దూడం నాంపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దూడం నాంపల్లి
జననందూడం నాంపల్లి
1944, మే 20
కరీంనగర్ జిల్లా, ఇల్లంతకుంటమండలం, పొత్తూరు గ్రామం
మరణం2013
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధితెలంగాణా కవి
మతంహిందూ
భార్య / భర్తజానాబాయి
పిల్లలునలుగురు కుమారులు
తండ్రినరసయ్య
తల్లిలక్ష్మి

దూడం నాంపల్లితెలుగు సాహిత్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకొని రచనలు చేసిన కవి. ఇతను అనేక ప్రక్రియలలో మూడున్నర దశాబ్దాల పాటు సాహిత్య సేవ చేశాడు. ఇతను కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో 20.5.1944న జన్మించాడు. తెలుగు పండితునిగా ఎందరో విద్యార్థినీ విద్యార్థులను తీర్చిదిద్దిన ఉత్తమ ఉపాధ్యాయుడు. సిరిసిల్లలో ఎక్కువ కాలం నివసించాడు. ఇతని షష్టిపూర్తి సందర్భంగా "సాహితీ సమదర్శనం" అనే ప్రత్యేక సంచిక వెలువడింది. ఇతని కుమారుడు దూడం మనోహర్‌ కూడా కవి కావడం విశేషం. దూడం మనోహర్‌ ఉపాధ్యాయునిగా ఉన్నాడు. 'ఒక్క వీడ్కోలు' పుస్తకాన్ని ప్రచురించటమే కాకుండా అన్ని ప్రముఖ దిన పత్రికలలో ఇతని కవితలు ప్రచురణ పొందాయి.

బిరుదులు[మార్చు]

  • నీతి వచోభిజ్ఞ
  • మధురకవి
  • సుకవిసుధాకర
  • సాహితీశశాంక

రచనలు[మార్చు]

  1. శిష్యద్విశతి (కందాలు)
  2. జీమూతవాహనుడు (పద్యకావ్యం)
  3. శకుంతల (హరికథ)
  4. ద్వయీనాదం (ఖండకావ్యం)
  5. పాండవ అజ్ఞాతవాసం (వీధినాటకం)
  6. పంచామృతం (సాహిత్య వ్యాసాలు)
  7. అభినందన చందనం (గేయసంపుటి)
  8. పాటల పల్లకి (పాటల పేటిక) (షష్టిపూర్తి సంచిక)
  9. భూమిక (కె.భూమిరెడ్డి షష్ట్యబ్ది సంచిక - పద్యకృతి)
  10. మావూరి బడి (అదిక్షేప కథానిక)
  11. కవన కలశం (కవితా సంపుటి)
  12. జైనానీ- జైజై - నానీ (గల్పిక)
  13. జై నానీ లేఖలు (కూర్పు)
  14. సన్మాన కోలహలం (కథానిక)
  15. పరశురామ ప్రీతి (పద్యకృతి)
  16. ప్రతాప సేన విజయం (వీధి నాటకం)
  17. ధర్మాంగద చరిత్రము (చిరుతల నాటకం)
  18. ఉత్తరాయణం (పద్యలేఖలు)
  19. నా కథ (స్వీయ చరిత్ర)
  20. కవితా కాదంబరి

రచనల నుండి ఉదాహరణలు[మార్చు]

ముందరమోమాటముకై
మందస్మిత మొలయ బల్కి మరి ఆవెన్కన్
మందాత్ములీర్ష్యచేతను
కండరమున ద్రోతురు మదిగనరా! శిష్యా
టీచరు లిప్పుడు బడులన్
ప్రాచుర్యముగా 'టీ'లు ద్రావుట కతనన్
'టీచరు'అను పదమెంతయు
'టీ'చరుడిగ మారె - పరులు చెప్పగ శిష్యా
(శిష్యద్విశతి నుండి)

సన్మానాలు - పురస్కారాలు[మార్చు]

  • 1990 - తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ - హరికథా సాహిత్య పురస్కారం
  • 1989 - జాతీయ సాహిత్య పరిషత్‌ - స్వర్ణ సాహితీ పురస్కారం
  • 1995 - యువమిత్ర కళానికేతన్‌, సిరిసిల్ల- యువ ఉగాది పురస్కారం
  • సిరిసిల్ల యూత్‌ అసోషియేషన్‌,సిరిసిల్ల - సినారె విశిష్ట సాహితీ పురస్కారం
  • 1993- రాజరాజేశ్వర దేవస్థానం,వేములవాడ - కవి పండిత సత్కారం
  • 1998 - 'తెలుగు పలుకు', సిడ్నీ (ఆస్ట్రేలియా) - ప్రత్యేక బహుమతి
  • 1999 - సాహితీ గౌతమి,కరీంనగర్‌ - ఉగాది పురస్కారం,
  • 1999 - ఆర్యవైశ్య సంఘం, సిరిసిల్ల - ఉగాది కవితా పురస్కారం
  • అమృతలాల్‌ శుక్లా స్మారక పురస్కారం,
  • పోలీస్‌శాఖ, సిరిసిల్ల - 'సిరి వెలుగు'ల ఆత్మీయ పురస్కారం,
  • కరీంనగర్‌ ఫోక్‌ ఆర్ట్స్‌ అకాడమీ, సిరిసిల్ల - గ్రామీణ జ్యోతి అవార్డు
  • 2002, 2003, 2004 - కలెక్టర్‌, కరీంనగర్‌ - శాతవాహన కళోత్సవాల సత్కారం
  • డాక్టర్‌ జె. రమణయ్య ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, జగిత్యాల - ఉత్తమ ఉపాధ్యాయుడు (రజత పతకం)
  • సమైక్యసాహితి , కరీంనగర్ - సమైక్య సాహితీ విశిష్ట పురస్కారం
  • కళాలయ, పాలకొల్లు - కళాలయ విశిష్ట పురస్కారం
  • అఖిల భారత గీతా ప్రచార మండలి,నిజామాబాద్‌ - కవి దంపతుల గౌరవపురస్కారం
  • చెలిమి సాంస్కృతిక సమితి,విజయవాడ - దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మారక అవార్డు
  • సి.పి.బ్రౌన్‌ అకాడమీ - పద్యరత్నం బహుమతి
  • రంజని ఏ.జి ఆఫీసు,హైదరాబాదు - రంజని విశ్వనాథ అవార్డు

మూలాలు[మార్చు]

  • నేటినిజం దినపత్రిక 26-5-2011 సంచికలో కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం
  • ఆంధ్రప్రభ దినపత్రిక 22-4-2013 సంచికలో వియోగి వ్యాసం