Jump to content

దేబశ్రీ చౌదరి

వికీపీడియా నుండి
దేబశ్రీ చౌదరి
స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి, భారత ప్రభుత్వం
In office
2019 మే 30 – 2021 జులై 7
ప్రధాన మంత్రినరేంద్ర మోడీ
మినిస్టర్స్మృతి ఇరానీ
అంతకు ముందు వారువీరేంద్ర కుమార్ ఖాతిక్
తరువాత వారుమహేంద్ర ముంజపారా
పార్లమెంటు సభ్యురాలు, లోక్‌సభ
In office
2019 మే 23 – 2024 జూన్ 4
నియోజకవర్గంరాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం
అంతకు ముందు వారుమహమ్మద్ సలీం
తరువాత వారుకార్తిక్ పాల్
వ్యక్తిగత వివరాలు
జననం (1971-01-31) 1971 జనవరి 31 (age 54)[1]
బాలుర్ఘాట్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయతభారతీయురాలు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
సంతకం

దేబశ్రీ చౌదరి (జననం 1971 జనవరి 31) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె భారత ప్రభుత్వంలో 2019 నుండి 2021 వరకు మోదీ రెండో మంత్రివర్గంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేసింది. ఆమె భారతీయ జనతా పార్టీ సభ్యురాలిగా 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 17వ లోక్సభకు ఎన్నికయింది.[2]

ప్రారంభ జీవితం

[మార్చు]

దేబశ్రీ చౌదరి బాలుర్ఘట్ లో డెబిదాస్ చౌదరి, రత్న చౌదరి దంపతులకు జన్మించింది. ఆమె బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసింది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]
2019 మే 31న న్యూఢిల్లీలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దేబశ్రీ చౌదరి.

2016 డిసెంబరు 16న, కోల్‌కాతా టిప్పు సుల్తాన్ మసీదు షాహి ఇమామ్ మౌలూనా నూర్ ఉర్ రెహ్మాన్ బర్కతి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలుపుతూ బైస్నాబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే స్వాధిన్ కుమార్ సర్కార్, ఇతర స్థానిక బిజెపి నాయకులతో పాటు ఆమెను అరెస్టు చేశారు.[3] దేబశ్రీ చౌదరి గతంలో 2019 వరకు బిజెపి కోల్కతా దక్షిణ సబర్బన్ జిల్లా జిల్లా పరిశీలకురాలిగా ఉన్నది.

2019 భారత సార్వత్రిక ఎన్నికలలో, ఆమె రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 511652 ఓట్లతో విజయం సాధించింది.[4] మే 2019లో ఆమె మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.[5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Bio of Member of Parliament". www.loksabha.nic.in. Retrieved 13 July 2019.
  2. "Who Gets What: Cabinet Portfolios Announced. Full List Here". NDTV. 31 May 2019. Retrieved 31 May 2019.
  3. "BJP leaders protest against Shahi Imam, arrested". The Indian Express (in Indian English). 16 December 2016. Retrieved 13 July 2019.
  4. "Raiganj Election Results 2019 Live Updates: Debasree Chaudhuri of BJP Wins". News 18. 23 May 2019. Retrieved 24 May 2019.
  5. "PM Modi allocates portfolios. Full list of new ministers", Live Mint, 31 May 2019, retrieved 22 August 2020