దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు(మే 30, 1969 - ) ప్రసిద్ధ రాజకీయ నాయకుడు. మంథని నియోజకవర్గం నుంచి 1999 నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవులు చేపట్టారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

శ్రీధర్‌బాబు మార్చి 9, 1969లో జన్మించారు. ఆయన ప్రముఖ కాంగ్రెస్‌నేత, శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు, జయమ్మల మూడవ కుమారునిగా జన్మించారు. ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1999లో తండ్రి హత్య జరగడంతో ఆయన రాజకీయ వారసునిగా రాజకీయాల్లో అడుగుపెట్టి కొనసాగుతున్నారు. శ్రీధర్‌బాబు శైలజ రమ్యర్‌ను వివాహం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హాండీక్రాఫ్ట్స్ దేవ్ కార్పొరేషన్ లిమిటెడ్కు ఆమె వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

రాజకీయ రంగంలో[మార్చు]

రాజకీయ వారసత్వం[మార్చు]

దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ఆయన తండ్రి దుద్దిళ్ళ శ్రీపాదరావు రాజకీయ వారసునిగా రాజకీయాల్లోకి వచ్చారు.

శాసన సభ్యునిగా[మార్చు]

దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావును 1999లో మావోయిస్ట్ నక్సలైట్లు కాల్చిచంపారు. ఆయన రాజకీయ వారసునిగా శ్రీధర్‌బాబు 1999 శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేశారు. శ్రీపాదరావు మరణానంతరం ఏర్పడిన సానుభూతి పవనాల్లో రాజకీయవారసునిగా రంగప్రవేశం చేసిన ఆయన కుమారుడు శ్రీధర్‌బాబు ఘనవిజయం సాధించారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీధర్ బాబు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కల్వసోమాపుర సత్యనారాయణపై 42560 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.