దీవకొండ దామోదర్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీవకొండ దామోదర్‌ రావు
దీవకొండ దామోదర్ రావు

దీవకొండ దామోదర్‌ రావు


రాజ్యసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022 జూన్ 22 - 2028 జూన్ 21

వ్యక్తిగత వివరాలు

జననం ఏప్రిల్ 1, 1958
మద్నూర్, బుగ్గారం మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు నారాయణరావు [1]
నివాసం హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం

దీవకొండ దామోదర్‌ రావు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక వ్యవస్థాపకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు.[2]

జననం - కుటుంబం[మార్చు]

దామోదర్‌ రావు జగిత్యాల జిల్లా, బుగ్గారం మండలం, మద్నూర్ లో 1958, ఏప్రిల్ 1న జన్మించాడు. భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.[3]

తెలంగాణ ఉద్యమం[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరిగిన తెలంగాణ మలిదశ, తుదిదశ ఉద్యమాల్లో పాల్గొన్నాడు.[4]

రాజకీయరంగం[మార్చు]

2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభమైన నాటినుంటి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన దామోదర్ రావు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీ-ఫైనాన్స్‌గా వ్యవహరించాడు. ఆయనను 2022 మే 18న టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్య‌స‌భ సభ్యుడిగా ఖరారు చేసింది.[5]

ఇతర వివరాలు[మార్చు]

  1. తెలంగాణ పబ్లికేషన్స్‌ను స్థాపించి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలకు, టీ న్యూస్ ఛానల్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
  2. 2019, సెప్టెంబరు 18న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమించబడ్డాడు.[6]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (2 September 2021). "నమస్తే తెలంగాణ సీఎండీకి పితృవియోగం". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
  2. టీ న్యూస్, తెలంగాణ (19 September 2019). "టీటీడీ బోర్డులో తెలంగాణకు పెద్దపీట". Tnews. Retrieved 2 February 2020.[permanent dead link]
  3. Andhra Jyothy (19 May 2022). "రాజ్యసభకు దామోదర్‌రావు" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  4. Telangana Today, Telangana (18 September 2019). "TTD board reconstituted, TPPL C&MD Damodar Rao nominated to board". Archived from the original on 2 February 2020. Retrieved 2 February 2020.
  5. Namasthe Telangana (18 May 2022). "టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు వీరే." Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
  6. ఆంధ్రజ్యోతి, అమరావతి (17 September 2019). "టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు". Archived from the original on 2 February 2020. Retrieved 2 February 2020.