దుర్గా వాహిని
దుర్గా వాహిని విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) లోని మహిళా విభాగం. దీని వ్యవస్థాపక చైర్‌పర్సన్ సాధ్వీ రితంబారా .
స్థాపన
[మార్చు]ఇది 1991 లో స్థాపించబడింది. ఎక్కువ మంది మహిళలను ప్రార్థన సమావేశాలలో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రోత్సహించడమే విశ్వ హిందూ పరిషత్, దుర్గా వాహినిల ఉద్దేశ్యం.[1] [2] దుర్గా వాహిని సభ్యులు తమను తాము శారీరక, మానసిక, జ్ఞాన వికాసానికి అంకితం చేసుకుంటున్నారని సంస్థ సీనియర్ నాయకుడు కల్పన వ్యాష్ అన్నారు. సామాజిక సేవలను అందించడం ద్వారా హిందూ సంఘీభావం నెలకొల్పడం సంస్థ లక్ష్యం. 2002 నాటికి ఈ సంస్థ మొత్తం సభ్యత్వం 8,000గా ఉంది.[2]
కార్యకలాపాలు, భావజాలం
[మార్చు]ఇది బజరంగ్ దళ్ లోని స్త్రీ ముఖంగా పనిచేస్తుంది. ఈ సంస్థ లోని సభ్యులు సైద్ధాంతిక విద్యను పొందుతారు. చాలా శారీరక బలం అవసరమయ్యే పనులను నిర్వహించడానికి ఈ సంస్థ ముఖ్యంగా యువతులకు శిక్షణను అందిస్తుంది.[2] [3]
జూలై 2017 లో, దుర్గా వాహిని జమ్మూ కాశ్మీర్‌లో ఆత్మరక్షణ కోసం శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో రాష్ట్రంలోని 17 సరిహద్దు పట్టణాలకు చెందిన బాలికలు పాల్గొన్నారు.[4]
బాహ్య లింకులు
[మార్చు]- Durga Vahini Archived 2014-06-25 at the Wayback Machine, Vishva Hindu Parishad website
మూలాలు
[మార్చు]- ↑ Patricia Jeffery, Amrita Basu (1997). Appropriating Gender: Women's Activism and Politicized Religion in South Asia. Routledge. p. 168. ISBN 0-415-91866-9.
- ↑ 2.0 2.1 2.2 "Women 'Ram Bhakt' hog limelight". The Tribune. 2002-04-11. Retrieved 2008-06-29.
- ↑ Bob Pease, Keith Pringle (2001). A Man's World?: Changing Men's Practices in a Globalized World. Zed Books. p. 226. ISBN 1-85649-912-X.
- ↑ http://www.indiatimes.com/news/india/j-k-girls-turn-up-in-huge-numbers-at-durga-vahini-training-camp-for-self-defence-exercise-325387.html