దేవదత్ పాడిక్కల్
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 2000 జూలై 7 ఎడప్పల్ , కేరళ , భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||
| ఎత్తు | 1.90 m (6 ft 3 in) | |||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | ఎడమచేతి | |||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 314) | 2024 7 మార్చి - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 2024 22 నవంబర్ - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 89) | 2021 28 జూలై - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2021 29 జూలై - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
| T20Iల్లో చొక్కా సంఖ్య. | 37 | |||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||
| 2017–ప్రస్తుతం | గుల్బర్గా మిస్టిక్స్ | |||||||||||||||||||||||||||||||||||
| 2018–ప్రస్తుతం | కర్ణాటక | |||||||||||||||||||||||||||||||||||
| 2019–2021 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||
| 2022–2023 | రాజస్థాన్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||
| 2024 | లక్నో సూపర్ జెయింట్స్ | |||||||||||||||||||||||||||||||||||
| 2025–ప్రస్తుతం | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
దేవదత్ పాడిక్కల్ (జననం 7 జూలై 2000) భారత క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో కర్ణాటక తరపున ఆడుతున్నాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. ఆయన భారత అండర్-19 జట్టు తరపున ఆడి, జూలై 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ ద్వారా భారత జట్టుతో అరంగేట్రం చేశాడు.[1]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]దేవదత్ పడిక్కల్ 2000 జూలై 7న కేరళలోని ఎడప్పల్‌లో అంబిలి పడిక్కల్, బాబును కున్నాత్ దంపతులకు జన్మించాడు. ఆయన బెంగళూరులోని సెయింట్ జోసెఫ్స్ యూనివర్శిటీ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో తన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌ను పూర్తి చేశాడు. వారి తల్లి తండ్రులు కొంతకాలం హైదరాబాద్‌లో ఉండి, 2011లో వారి కుటుంబం హైదరాబాద్ నుండి బెంగళూరుకు మారగా అక్కడ కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్‌లో శిక్షణ ప్రారంభించాడు. ఆయన 2014 నుండి అండర్-16, అండర్-19 విభాగాలలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించి 2017లో కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో బళ్లారి టస్కర్స్ జట్టుకు ఎంపికయ్యాడు.
దేశీయ కెరీర్
[మార్చు]దేవదత్ పాడిక్కల్ 2018 నుండి 2019 రంజీ ట్రోఫీలో కర్ణాటక తరపున 28 నవంబర్ 2018న తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి డిసెంబర్ 2018లో 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని కొనుగోలు చేసింది. ఆయన ఐపీఎల్ చరిత్రలో తన మొదటి నాలుగు మ్యాచ్‌లలో మూడు అర్ధ సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.[2]
దేవదత్ 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరపున సెప్టెంబర్ 26, 2019న లిస్ట్ A అరంగేట్రం చేసి పదకొండు మ్యాచ్‌ల్లో 609 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
దేవదత్ అక్టోబర్ 2019లో 2019–20 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా ఏ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆయన 2019–20 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక తరపున 2019 నవంబర్ 8న తన ట్వంటీ20 అరంగేట్రం చేసి, ఆగస్టు 2024లో 2024 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా డి జట్టులో చోటు దక్కించుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]దేవదత్ జూన్ 2021లో శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం భారతదేశం వన్డే ఇంటర్నేషనల్ (ODI), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (టీ20I) జట్లలో చోటు దక్కించుకుని జూలై 28న శ్రీలంకతో జరిగిన టీ20I మ్యాచ్‌లో భారతదేశం తరపున అరంగేట్రం చేశాడు.
దేవదత్ ఫిబ్రవరి 2024లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టులో కెఎల్ రాహుల్ స్థానంలో అతన్ని చేరాడు. ఆయన మార్చి 7న అదే సిరీస్‌లోని 5వ మ్యాచ్‌లో తన టెస్ట్ అరంగేట్రం చేసి తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో 103 బంతుల్లో 65 పరుగులు చేశాడు.[3] అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
[మార్చు]దేవదత్ పాడిక్కల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో పాడిక్కల్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. తన తొలి ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 15 మ్యాచ్‌ల్లో 473 పరుగులు చేశాడు. ఆయన 2021 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీకి కర్ణాటక జట్టులో సభ్యుడిగా ఎంపికయ్యాడు. ఏప్రిల్ 22, 2021న, 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో దేవదత్ 101 * స్కోరుతో తన తొలి సెంచరీని సాధించాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్‌ను పది వికెట్ల తేడాతో ఓడించింది.
దేవదత్ పాడిక్కల్ ఫిబ్రవరి 2022లో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేయగా మార్చి 2022లో తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించాడు, 2021–22 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో 178 పరుగులు చేశాడు. ఆయన ఏప్రిల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు ఐపీఎల్‌లో తన 1,000 పరుగులను సాధించాడు.
దేవదత్ పాడిక్కల్ 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దేవదత్ పడిక్కల్‌ను అతని బేస్ ధర 2 కోట్లకు కొనుగోలు చేసింది.
మూలాలు
[మార్చు]- ↑ "Bengaluru has played a big role in my career: Devdutt Padikkal". The Times of India. 20 June 2018. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
- ↑ "It's important that I keep my foot on the pedal and not take it off: Padikkal" (in Indian English). The Hindu. 17 January 2025. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
- ↑ "5th Test: Devdutt Padikkal makes debut as England choose to bat first against India" (in ఇంగ్లీష్). Telangana Today. 7 March 2024. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.