Jump to content

దేబనంద అమత్

వికీపీడియా నుండి
దేబనంద అమత్

పదవీ కాలం
1989-1991
ముందు మారిస్ కుజుర్
తరువాత ఫ్రిదా టోప్నో
పదవీ కాలం
1977-1980
ముందు గజధర్ మాఝి
తరువాత క్రిస్టోఫర్ ఎక్కా
పదవీ కాలం
1967-1971
ముందు గజధర్ మాఝి
తరువాత క్రిస్టోఫర్ ఎక్కా
నియోజకవర్గం సుందర్‌గఢ్

పదవీ కాలం
1973-1974[1]
నియోజకవర్గం ఒడిశా

వ్యక్తిగత వివరాలు

జననం (1916-01-16)1916 జనవరి 16
బాలని, సుందర్‌ఘర్ జిల్లా , ఒరిస్సా , బ్రిటిష్ ఇండియా
మరణం 2011 డిసెంబర్ 21(2011-12-21) (వయసు: 95)
రాజకీయ పార్టీ జనతాదళ్
ఇతర రాజకీయ పార్టీలు జనతా పార్టీ, స్వతంత్ర పార్టీ
మూలం [1]

దేబనంద అమత్ (1916-2011) ఒడిశాకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

దేబనంద అమత్ స్వతంత్ర పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గజధర్ మాఝి చేతిలో 17,979 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1973 నుండి 1974 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు.

దేబనంద అమత్ 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భారతీయ లోక్‌దళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గజధర్ మాఝిపై 44,553 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

దేబనంద అమత్ 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జనతా పార్టీ సెక్యూలర్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో, 1984 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏడవ స్థానంలో, 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జనతా దళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి మారిస్ కుజుర్ పై 91,752 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

దేబనంద అమత్ 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఐదో స్థానంలో నిలిచాడు.

మూలాలు

[మార్చు]
  1. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Rajya Sabha. Retrieved 16 August 2020.
  2. "Freedom Fighter Debanand Amat Passes Away" (in ఇంగ్లీష్). Odishatv. 8 November 2023. Archived from the original on 20 June 2025. Retrieved 20 June 2025.