Jump to content

దీపేంద్ర సింగ్ ఐరీ

వికీపీడియా నుండి
దీపేంద్ర సింగ్ ఐరీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2000-01-24) 2000 జనవరి 24 (వయసు: 26)
తిలాచౌర్, మహేంద్రనగర్, కంచన్‌పూర్ జిల్లా
ఎత్తు5 ft 5 in (1.65 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 2)2018 ఆగస్టు 1 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2024 నవంబరు 4 - స్కాట్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.45
తొలి T20I (క్యాప్ 19)2018 జూలై 29 - నెదర్లాండ్స్ తో
చివరి T20I2024 అక్టోబరు 20 - USA తో
T20Iల్లో చొక్కా సంఖ్య.45
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016పంచకన్య తేజ్
2017-2018చిత్వాన్ టైగర్స్
2017-ప్రస్తుతంనేపాల్ పోలీస్ క్లబ్
2022లుంబిని ఆల్ స్టార్స్
2023మాంట్రియల్ టైగర్స్ క్రికెట్ జట్టు
2023గల్ఫ్ జయంట్స్
2024వాంకూవర్ నైట్స్
2024–సుదూర్‌పశ్చిమ్ రాయల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టీ20ఐ ఫక్లా లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 60 74 1 81
చేసిన పరుగులు 948 1,725 1 1,404
బ్యాటింగు సగటు 18.96 34.50 0.50 20.64
100లు/50లు 1/3 1/9 0/0 1/6
అత్యుత్తమ స్కోరు 105 110* 1 105
వేసిన బంతులు 2048 832 6 2,155
వికెట్లు 38 49 0 46
బౌలింగు సగటు 35.78 16.93 32.63
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/18 4/18 4/14
క్యాచ్‌లు/స్టంపింగులు 29/– 35/– 0/– 35/–
మూలం: Cricinfo, 2024 నవంబరు 9

దీపేంద్ర సింగ్ ఐరీ (జ:2000 జనవరి 24) నేపాల్ క్రికెట్ ఆటగాడు.[1][2] 2018 ఆగస్టులో, నెదర్లాండ్స్‌తో జరిగిన నేపాల్ తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆడిన పదకొండు మంది క్రికెటర్లలో ఇతను ఒకడు. [3] చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల సందర్భంగా ఐరీ, మంగోలియాపై కేవలం 9 బంతుల్లోనే T20Iలలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించాడు.[4] 2024 ఏప్రిల్లో, ACC ప్రీమియర్ కప్‌లో ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టి, T20I లలో ఈ ఘనత సాధించిన మూడవ ఆటగాడిగా నిలిచాడు. [5] నేపాల్ అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరిగా పరిగణించబడుతున్న అతను, ICC పురుషుల ప్లేయర్ ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలో రెండవ ఉత్తమ T20I ఆల్ రౌండర్.

కెరీర్

[మార్చు]

గజ్జర్, తిలాచౌర్ గ్రామాల్లోని మైదానాల నుండి ఐరీ, 2017 మార్చి 11 న, 2015–17 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ తరపున లిస్ట్ A ల్లో ఆటగాడిగా ఎదిగాడు.[6] దానికి ముందు అతను, 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం నేపాల్ జట్టుకు ఎంపికయ్యాడు.[7] 2017 ACC అండర్-19 ఆసియా కప్‌లో, అతను నేపాల్ జాతీయ అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. గ్రూప్ A లో భారత్‌పై మ్యాచ్‌లో అతను 88 పరుగులు చేసి, 4/39 వికెట్లు తీసుకుని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [8] అతను 88 పరుగులు చేసి మొత్తం స్కోరును 185/8కి పెంచాడు. భారతదేశం 91/1తో ఉండగా, అతను దాడికి నాయకత్వం వహించి, భారత్‌ను 166 పరుగులకు ఆలౌట్ చేసేందుకు తోఈడ్పడ్డాడు. డిఫెండింగ్ ఛాంపియన్లైన భారత U-19 జట్టుపై ఈ విజయాన్ని నేపాల్ సాధించిన అప్‌సెట్ విజయంగా క్రికెట్ విమర్శకులు కొనియాడారు.[9]

ఐరీ 2018 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ టూ టోర్నమెంట్ కోసం నేపాల్ జట్టులో సభ్యుడు. [10]

2018 జూలైలో, నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ (ODI) సిరీస్ కోసం నేపాల్ జట్టులో ఐరీకి చోటు లభించింది. [11] 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ సమయంలో వన్డే హోదా పొందిన తర్వాత నేపాల్ ఆడుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లు ఇవి.[12] 2018 జూలై 29న నెదర్లాండ్స్‌తో జరిగిన 2018 MCC ట్రై-నేషన్ సిరీస్‌లో తన తొలి ట్వంటీ20 అంతర్జాతీయ (T20I) ఆడాడు. [13] ఆగస్టు 1న నెదర్లాండ్స్‌తోనే జరిగిన మ్యాచ్‌లో నేపాల్ తరపున తొలి వన్డే ఆడాడు.[14]


2018 ఆగస్టులో ఐరీ, 2018 ఆసియా కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం నేపాల్ జట్టుకు ఎంపికయ్యాడు.[15] 2018 అక్టోబరులో, 2018–19 ICC వరల్డ్ ట్వంటీ20 ఆసియా క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం తూర్పు ఉప-ప్రాంత సమూహంలో నేపాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. [16] 2019 జూన్లో, 2018–19 ICC T20 వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫైయర్ టోర్నమెంటు రీజినల్ ఫైనల్స్ కోసం నేపాల్ జట్టులో స్థానం పొందాడు.[17] [18]

2019 నవంబరు 6 న మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) నేపాల్ పర్యటన సందర్భంగా జరిగిన మ్యాచ్‌లో ఐరీ తొలి ఫస్ట్-క్లాస్ ఆట ఆడాడు.[19] [20] అదే నెల చివరిలో, బంగ్లాదేశ్‌లో జరిగిన 2019 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం నేపాల్ జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[21] 2019 దక్షిణాసియా క్రీడల్లో క్రికెట్ టోర్నమెంట్ కోసం నేపాల్ జట్టులో స్థానం పొందాడు.[22] మూడవ స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో మాల్దీవులను ఐదు వికెట్ల తేడాతో ఓడించి నేపాల్, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. [23] 2020 సెప్టెంబరులో, నేపాల్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా కేంద్ర కాంట్రాక్ట్ పొందిన పద్దెనిమిది మంది క్రికెటర్లలో అతను ఒకడు.[24]


2021 డిసెంబరులో, క్రమశిక్షణా సమస్యల కారణంగా ఐరీ, జ్ఞానేంద్ర మల్లాలను వైస్-కెప్టెన్, కెప్టెన్ పదవుల నుండి తొలగించారు. నేపాల్ క్రికెట్ అసోసియేషన్ (CAN) సందీప్ లామిచానేను కొత్త జాతీయ కెప్టెన్‌గా నియమించింది.[25]

2022 మార్చి 26న, పాపువా న్యూ గినియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో ఐరీ, 105 పరుగులు చేసి, వన్‌డేల్లో తన మొదటి సెంచరీని సాధించాడు. [26]

2022 ఏప్రిల్ 2న, ట్రై-సిరీస్ యొక్క చివరి రౌండ్-రాబిన్ మ్యాచ్‌లో ఐరీ, మలేషియాపై 110 నాటౌట్‌తో T20I క్రికెట్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు.[27]

2023 సెప్టెంబరు 27న ఐరీ, T20Iలో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన 50 పరుగుల 16 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2022 ఆసియా క్రీడల్లో మంగోలియాపై కేవలం 9 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టాడు.[28] మ్యాచ్ సమయంలో అతను వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు అయితే, రెండు వేర్వేరు ఓవర్లలో. ఒక ఓవర్‌లోని చివరి ఐదు బంతుల్లో 5 సిక్సర్లు, తదుపరి ఓవర్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికి మరొకటీ కొట్టాడు.

2024 ఏప్రిల్ 13న, ఒమన్‌లో జరిగిన ACC పురుషుల ప్రీమియర్ కప్ 2024లో గ్రూప్ స్టేజ్ గేమ్‌లో ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐరీ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టాడు. 2024 మేలో, అతను 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం నేపాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. [29]

టీ20 ఫ్రాంచైజీ క్రికెట్

[మార్చు]

2023లో, ఐరీ GT20 కెనడాలో మాంట్రియల్ టైగర్స్ తరపున ఆడాడు. మాంట్రియల్ టైగర్స్ సర్రే జాగ్వార్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి తమ మొదటి టైటిల్‌ను గెలుచుకుంది. 2024లో, ఐరీ వాంకోవర్ నైట్స్ తరపున సందీప్ లామిచానే, మొహమ్మద్ అమీర్ వంటి ఇతర స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడాడు.

2024లో, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నిర్వహణలో UAE లో అధికారిక ఫ్రాంచైజ్ లీగ్‌గా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ లీగ్ T20 (ILT20)లో ఒక జట్టు అయిన గల్ఫ్ జెయింట్స్‌తో ఐరీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. జెయింట్స్ రాబోయే 2025 సీజన్ కోసం ఐరీని నిలుపుకుంది. రాబోయే ఎడిషన్ కోసం తన స్థానాన్ని నిలుపుకున్నాడు. అంతర్జాతీయ ఫ్రాంచైజ్ క్రికెట్‌లో అతనికి పెరుగుతున్న గుర్తింపుకు ఇది నిదర్శనం.

మూలాలు

[మార్చు]
  1. "Dipendra Singh Airee". ESPN Cricinfo. Retrieved 11 March 2017.
  2. "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.
  3. "Nepal Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 4 April 2022.
  4. "Nepal smash records with fastest century and fifty in men's T20Is". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
  5. "Nepal's Airee makes history by smashing six sixes in an over". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-11-09.
  6. "ICC World Cricket League Championship, 35th Match: Nepal v Kenya at Kirtipur, Mar 11, 2017". ESPN Cricinfo. Retrieved 11 March 2017.
  7. "All 16 squads confirmed for ICC U19 Cricket World Cup 2016". International Cricket Council. Archived from the original on 28 January 2016. Retrieved 9 January 2016.
  8. "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.
  9. "Nepal Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 4 April 2022.
  10. "Nepali Cricket team announced for Division 2". My Republica. Retrieved 25 January 2018.
  11. "Nepal spinner Shakti Gauchan to retire after Netherlands tour". ESPN Cricinfo. 18 July 2018. Retrieved 18 July 2018.
  12. "Nepal thrash PNG to secure ODI status". International Cricket Council. Retrieved 15 March 2018.
  13. "3rd Match, Nepal tour of England and Netherlands at London, Jul 29 2018". ESPN Cricinfo. Retrieved 29 July 2018.
  14. "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.
  15. "Nepal announce squad for Asia Cup Qualifier, fixtures decided". The Himalayan. 18 August 2018. Retrieved 18 August 2018.
  16. "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.
  17. "Nepal Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 4 April 2022.
  18. "Nepal smash records with fastest century and fifty in men's T20Is". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
  19. "Marylebone Cricket Club tour of Nepal at Kirtipur, Nov 6-8 2019". ESPN Cricinfo. Retrieved 6 November 2019.
  20. "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.
  21. "Nepal Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 4 April 2022.
  22. "Nepal smash records with fastest century and fifty in men's T20Is". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
  23. "Nepal's Airee makes history by smashing six sixes in an over". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-11-09.
  24. "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.
  25. "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.
  26. "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.
  27. "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.
  28. "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.
  29. "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.