దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి
ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2025 నవంబరు 19, 17:53 (UTC) (57 రోజుల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
| దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి | |
|---|---|
| ఇతర పేర్లు | దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ ఊపిరితిత్తుల వ్యాధి (COLD),
దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ ఎయిర్‌వే వ్యాధి (COAD), దీర్ఘకాలిక బ్రోన్కైటిస్, ఎంఫిసెమా, పల్మనరీ ఎంఫిసెమా, COPD |
| ఊపిరితిత్తులలో ధూమపానం వలన ఏర్పడే లక్షణాన్ని చూపిస్తుంది. నల్ల కార్బన్ నిక్షేపాలతో నిండిన బహుళ కుహరాలను చూపిస్తుంది. | |
| ప్రత్యేకత | పల్మనాలజి |
| లక్షణాలు | శ్వాస ఆడకపోవడం, దగ్గు, కఫం |
| సంక్లిష్టతలు | దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి లక్షణాలు తీవ్రతరం అవడం |
| సాధారణ ప్రారంభం | 40 సంవత్సరాల పైన |
| కాల వ్యవధి | దీర్ఘ కాలం |
| కారణాలు | పొగాకు ధూమపానం, వాయు కాలుష్యం, జన్యుశాస్త్రం |
| రోగనిర్ధారణ పద్ధతి | పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ (ఊపిరితిత్తుల ఫంక్షన్ టెస్ట్) |
| భేదాత్మక రోగనిర్థారణ పద్ధతి | ఉబ్బసం |
| నివారణ | భవనం లోపల, వెలుపల గాలి నాణ్యత మెరుగు పరచడం, పొగాకు నియంత్రణ |
| చికిత్స | ధూమపానం మానేయడం, శ్వాసకోశ పునరావాసం, ఊపిరితిత్తుల మార్పిడి |
| ఔషధం | టీకాలు, పీల్చే బ్రోంకోడైలేటర్లు, పీల్చే కార్టికోస్టెరాయిడ్, దీర్ఘకాలిక ఆక్సిజన్ థెరపీ |
| తరుచుదనము | 174.5 మిలియన్ (2015) |
| మరణాలు | 3.2 మిలియన్లు (2019) |
దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి (COPD) అంటే దీర్ఘకాలిక శ్వాస సమస్యలు, తక్కువ గాలి సరఫరా ఉండే ఒక రకమైన శ్వాస ప్రతిబంధక ఊపిరితిత్తుల వ్యాధి.
లక్షణాలు
[మార్చు]ఈ వ్యాధిలో ప్రధాన లక్షణాలు కఫం ఉత్పత్తి శ్వాస ఆడకపోవడం, దగ్గు ఉంటాయి[1] COPD అనేది ఒక పెరుగుతూ ఉండే వ్యాధి, లక్షణాలు సాధారణంగా కాలక్రమేణా మరింత తీవ్రతరమవుతాయి.[2] చివరికి, నడవడం లేదా దుస్తులు ధరించడం వంటి రోజువారీ కార్యకలాపాలు కష్టమవుతాయి.[3] దీర్ఘకాలిక బ్రోన్కైటిస్, ఎంఫిసెమా అనే వివిధ రకాల COPDలకు ఉపయోగించే పాత పదాలు.[4][5][6] రెండు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కనీసం మూడు నెలలు దగ్గు ఉంటే "దీర్ఘకాలిక బ్రోన్కైటిస్" అనే పదం ఉపయోగిస్తారు.[1] అటువంటి దగ్గు ఉన్నవారికి సి.ఓ.పి.డి. అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.[7] "ఎంఫిసెమా" అనే పదాన్ని కణజాలాలలో గాలి లేదా ఇతర వాయువు అసాధారణ ఉనికి సూచించడానికి ఉపయోగిస్తారు.[8]
కారణాలు
[మార్చు]పొగాకు ధూమపానం అత్యంత సాధారణ కారణం. అయితే వాయు కాలుష్యం, వారసత్వం వంటి కారణాలు కూడా తక్కువ సంఖ్యలో ఈ వ్యాధి కలుగచేస్తాయి. అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో వాయు కాలుష్యానికి సాధారణ కారణాలు గాలి, పొగ పోయే మార్గం లేని వంటగదిలో వంట చేయడం వంటివి కూడా.[3] ఈ చికాకులను దీర్ఘకాలికంగా ఈ కాలుష్యానికి గురి అవడము వల్ల ఊపిరితిత్తులలో ఏర్పడ్డ ప్రతిస్పందన, ఫలితంగా చిన్న వాయు(మార్గాలు) నాళాలు సన్నబడతాయి, ఊపిరితిత్తు కణజాలం విచ్ఛిన్నమవుతుంది.
ఊపిరితిత్తుల పనితీరు పరీక్షల ద్వారా కొలుస్తారు. గాలి ప్రసారం కొలత ద్వారా రోగ నిర్ధారణ ఉంటుంది. ఉబ్బసం వ్యాధిలో వలె బ్రోన్కోడిలేటర్ వాడకంతో గాలి ప్రవాహం తగ్గింపు పెద్దగా మెరుగుపడదు.[3][9]
చికిత్స
[మార్చు]వ్యాధి కారకాలకు దూరంగా ఉండడం ద్వారా చాలా వరకు వ్యాధి నివారించవచ్చు.[10] ఇందులో ధూమపానం చేయకపోవడం, భవనం లోపల వెలుపల గాలి నాణ్యతను మెరుగుపరచడం వంటివి చాలా ముఖ్యం. చికిత్స వలన వ్యాధి లక్షణాలు తీవ్రత తగ్గుతుంది కానీ నివారణ తెలియదు.[3] చికిత్సలో ధూమపానం మానడం, టీకాలు వేయడం, శ్వాసకోశ పునరావాసం ఉన్నాయి.[11][12] మొదట్లో బ్రోన్కోడిలేటర్ సాధారణంగా LAMA, అవసరమైతే LABA లు పీల్చే స్టెరాయిడ్లను జోడిస్తారు.[12] కొంతమందికి దీర్ఘకాలికంగా ఆక్సిజన్ చికిత్స లేదా ఊపిరితిత్తుల మార్పిడి ప్రయోజనం కలుగవచ్చు.[13] లక్షణాలు తీవ్రతరం అయినప్పుడు, మందులు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, వైద్యశాలలో చేరడం వంటివి అవసరమవుతాయి.[11][14]
వ్యాప్తి
[మార్చు]COPD 2015 నాటికి సుమారు 174.5 మిలియన్ల మందిని ప్రభావితం చేసింది (ప్రపంచ జనాభాలో 12%). అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఇది 6% మంది ప్రజలను ప్రభావితం చేసింది. సాధారణంగా ఈ వ్యాధి 40 ఏళ్లు పైబడిన వారిలో సంభవిస్తుంది. సాధారణంగా పురుషులు, స్త్రీలు కూడా సమానంగా ప్రభావితమవుతారు.[3] 2015 లో, ఇది 32 లక్షల మంది మరణాలకు కారణమైంది, అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో 90% కంటే ఎక్కువ మంది ఈ వ్యాధికి గురి అయ్యారు.1990 లో 24 లక్షల మరణాలు ఈ వ్యాధి వలెనే సంభవించాయి.[3] అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక ధూమపానం, అనేక దేశాలలో వృద్ధుల జనాభా కారణంగా మరణాల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. దీని ఫలితంగా 2010లో US $2.1 ట్రిలియన్ల ఆర్థిక వ్యయం ఉంటుందని అంచనా వేసారు.[15]
సూచనలు
[మార్చు]- ↑ 1.0 1.1 Vogelmeier CF, Criner GJ, Martinez FJ, Anzueto A, Barnes PJ, Bourbeau J, et al. (April 2017). "Global Strategy for the Diagnosis, Management and Prevention of Chronic Obstructive Lung Disease 2017 Report: GOLD Executive Summary". Respirology. 22 (3): 575–601. doi:10.1111/resp.13012. PMID 28150362. S2CID 42027653.
- ↑ Vestbo, Jørgen (2013). "Definition and Overview". Global Strategy for the Diagnosis, Management, and Prevention of Chronic Obstructive Pulmonary Disease. Vol. 187. Global Initiative for Chronic Obstructive Lung Disease. pp. 1–7. doi:10.1164/rccm.201204-0596PP. PMID 22878278. Archived from the original on 2013-03-02. Retrieved 2020-07-12.
{{cite book}}:|work=ignored (help) - ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "Chronic obstructive pulmonary disease (COPD) Fact sheet N°315". WHO. January 2015. Archived from the original on 4 March 2016. Retrieved 4 March 2016.
- ↑ "Chronic obstructive pulmonary disease (COPD)". WHO. Archived from the original on 21 April 2020. Retrieved 6 June 2019.
The more familiar terms of "chronic bronchitis" and "emphysema" have often been used as labels for this condition.
- ↑ Craig, John A. (2012). Ferri's netter patient advisor (2nd ed.). Saunders. p. 913. ISBN 9781455728268. Archived from the original on 2020-12-25. Retrieved 2020-07-12.
Traditionally, two types of COPD were known as chronic bronchitis and emphysema. Most cases of COPD are a mixture of both diseases.
- ↑ "Chronic obstructive pulmonary disease (COPD)". WHO. Archived from the original on 18 April 2019. Retrieved 5 June 2019.
Chronic Obstructive Pulmonary Disease (COPD) is not one single disease but an umbrella term used to describe chronic lung diseases that cause limitations in lung airflow. The more familiar terms 'chronic bronchitis' and 'emphysema' are no longer used, but are now included within the COPD diagnosis.
- ↑ Global Initiative for Chronic Obstructive Lung Disease (PDF). 2019. p. 13. Archived from the original (PDF) on 30 April 2020. Retrieved 1 May 2019.
- ↑ Taylor, Jayne (2019). Bailliere's Dictionary E-Book: for Nurses and Health Care Workers. Elsevier Health Sciences. p. 128. ISBN 9780702075643. Archived from the original on 2020-07-29. Retrieved 2020-07-12.
- ↑ "Asthma vs. COPD: What's the Difference?". WebMD. 2019-01-30. Archived from the original on 2019-12-26. Retrieved 2019-12-26.
- ↑ (July 2012). "Smoking cessation and environmental hygiene".
- ↑ 11.0 11.1 (April 2012). "Chronic obstructive pulmonary disease".
- ↑ 12.0 12.1 (June 2023). "Chronic Obstructive Pulmonary Disease: Diagnosis and Management.".
- ↑ (September 2007). "Global strategy for the diagnosis, management, and prevention of chronic obstructive pulmonary disease: GOLD executive summary".
- ↑ (25 February 2020). "Pharmacologic Therapies in Patients With Exacerbation of Chronic Obstructive Pulmonary Disease".
- ↑ Lomborg, Bjørn (2013). Global problems, local solutions : costs and benefits. Cambridge University Press. p. 143. ISBN 978-1-107-03959-9. Archived from the original on 2016-05-17. Retrieved 2020-07-12.