడు. ఆమె సహచర్యంతో సత్యసౌందర్య ప్రేమ తెలుసుకొని దేవుడితో మొరపెట్టుకుంటాడు.

ఈ ప్రపంచాన్ని.. తనకుటుంబాన్నికాపాడమని.. దానికి ప్రతిగా తనకి ఇష్టమయిన సంపాదనూ, కోర్కెలనూ, జ్ణానన్నీ, సదుపాయాలని, కళాకారుడనిగా తనలో నిరంతరం అగ్నిలాగా వర్షించే తృష్ణనూ.. అన్నింటిని వదులుకుంటానని మొరపెట్టుకుంటాడు. వెంటనే మరుసటి రోజు, తను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటినీ, తన చిన్నకొడుకునీ. భార్యానీ, కూతురిని, మిత్రుడుని వదిలేసి.. మానసికంగా అలిసిపోయి ఆ స్వర్గంలోకి కనుమరుగవుతాడు.

నటవర్గం

[మార్చు]
  • అలెగ్జాండర్ (ఎర్లాండ్ జోసెఫ్సన్)
  • అడిలైడ్గా (సుసాన్ ఫ్లీట్వుడ్)
  • ఒట్టో (అలెన్ ఎడ్వాల్)
  • మరియా (గోర్నున్ గిలాడోట్టిర్)
  • విక్టర్ (స్వెన్ వోల్టెర్)
  • జూలియా (వలేరీ మాయిరెస్)
  • మార్త (ఫిలిప్ప ఫ్రాన్జెన్)
  • గాసేన్ (టామీ కెజెల్విస్ట్)
  • అంబులెన్స్ డ్రైవర్లు (పర్ కల్మాన్, టామీ నార్డిల్)

మూలాలు

[మార్చు]
  1. "The Sacrifice (1986)". Retrieved 22 January 2018.

ఇతర లంకెలు

[మార్చు]