దుర్గ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుర్గ్ జిల్లా
दुर्ग जिला
ఛత్తీస్‌గఢ్ పటంలో దుర్గ్ జిల్లా స్థానం
ఛత్తీస్‌గఢ్ పటంలో దుర్గ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
ముఖ్య పట్టణందుర్గ్
Area
 • మొత్తం8,535 km2 (3,295 sq mi)
Population
 (2011)
 • మొత్తం33,43,872
 • Density390/km2 (1,000/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత75.62 %
 • లింగ నిష్పత్తి982
Websiteఅధికారిక జాలస్థలి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో దుర్గ్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా దుర్గ్ పట్టణం ఉంది. 2000లో ఈ జిల్లా ఏర్పాటు చేయబడే వరకు ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉంటూ వచ్చింది. జిల్లా వైశాల్యం 8,537. 1991లో ఈ ప్రాంతం జనసంఖ్య 2, 397,134. అందులో 12.4% షెడ్యూల్డ్ తెగల ప్రజలు ఉన్నారు. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాలలో రెండవ స్థానంలో ఉన్నట్లు దుర్గ్ గుర్తింపు పొందింది. రాయ్‌పూర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది.[1] జిల్లాలో పలు అధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి:

 • జల్మాలా వద్ద ప్రముఖ హిందూ ఆలయం గంగామాయ ఆలయం ఉంది.
 • దుర్గ్ సమీపంలో నాగ్పురా వద్ద " వసగ్గాహరం పర్ష్వతీర్ధ్" అనే ప్రముఖ జైనతీర్ధం ఉంది. దేశం నలుమూలల నుండి ఇక్కడకు భక్తులు వస్తుంటారు.
 • భిలాయ్ టౌన్లో " భిలాయ్ స్టీల్ " అనే ప్రముఖ స్టీల్ కంపనీ ఉంది.
దుర్గ్ జిల్లాలో వ్యవసాయం

భౌగోళికం[మార్చు]

నగరాలు, దుర్గ్ లో టౌన్[మార్చు]

 • దుర్గ్
 • భిలాయి
 • బాలోడ్
 • గుండర్దేహి
 • దల్లి రాఝర
 • జమూల్
 • కుంహరి

నగర్ పంచాయతీ[మార్చు]

 • సజా (ఛత్తీస్గఢ్)
 • బెర్ల
 • పార్పొడి
 • దేఒకర్
 • దంద
 • పటాన్ (ఛత్తీస్గఢ్)
 • గుండర్దేహి
 • గురూర్
 • డొంది
 • దొండిలోహర
 • అర్జుండ
 • బాలోడ్
 • ఉతై (ఛత్తీస్గఢ్)

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,343,079, [1]
ఇది దాదాపు. ఉరుగుయే దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 100వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 391 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.95%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 988:1000[1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 79.69%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు[మార్చు]

జిల్లాలోని వర్నాక్యులర్ ప్రజలు భరియా (ద్రావిడ భాషలలో ఒకటి) ను భారియా, షెడ్యూల్డ్ తెగలకు చెందిన 2,00,000 మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఈ భాషను వ్రాయడానికి దేవనాగరి లిపిని ఉపయోగిస్తున్నారు.[4]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Uruguay 3,308,535 July 2011 est.
 3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Connecticut 3,574,097
 4. M. Paul Lewis, ed. (2009). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

వెలుపలి లింకులు[మార్చు]


మూస:Chhattisgarh-geo-stub