దుర్గం చిన్నయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుర్గం చిన్నయ్య
దుర్గం చిన్నయ్య

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2014 - 2018, 2018 - ఇప్పటి వరకు
నియోజకవర్గము బెల్లంపల్లి, తెలంగాణ

వ్యక్తిగత వివరాలు

జననం మే 31
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి జయతార
సంతానము విహారిక, నిహారిక
నివాసము బెల్లంపల్లి, తెలంగాణ
మతం హిందూమతము

దుర్గం చిన్నయ్య తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడు.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

దుర్గయ్య 1974, మే 17న రాజాం, మల్లక్క దంపతులకు మంచిర్యాల జిల్లా, నెన్నెల్‌ మండలం, జండావెంకటాపూర్ గ్రామంలో జన్మించాడు. ఈయన వృత్తి వ్యవసాయం. బి.ఏ వరకు చదువుకున్నాడు.

వివాహం - పిల్లలు[మార్చు]

చిన్నయ్యకు జయతారతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు (విహారిక, నిహారిక).

రాజకీయ విశేషాలు[మార్చు]

1995లో రాజకీయాల్లోకి వచ్చిన చిన్నయ్య, తెలుగుదేశం పార్టీ నుండి నెన్నెల్ జడ్పిటీసీగా, 2001లో ఎంపీపీగా, 2014లో ఎంపీటీసీగా గెలిచాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ పై 11,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2] 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సిపిఐ పార్టీ అభ్యర్థి గుండా మల్లేష్ పై 52,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3]

మూలాలు[మార్చు]

  1. దుర్గం చిన్నయ్య. "Durgam chinnaiah". myneta.info. Retrieved 30 April 2019.
  2. దుర్గం చిన్నయ్య. "Durgam Chinnaiah Biography". beinglegends.com. Retrieved 30 April 2019. Text "Bellampalli MLA" ignored (help)[permanent dead link]
  3. దుర్గం చిన్నయ్య. "Durgam Chinnaiah". nocorruption.in. Retrieved 30 April 2019.