దేవదాసు (1974 సినిమా)
దేవదాసు (1974 సినిమా) | |
---|---|
దర్శకత్వం | విజయనిర్మల |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
దేవదాసు విజయనిర్మల దర్శకత్వంలో 1974 లో విడుదలైన తెలుగు చిత్రం. వినోదా వారి దేవదాసు వచ్చిన రెండు దశాబ్దాల తరువాత కృష్ణ, విజయనిర్మల ద్వయం ఈ చిత్ర కల్పనకు పూనుకున్నారు. చిత్రకథ శరత్ సృష్టి అప్పటికే అనేక పర్యాయాలు భారత తెర (ఇండియన్ స్క్రీన్) మీద కనిపించింది. (సైగాల్, దిలీప్, ఎ ఎన్నార్ వంటి ఉద్దండులతో). కృష్ణ ఎంతో సాహసంతో ఈ చిత్రాన్ని నిర్మించినా విజయం దక్కలేదు. దీనితో పాటే విడుదలైన ఎ ఎన్నార్ దేవదాసు తిరిగి విజయవంతంగా నడిచింది. ఐతే కొత్త (కృష్ణ) దేవదాసు నిశ్చయంగా కొన్ని విషయాలలో ఉన్నతంగా తయారయ్యింది. ఆరుద్ర సంభాషణలు, గీతాలలో సాహితీ విలువలు, ఆ గీతాలను రమేష్ నాయుడు స్వరపరచిన విధానం చిత్రానికి విలువను సంతరించాయి. పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ, మేఘాలమీద సాగాలి, కల చెదిరింది కథ మారింది, ఇది నిశీధి సమయం మొదలైన పాటలు పాత (ఎ ఎన్నార్) దేవదాసులో కన్న ఎక్కువ తెలుగు దనంతో (సంగీత సాహిత్య పరంగా) గబాళించాయి.
తారాగణం[మార్చు]
- కృష్ణ
- విజయనిర్మల
- జగ్గయ్య
- గుమ్మడి
- కాంతారావు
- సత్యనారాయణ
- శ్రీధర్
- కృష్ణకుమారి
- మణిమాల
- పండరీబాయి
- జి. నిర్మల
- జయప్రద
- సునందిని
- సూర్యకళ
- చంద్రమోహన్
- ప్రయాగ శాస్త్రి
- వై.వి.రాజు
- జయంతి
- మాస్టర్ నరేష్ కుమార్
- బేబి సుమతి
- ప్రభాకరరెడ్డి
- అల్లు రామలింగయ్య
- సాక్షి రంగారావు
- కె.వి.చలం
- జగ్గారావు
- ఛాయాదేవి
- తార
- రాజేశ్వరి
సాంకేతిక వర్గం[మార్చు]
- మాటలు: ఆత్రేయ
- పాటలు: ఆరుద్ర
- సంగీతం: రమేష్ నాయుడు
- కళ: తోట
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ
- ఛాయాగ్రహణ దర్శకత్వం: వి.యస్.ఆర్.స్వామి
- కూర్పు:కోటగిరి గోపాలరావు
- నిర్మాత: యస్.రమానంద్
- చిత్రానువాదం, దర్శకత్వం: విజయనిర్మల
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
- Articles with short description
- Pages with lower-case short description
- Short description is different from Wikidata
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- విషాదాంత సినిమాలు
- బెంగాలీ కథతో వచ్చిన తెలుగు సినిమాలు
- కె.వి.చలం నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు
- గుమ్మడి నటించిన చిత్రాలు
- సత్యనారాయణ నటించిన చిత్రాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు