Coordinates: 25°55′N 93°44′E / 25.92°N 93.73°E / 25.92; 93.73

దీమాపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీమాపూర్
దీమాపూర్ పట్టణం
దీమాపూర్ పట్టణం
దీమాపూర్ is located in Nagaland
దీమాపూర్
దీమాపూర్
భారతదేశంలోని నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
దీమాపూర్ is located in India
దీమాపూర్
దీమాపూర్
దీమాపూర్ (India)
Coordinates: 25°55′N 93°44′E / 25.92°N 93.73°E / 25.92; 93.73
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
జిల్లాదీమాపూర్
Area
 • నగరం, మున్సిపాలిటీ18.13 km2 (7.00 sq mi)
 • Metro121 km2 (47 sq mi)
Elevation
145 మీ (476 అ.)
Population2,54,674
 • Rank1వ స్థానం (నాగాలాండ్ లో)
 • Density2,558/km2 (6,630/sq mi)
భాషలు
 • అధికారికఇంగ్లీష్, నాగమీస్
Time zoneUTC+05:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
797 112, 797103, 797113, 797115, 797116
టెలిఫోన్ కోడ్91 - (0) 03862
Vehicle registrationఎన్ఎల్ - 07

దీమాపూర్, నాగాలాండ్ రాష్ట్రంలోని దీమాపూర్ జిల్లా ముఖ్య నగరం. ఇది నాగాలాండ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా, అత్యధిక జనసాంద్రత కలిగిన నగరంగా గుర్తింపుపొందింది. ఈ నగరం నాగాలాండ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది. ఈ దిమాపూర్ నగరం ధన్సిరి నది ఒడ్డున అసోం సరిహద్దుకు సమీపంలోని కొండ ప్రాంతంలో ఉంది. ఇక్కడ రాష్ట్రంలోనే ఏకైక రైల్వే స్టేషను, విమానాశ్రయం కూడా ఉన్నాయి.

పద వివరణ[మార్చు]

దీమాపూర్ (పెద్ద నది కలిగిన నగరం) పదం, కచారి భాష నుండి వచ్చింది. దీ అంటే "నీరు", మా అంటే "పెద్దది", పూర్ (సంస్కృత పదం) అంటే "నగరం" అని అర్థం.

భౌగోళికం[మార్చు]

దీమాపూర్ నగరం నాగాలాండ్ రాష్ట్ర నైరుతి దిశలో ఉంది. ఈ నగరానికి తూర్పున బ్రహ్మపుత్రా నది ఉపనది అయిన ధన్సిరి నది ప్రవహిస్తోంది.

వాతావరణం[మార్చు]

దీమాపూర్ నగరంలో వేసవికాలంలో వేడిగా, తేమగా ఉంటుంది. శీతాకాలంలో మధ్యస్తంగా చల్లగా ఉంటుంది.[4]

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, నగరంలో 1,22,834 జనాభా ఉంది. ఈ జనాభాలో 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. నగర సగటు అక్షరాస్యత 86% ఉండగా, ఇందులో పురుషుల అక్షరాస్యత 88% కాగా, స్త్రీల అక్షరాస్యత 84% గా ఉంది. మొత్తం జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నారు.

ఈ నగర జనాభాలో 50% మంది నాగా తెగకు చెందిన ప్రజలు ఉన్నారు. బెంగాలీ, అస్సామీ, ఒరియా, నేపాలీ, బిహారీ, మీటీ, కచారీ, కుకి, మార్వాడీ, పంజాబీ, తమిళ, తెలుగు, కేరళ ప్రజలు ఉన్నారు. గత 20 ఏళ్ళలో టిబెట్ వ్యాపారులు కూడా ఇక్కడ స్థిరపడ్డారు.

మతం[మార్చు]

దీమాపూర్‌ నగర జనాభాలో 54% మంది క్రైస్తవులు, 45% మంది హిందువులు, 0.7% మంది ముస్లింలు, 0.3% మంది జైనులు ఉన్నారు.[3]

పర్యాటక[మార్చు]

మత, చారిత్రక ప్రదేశాలు[మార్చు]

 • కచారీ రాజ్‌బారి శిధిలాలు
రాజ్‌బరి శిధిలాలు

18వ శతాబ్దంలో అహోం రాజుతో విభేదాలు వచ్చి, కోటలో సగం ఆక్రమించిన్న తరువాత ఇది ఇప్పటికీ జాతీయ వారసత్వ ప్రదేశంగా నిలుస్తూ, నాగాలాండ్ రాష్ట్ర గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను సూచిస్తోంది.

 • డిమాపూర్ జైన దేవాలయం

1947లో ఈ జైన ఆలయాన్ని నిర్మించారు. దీమాపూర్ ప్రజలు ఈ ఆలయాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. సుబ్కరన్ సేథి, ఫుల్‌చంద్ సేథి, జెత్మల్ సేథి, ఉదయరామ్ చబ్రా, చున్నిలాల్ కిషన్లాల్ సేథి, కన్హయ్యల్ సేథి, ఇతర జైన కుటుంబాల కృషితో ఈ ఆలయం నిర్మించబడింది.

పార్కులు, ఇతర ప్రదేశాలు[మార్చు]

ఈ నగరంలో గ్రీన్ పార్కు, ఆక్వా మెలో పార్కు, జూలాజికల్ గార్డెన్, సైన్స్ సెంటర్, స్టోన్ పార్కు, హాజీ పార్కు, అగ్రి ఎక్స్‌పో సైట్, రంగపాహర్ ఫారెస్ట్, ట్రిపుల్ ఫాల్స్, శివ మందిరం, లోయిన్‌లూమ్ ఫెస్టివల్, కాళి దేవాలయం వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి.[5]

రవాణా[మార్చు]

రహదారులు[మార్చు]

దీమాపూర్ మీదుగా వెళ్లే రహదారులు[మార్చు]

 • ఆసియా హైవే 1
 • ఆసియా హైవే 2
 • జాతీయ రహదారి 29
 • జాతీయ రహదారి 129
 • జాతీయ రహదారి 129ఏ

విమానాశ్రయం[మార్చు]

దీమాపూర్ విమానాశ్రయం

ఇక్కడ దీమాపూర్ విమానాశ్రయం ఉంది. ఇది రాష్ట్రంలోని ఏకైక సివిల్ విమానాశ్రయం. ఇక్కడినుండి కోల్‌కతా, గువహాటి, ఇంఫాల్,[6] డిబ్రూగర్ నగరాలకు విమాన సర్వీసులు ఉన్నాయి. ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా విస్తరించే ప్రణాళికల్లో భాగంగా అయోయిమ్తి గ్రామంలో భూమిని కొనుగోలు చేశారు.

రైల్వేమార్గం[మార్చు]

నాగాలాండ్‌ రాష్ట్ర్రంలో రైలుమార్గం, వాయు మార్గాలు ఉన్న ఏకైక నగరం ఇది. దీమాపూర్ రైల్వే స్టేషను నుండి గువహాటి, కోల్‌కాతా, క్రొత్త ఢిల్లీ జిల్లా, బెంగుళూరు, చండీగఢ్, అమృత్‌సర్, డిబ్రూగర్, చెన్నై మొదలైన నగరాలకు రైలు సౌకర్యం ఉంది. ఈశాన్య సరిహద్దు రైల్వేలోని లమ్డింగ్ రైల్వే డివిజన్ పరిధిలోని లమ్డింగ్-డిబ్రూగర్ విభాగంలో ఈ రైల్వే స్టేషను ఉంది.

మూలాలు[మార్చు]

 1. "Dimapur City".
 2. "Dimapur Info".
 3. 3.0 3.1 "Dimapur City Population Census 2011 | Nagaland". www.census2011.co.in.
 4. "February Climate History for Dimapur". myweather2.com. Retrieved 6 January 2021.
 5. "Dimapur Places to Visit". holidayiq.com. Archived from the original on 22 సెప్టెంబరు 2018. Retrieved 6 January 2021.
 6. "Alliance Air confirms plans to commence Guwahati-Dimapur-Imphal service in Dec-2019". CAPA. Retrieved 6 January 2021.

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దీమాపూర్&oldid=3946629" నుండి వెలికితీశారు