దేయోసాయ్ జాతీయ వనం
| డియోసాయి జాతీయ ఉద్యానవనం | |
|---|---|
| రాక్షసుల భూమి[1][2] | |
![]() Interactive map of డియోసాయి జాతీయ ఉద్యానవనం | |
| Location | స్కార్డు జిల్లా, గిల్గిత్-బాల్టిస్తాన్, పాకిస్తాన్ |
| Nearest city | స్కార్డు, అస్తోర్ |
| Coordinates | 34°58′N 75°24′E / 34.967°N 75.400°E |
| Area | 358,400[3] ha (886,000 acres) |
| Average elevation | 4,114 మీటర్లు (13,497 అడుగులు) |
డియోసాయి జాతీయ ఉద్యానవనం పాకిస్తాన్ లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో స్కార్డు జిల్లా, అస్తోర్ జిల్లాల మధ్య ఉన్న ఎత్తైన ఆల్పైన్ మైదానంపై విస్తరించిన జాతీయ ఉద్యానవనం. ఇది పశ్చిమ హిమాలయాలలోని నంగా పర్బత్ కు తూర్పున, మధ్య కారకోరం పర్వతశ్రేణి సమీపంలో, డియోసాయి పర్వతాలు చుట్టుముట్టిన ప్రాంతంలో ఉంది. ఈ జాతీయ ఉద్యానవనం పాకిస్తాన్ ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడింది.[4][5][6][7][8] డియోసాయి మైదానాలు సముద్ర మట్టానికి సగటున 4,114 metres (13,497 ft) ఎత్తులో ఉన్నాయి.[9]
వ్యుత్పత్తి
[మార్చు]
‘డియోసాయి’ అనే పదం షినా భాషలోని రెండు పదాలైన ‘డియో’ (‘రాక్షసుడు’ లేదా ‘దైత్యుడు’), ‘సాయి’ (‘నీడ’)ల కలయిక. దీనికి ‘రాక్షసుని నీడ’ లేదా ‘రాక్షసుని భూమి’ అనే అర్థాలు ఉన్నాయి.[2][10] బాల్టీ ప్రజలు దీనిని ‘ఘ్బియార్సా’ అని పిలుస్తారు. దీనికి ‘వేసవి ప్రదేశం’ అనే అర్థం వస్తుంది, ఎందుకంటే ఈ ప్రాంతం వేసవి కాలంలో మాత్రమే చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.[11] “రాక్షసుని భూమి” (Land of the Giant) అనే ప్రత్యేక ఆంగ్ల నామకరణాన్ని ప్రయాణ రచయిత, చరిత్రకారుడు సల్మాన్ రషీద్ 1990ల ప్రారంభంలో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక గాథను ప్రతిబింబించే విధంగా రూపొందించాడు. ఆధునిక మాధ్యమాలు, పర్యాటక ప్రచార పత్రికలు దీనిని తరచుగా “రాక్షసుల భూమి” (Land of the Giants)గా బహువచనంలో ఉపయోగించినప్పటికీ, అసలు షినా వ్యుత్పత్తి, మౌఖిక సంప్రదాయాలపై జరిగిన చారిత్రక పరిశోధనలు ఏకవచన రూపానికే మద్దతు ఇస్తున్నాయి.[12][13]
భౌగోళిక స్థితి
[మార్చు]
డియోసాయి జాతీయ ఉద్యానవనం పాకిస్తాన్ లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో పశ్చిమ హిమాలయాలలో ఉంది. ఇది సముద్ర మట్టానికి సగటున 4,114 metres (13,497 ft) ఎత్తులో ఉంది. దీంతో డియోసాయి మైదానాలు టిబెటన్ పీఠభూమిలోని చాంగ్‌టాంగ్ తర్వాత ప్రపంచంలో రెండవ అత్యంత ఎత్తైన పీఠభూమిగా గుర్తించబడుతున్నాయి.[9][14] ఈ ఉద్యానవనం 843 square kilometres (325 mi2) విస్తీర్ణాన్ని కలిగిఉంది. ఇది కారకోరం-పశ్చిమ టిబెటన్ పీఠభూమి ఆల్పైన్ స్టెప్పీ పర్యావరణ ప్రాంతానికి చెందిన సమృద్ధమైన వృక్షజాలం, జంతుజాలానికి ప్రసిద్ధి చెందింది. వసంత ఋతువులో ఈ ప్రాంతం అడవి పూలతో నిండిపోతుంది. అలాగే అనేక రకాల సీతాకోకచిలుకలు కూడా కనిపిస్తాయి.

ప్రయాణ మార్గాలు
[మార్చు]డియోసాయికి పశ్చిమాన ఉన్న అస్తోర్ జిల్లా నుండి, ఉత్తరాన ఉన్న స్కార్డు జిల్లా నుండి, అలాగే ఆగ్నేయ దిశలోని స్కార్డు జిల్లాలోని గల్తారి తహసీల్ నుండి చేరుకోవచ్చు. మెహ్దియాబాద్-డాపా రహదారి ద్వారా మెహ్దియాబాద్ నుండి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. డియోసాయి, స్కార్డు నగరానికి సుమారు 30 kilometres (19 mi) దూరంలో ఉంది. డియోసాయిని సందర్శించడానికి ఇది అతి చిన్న మార్గం. మరో మార్గం అస్తోర్ లోయ నుండి చిలిమ్ మీదుగా సాగుతుంది. శిలా లోయ ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. గల్తారి ప్రాంత ప్రజలు కూడా డియోసాయి మార్గాన్ని ఉపయోగిస్తారు. ఇది జాతీయ ఉద్యానవనం అయినప్పటికీ, గుజ్జర్-బకర్వాల్ సంచార పశుపోషకులు తమ పశువులకు మేత కోసం డియోసాయి జాతీయ ఉద్యానవనాన్ని వినియోగించేందుకు చాలా దూరాలు ప్రయాణిస్తారు.[15] స్కార్డు ప్రాంతంలోని బుర్గీ నాలా మీదుగా వెళ్లే “బుర్గీ లా” అనే మరో మార్గం కూడా ఉంది.[16][17][18]
భూగర్భ నిర్మాణం, నేల
[మార్చు]ఈ ప్రాంతంలోని నేల తీవ్రమైన క్షీణతకు గురైంది. ఇది మోటుదనంతో కూడి ఉండి, వివిధ రకాల, పరిమాణాల రాళ్లు, కంకరలతో కలిసిపోయి ఉంటుంది. పర్వతాల మధ్యనున్న సమతల ప్రాంతాల్లో నేల లోతుగా ఉండి, అక్కడ చిత్తడి ప్రాంత వృక్షజాలం పెరుగుతుంది.
జంతుజాలం, వృక్షజాలం
[మార్చు]అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న హిమాలయ గోధుమ ఎలుగుబంటి, దాని నివాస ప్రాంతాన్ని రక్షించడానికి డియోసాయి జాతీయ ఉద్యానవనాన్ని 1993లో స్థాపించారు. ఒకప్పుడు వేటగాళ్లు, అక్రమ వేటదారుల ప్రధాన లక్ష్యంగా ఉన్న ఈ ఎలుగుబంటి జాతి, ప్రస్తుతం డియోసాయిలో మనుగడ సాధించే అవకాశాన్ని పొందింది. ఇక్కడ వీటి సంఖ్య 1993లో కేవలం 19 ఉండగా, 2005లో 40కి, 2022 నాటికి 78కి పెరిగింది.[19][3]

డియోసాయిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించడంలో కీలక పాత్ర పోషించిన అనంతరం,[21] 1993లో హిమాలయ వన్యప్రాణి ఫౌండేషన్ (మునుపటి పేరు హిమాలయ వైల్డ్‌లైఫ్ ప్రాజెక్ట్)ను గణనీయమైన అంతర్జాతీయ ఆర్థిక సహాయంతో స్థాపించారు. ఈ సంస్థ సుమారు పది సంవత్సరాల పాటు డియోసాయిలో రెండు ఉద్యానవన ప్రవేశ తనిఖీ కేంద్రాలు, ఒక క్షేత్ర పరిశోధనా శిబిరాన్ని నిర్వహించింది.
ఉద్యానవనం నిర్వహణను అప్పటి ఉత్తర ప్రాంతాల అటవీ శాఖకు బదిలీ చేయడానికి అవసరమైన పత్రాలన్నింటినీ హిమాలయ వన్యప్రాణి ఫౌండేషన్ సిద్ధం చేసింది. అనంతరం 2006 నుండి ఆ శాఖ ఉద్యానవన నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. 1990లలో ఉన్న వేట, అక్రమ వేట వంటి ఒత్తిళ్లు తగ్గినప్పటికీ, వాతావరణ మార్పు, ఆహార లోపాలు వంటి సమస్యల కారణంగా గోధుమ ఎలుగుబంటి ఇంకా ప్రమాదంలోనే ఉంది.[19]
డియోసాయి మైదానాలు సైబీరియన్ ఐబెక్స్, మంచు చిరుత, కాశ్మీర్ కస్తూరి జింక, హిమాలయ తోడేలు, హిమాలయ మార్మాట్ వంటి జంతువులకు, అలాగే 124కు పైగా స్థిర నివాస, వలస పక్షుల జాతులకు నివాసంగా ఉన్నాయి. ఉద్యానవనంలో కనిపించే పక్షుల్లో బంగారు గద్ద, లామర్‌గైయర్, హిమాలయ గద్ద, లగ్గర్ ఫాల్కన్, పెరెగ్రైన్ ఫాల్కన్, యూరేషియన్ కెస్ట్రెల్, యూరేషియన్ స్పారోహాక్,, హిమాలయ స్నోకాక్ ఉన్నాయి.[22]
ఇక్కడ కొన్ని స్థానికంగా ప్రసిద్ధి చెందిన ఔషధ మొక్కలు కూడా కనిపిస్తాయి. వాటిలో Thymus linearis (రీతుంబురుక్),[23]: 11 Saussurea lappa (కుత్), Ephedra gerardiana (సాయ్),[23]: 9 Viola pilosa (స్కోరా-మిందోక్),[23]: 11 Pleurospermum candollei (షామ్దున్)[23]: 10 , Artemisia brevifolia (బుర్సాయ్)[23]: 8 ఉన్నాయి. ఇవి సంప్రదాయ వైద్య చికిత్సల్లో ఉపయోగించబడుతున్నాయి.
సాంస్కృతిక ప్రస్తావనలు
[మార్చు]హెరోడోటస్
[మార్చు]ఫ్రెంచ్ జాతిశాస్త్రవేత్త మిచెల్ పైసెల్ చేసిన పరిశోధన ప్రకారం, క్రీస్తుపూర్వ 5వ శతాబ్దంలో జీవించిన గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ పేర్కొన్న ‘బంగారం త్రవ్వే చీమలు’ కథ, డియోసాయి పీఠభూమిలో కనిపించే బంగారు రంగు హిమాలయ మార్మాట్, వాటి బిల్లుల నుండి తవ్వబడిన బంగారం ధూళిని సేకరించే స్థానిక మినారో తెగల ఆచారాల ఆధారంగా ఏర్పడిందని పేర్కొంటుంది.[24]
చలనచిత్రాలలో
[మార్చు]- డాక్యుమెంటరీ చిత్రంల శ్రేణి Land of the Tigerలోని 5వ భాగం “మౌంటెన్స్ ఆఫ్ ది గాడ్స్”లో డియోసాయి ప్రాంతపు వృక్షజాలం, జంతుజాలం ప్రదర్శించబడింది.
- Karakoram Heliski 2013 — Walkabout Films
- DEOSAI - The Last Sanctuary — Walkabout Films
- Deosai – Wilderness in Peril — UNDP, Walkabout Films[25]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Khan, Gulnaz (16 August 2022). "Explore Pakistan's wildest, most beautiful landscapes". నేషనల్ జియోగ్రాఫిక్ (in ఇంగ్లీష్).
- ↑ 2.0 2.1 Ashdown, Paddy (23 June 2024). "Deosai Plain – A jewel in crown of Gilgit-Baltistan". ది నేషన్. Retrieved 10 November 2024.
- ↑ 3.0 3.1 "Deosai National Park". doam.gov.pk. Department of Archaeology and Museums - Government of Pakistan. Archived from the original on 10 నవంబర్ 2024. Retrieved 10 November 2024.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ "Deosai National Park". whc.unesco.org. ప్రపంచ వారసత్వ కన్వెన్షన్, యునెస్కో. Retrieved 10 November 2024.
- ↑ "NATIONAL PARKS - DEOSAI NATIONAL PARK". fweb.gov.pk. Forest, Wildlife & Environment Department Government of Gilgit-Baltistan. 5 January 2022. Retrieved 10 November 2024.
- ↑ "Deosai National Park Skardu". Retrieved 31 July 2021.
- ↑ Daud, Nyla (18 June 2023). "TRAVEL: A DEOSAI ADVENTURE". డాన్. Retrieved 10 November 2024.
- ↑ Deosai Mountains. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా. 10 September 2024. Retrieved 10 November 2024.
- ↑ 9.0 9.1 Öztürk, Münir; Hakeem, Khalid Rehman; Faridah-Hanum, I.; Efe, Recep (2015-05-05). Climate Change Impacts on High-Altitude Ecosystems (in ఇంగ్లీష్). Springer. p. 456. ISBN 9783319128597.
- ↑ Rashid, Salman; Khawar, Nadeem (2013). Deosai: land of the giant. Lahore: Sang-e-Meel Publications. ISBN 978-969-35-2660-8.
- ↑ Abbas, Zaheer; Kousar, Shazia; Aziz, Muhammad Abdul; Pieroni, Andrea; Aldosari, Ali Abdullah; Bussmann, Rainer W.; Raza, Ghulam; Abbasi, Arshad Mehmood (2021-05-14). "Comparative Assessment of Medicinal Plant Utilization among Balti and Shina Communities in the Periphery of Deosai National Park, Pakistan". Biology (in ఇంగ్లీష్). 10 (5): 434. doi:10.3390/biology10050434. ISSN 2079-7737. PMC 8153600. PMID 34068859.
- ↑ Rashid, Salman (2013). Deosai: Land of the Giant (in English). Sang-e-Meel Publications. ISBN 978-9693526608.
{{cite book}}: CS1 maint: unrecognized language (link) - ↑ Rashid, Salman (1995). Between Two Burrs on the Map: Travels in Northern Pakistan. Sang-e-Meel Publications. ISBN 978-9693506303.
- ↑ "Deosai National Park 2nd Highest Plateau". Retrieved 21 March 2021.
- ↑ Rafiq, Arshed (11 July 2018). "Nomadic life: A struggle against climate change and authorities". Earth Journalism Network (in ఇంగ్లీష్). Daily Times Pakistan. Retrieved 3 September 2022.
- ↑ Karim Shah Nizari (17 July 2011). "Deosai: Anything but plain". The Express Tribune. Retrieved 3 September 2022.
- ↑ Syed Mehdi Bukhari (27 April 2015). "Deosai Plains: Welcome to surreal Pakistan". DAWN. Retrieved 3 September 2022.
- ↑ Osman Ehtisham Anwar (9 April 2016). "My search for the elusive 'giant' of Deosai". DAWN. Retrieved 3 September 2022.
- ↑ 19.0 19.1 "Himalayan bears on verge of extinction". The Express Tribune (in ఇంగ్లీష్). 2022-03-27. Retrieved 2023-04-05.
- ↑ "Deosai - Wilderness in Peril (Conservation of Himalayan Brown Bear)". undp.org. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం. Retrieved 10 November 2024.
- ↑ Sheikh, Ibriz (1 August 2016). "Should the G-B govt be holding a festival at the world's second highest plateau?". ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్. Retrieved 10 November 2024.
- ↑ "Deosai National Park". paktourismportal.com.
- ↑ 23.0 23.1 23.2 23.3 23.4 Abbas, Zaheer; Kousar, Shazia; Aziz, Muhammad Abdul; Pieroni, Andrea; Aldosari, Ali Abdullah; Bussmann, Rainer W.; Raza, Ghulam; Abbasi, Arshad Mehmood (2021). "Comparative Assessment of Medicinal Plant Utilization among Balti and Shina Communities in the Periphery of Deosai National Park, Pakistan". Biology. 10 (5): 434. doi:10.3390/biology10050434. PMC 8153600. PMID 34068859. 434.
- ↑ Peissel, Michel. "The Ants' Gold: The Discovery of the Greek El Dorado in the Himalayas". Collins, 1984. ISBN 978-0-00-272514-9.
- ↑ "UNDP's new documentary raises awareness about need for conservation of Brown Bears in Northern Pakistan". undp.org. United Nations Development Programme. 23 May 2019. Retrieved 10 November 2024.
మరింత సమాచారం కోసం
[మార్చు]- "Deosai Management plan for National Park (2020-2025)" (PDF). info.undp.org. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం. Archived from the original (PDF) on 10 నవంబర్ 2024. Retrieved 10 November 2024.
{{cite web}}: Check date values in:|archive-date=(help)
