దువ్వాడ జగన్నాథం
దువ్వాడ జగన్నాధం 2016 తెలుగు సినిమా. 2016 ఆగస్టు షూటింగ్ ప్రారంభం.[1] విడుదల తేదీ 2017 సమ్మర్.[2][3]
కథ
[మార్చు]డిజె దువ్వాడ జగన్నాథమ్(అల్లు అర్జున్) విజయవాడలోని బ్రాహ్మణుడు. ధర్మో రక్షితి రక్షితః అనే సూత్రాన్ని నమ్మేవాడు. అన్యాయం చేసేవాళ్ళను చంపేయాలనుకునే రకం. జగన్నాథమ్‌కు ఎఫ్.ఐ.ఆర్ రాసే పోలీస్ ఆఫీసర్(మురళీశర్మ)తో సహా కొంత మంది సహకారం అందిస్తూ ఉంటారు. హైదరాబాద్‌లో డి.జెగా ఉంటూ అన్యాయం చేసిన వారిని చంపేస్తుంటాడు, విజయవాడలో అన్నపూర్ణ క్యాటరింగ్ సర్వీస్ నడుపుతుంటాడు. జగన్నాథమ్ స్నేహితుడు విఘ్నేశ్వర శాస్త్రి పెళ్ళిలో పూజ(పూజా హెగ్డే)ను కలుస్తాడు. పూజను ప్రేమిస్తాడు కూడా. కథ ఇలా సాగుతుండగా జగన్నాథమ్ మావయ్య(చంద్రమోహన్) అగ్రో డైమండ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ చేసే పని వల్ల ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో జగన్నాథమ్ డిజెగా కంపెనీ గురించి ఆరా తీస్తాడు. ఆ కంపెనీ ఎండి స్టీఫెన్ ప్రకాష్(శత్రు)ను పట్టుకుంటాడు. కానీ స్టీఫెన్ ప్రకాష్ వెనుక ఉండి రొయ్యల నాయుడు(రావు రమేష్) ఈ నాటకం ఆడిస్తున్నాడని తెలియదు.
అలాగే డిజె అంటే ఎవరో కూడా రొయ్యలనాయుడుకి తెలియదు. స్టీఫెన్ ప్రకాష్ అసలు గుట్టు ఎక్కడ చెప్పేస్తాడోనని రొయ్యల నాయుడు భయపడి డిజెను చంపేయాలనుకుంటాడు. మరోవైపు హోం మినిస్టర్(పోసాని కృష్ణమురళి) కుమార్తెకు, తన కొడుకునిచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. అప్పుడేం జరుగుతుంది. జగన్నాథానికి రొయ్యల నాయుడు గురించి తెలుస్తుందా? రొయ్యల నాయుడుకి జగన్నాథమ్, డిజె ఒకటే అనే నిజం ఎలా తెలుస్తుంది? చివరకు డిజెగా జగన్నాథమ్ ప్రజలకు ఎలా న్యాయం చేశాడు? తన ప్రేయసిని ఎలా దక్కించుకున్నాడు అనే విషయాలు మిగిలిన కథలో భాగంగా సాగుతాయి.
నటులు
[మార్చు]- అల్లు అర్జున్[4] [5][6][7]
- పూజా_హెగ్డే
- మురళీ శర్మ
- డైరెక్టర్ హరీష్ శంకర్
- నిర్మాత దిల్ రాజు
- చంద్రమోహన్
- హరీశ్ ఉత్తమన్
మూలాలు
[మార్చు]- ↑ "Allu Arjun’s next film titled as ‘Duvvada Jagannadham’"
- ↑ "Allu Arjuns Duvvada Jagannadham goes on floors". intoday.in.
- ↑ "Pooja Hegde finalised for Allu Arjun's next"
- ↑ http://indiatoday.intoday.in/story/duvvada-jagannadham-allu-arjun-pooja-hedge-dj-telugu-film/1/765066.html
- ↑ http://www.firstpost.com/bollywood/duvvada-jagannadham-telugu-actor-allu-arjuns-next-film-to-be-launched-on-monday-2980542.html
- ↑ http://www.indiaglitz.com/dj-duvvada-jagannadham-heroine-almost-finalized-telugu-news-166566.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-12. Retrieved 2016-10-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)