దుగ్గిరాల వెంకట్రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దుగ్గిరాల వెంకట్రావు కరీంనగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసన సభ్యుడు.

నేపధ్యము[మార్చు]

ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌కు చెందిన దుగ్గిరాల వెంకట్రావు మొదటి నుంచి స్వతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. సొషలిస్టు భావాలు కల్గిన ఆయన ప్రజల పక్షాన నిలిచి అనేక పోరాటాలు చేశారు. 1978లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1985లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర కర్షక పరిషత్ ఛైర్మన్ పదవిని చేపట్టారు. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన వెంకట్రావును చివరకు 1991లో నక్సల్స్ తూటాలకు బలయ్యాడు.

బయటి లంకెలు[మార్చు]