దేవనహళ్ళి
?దేవనహళ్లి కర్ణాటక • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 13°14′N 77°42′E / 13.23°N 77.7°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | బెంగుళూరు గ్రామీణ జిల్లా |
జనాభా | 23,190 (2001 నాటికి) |
దేవనహళ్ళి (పాత పేర్లు దేవనదొడ్డి, దేవనపుర, యూసుఫాబాద్) కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు గ్రామీణ జిల్లాకు చెందిన ఒక పట్టణం.[1] ఇది బెంగుళూరు నగరానికి 30 కి.మీ.ల దూరంలో ఉంది.ఇది బెంగుళూరు గ్రామీణ జిల్లాలో ఉన్న నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.దేవనహళ్ళి నియోజకవర్గం షెడ్యూల్డు కులాలకు రిజర్వు చేయబడింది.[1] 2013లో ఈ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థి పిళ్ళముని శ్యామప్ప శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]
దేవనహళ్ళి కోట
[మార్చు]దేవనహళ్ళి తొలుత గంగవాడిలో భాగంగా ఉండేది. తరువాత ఇది రాష్ట్రకూటుల పాలనలోకి వచ్చింది. ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు, నోలంబులు, పల్లవులు, చోళులు, హొయసలులు, విజయనగర పాలకులు వరుసగా పాలించారు. ఈ కోటను సా.శ.1501లో విజయనగర సామ్రాజ్యపు సామంతరాజైన అవతి రాజు మల్లబైరేగౌడ దేవనదొడ్డి (ప్రస్తుతం దేవనహళ్ళి) లో కట్టించాడు. ఈ కోట సా.శ.1747లో మైసూరు సామ్రాజ్యపు ఒడయారు రాజుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత ఇది పలుమార్లు మరాఠాల హస్తగతమై చివరకు హైదర్ అలీ, టిప్పు సుల్తానుల ఆధీనంలోకి వచ్చింది. టిప్పు సుల్తానుకు ఇది జన్మస్థలం మాత్రమే కాక మృగయావినోదానికి ఇష్టమైన ప్రదేశం. సా.శ.1791లో ఈ కోట లార్డ్ కార్న్‌వాలిస్ వశమైంది. ఈ కోట అండాకారపు ఆకృతిలో విశాలమైన ప్రాకారంతో 12 అర్ధవలయాకారపు బురుజులతో రాళ్ళు, ఇటుక, గారలతో నిర్మించబడి ఉంది. ఈ కోటకు తూర్పు, పడమర దిశలలో ప్రవేశద్వారాలున్నాయి.[2]
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం
[మార్చు]ఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కారణంగా బెంగళూరు గ్రామీణ జిల్లా, దేవనహళ్ళి తాలూకా ప్రపంచపటంలో గుర్తింపు పొందింది. 2008, మే 23వ తేదీన కర్ణాటక రాష్ట్రపు మొట్టమొదటి అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ప్రారంభించబడింది. బెంగళూరు నగరం నుండి సుమారు 32 కి.మీ.దూరంలో ఉన్న ఈ విమానాశ్రయానికి రహదారి మార్గాలు అనుసంధానమై ఉన్నాయి. "హైస్పీడ్ రైలు", "ఎక్స్‌ప్రెస్ వే" మార్గాల బ్లూప్రింట్ తయారు చేయబడింది. టాక్సీ సౌకర్యం, ప్రతి 15 నిమిషాలకొక కె.ఎస్.ఆర్.టి.సి.బస్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. బెంగళూరు ఏ మూల నుండి ఐనా గంట, గంటన్నరలోపు విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ప్రయాణీకుల సౌకర్యం కొరకు "బి.ఐ.ఎ.ఎల్ సహాయవాణి" సౌలభ్యం ఉంది. సహాయవాణి సంఖ్య:40581111 ద్వారా విమానాశ్రయానికి రవాణా సౌకర్యాల వివరాలు, ఇతర సాధారణ విషయాలు ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. విమానాశ్రయంలో 53 చెక్-ఇన్ కౌంటర్లు, 18 స్వయం పరిశీలన యంత్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. పిల్లల సౌకర్యం కొరకు ఔషధాలయం, డయాపర్లు మార్చుటకు, పిల్లలకు పాలుత్రాగించడానికి ప్రత్యేక స్థలాలు ఉన్నాయి.
ఇతర విశేషాలు
[మార్చు]ఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
దేవనహళ్ళి టిప్పు సుల్తాన్ జన్మించిన ప్రదేశం. టిప్పు సుల్తాన్ కోట ఇక్కడి పర్యాటక స్థలం. డి.వి.గుండప్ప నివసించిన పాత ఇల్లు ఇక్కడ ఉంది. ఈ పట్టణం "పంపర పనస" పళ్ళకు ప్రసిద్ధి. ఇక్కడి నుండి పంపరపనస పళ్ళు దుబాయ్, షార్జా మొదలైన ప్రదేశాలకు ఎగుమతి అవుతాయి.
దేవాలయాలు
[మార్చు]ఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ పట్టణంలో వేణుగోపాలస్వామి దేవస్థానం, చంద్రమౌళీశ్వర దేవస్థానం పేరు గడించినవి.ప్రతి దీపావళికి చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో లక్షదీపోత్సవాలు కన్నులపండుగగా జరుగుతాయి. పురాతనమైన నగరేశ్వర దేవాలయం సమీపంలోని విజయపురలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-26. Retrieved 2020-02-26.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ కోట ద్వారం ముందున్న సమాచార ఫలకం ఆధారంగా