దేవరకొండ పురపాలకసంఘం
దేవరకొండ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°34′15″N 78°58′27″E / 16.5709420°N 78.9740725°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
మండలం | దేవరకొండ |
ప్రభుత్వం | |
- చైర్‌పర్సన్ | ఆలంపల్లి నర్సింహ్మ |
- వైస్ చైర్‌పర్సన్ | ఎం.డీ రహాత్ అలీ |
వైశాల్యము | |
- మొత్తం | 28.20 km² (10.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 39,414 |
- పురుషుల సంఖ్య | 20,442 |
- స్త్రీల సంఖ్య | 18,972 |
- గృహాల సంఖ్య | 6,890 |
పిన్ కోడ్ - 508248 | |
Area code(s) | ఎస్.టి.డి కోడ్ - 08691 |
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ |
దేవరకొండ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] దేవరకొండ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం లోని దేవరకొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న దేవరకొండ 2012లో నగర పంచాయితీగా, 2017లో పురపాలక సంఘంగా ఏర్పడింది.
భౌగోళికం
[మార్చు]దేవరకొండ 28.20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°42′00″N 78°55′59″E / 16.700°N 78.933°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 110 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం నల్గొండ నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 39414 మంది కాగా, అందులో 20442 మంది పురుషులు, 18972 మంది మహిళలు ఉన్నారు. 6890 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 4 రెవెన్యూ వార్డుగా విభజించబడింది.[3]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం ఆలంపల్లి నర్సింహ్మ చైర్‌పర్సన్‌గా, ఎం.డీ రహాత్ అలీ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[6]
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- పొన్నెబోయిన భూదేవి
- పాలెపు మల్లేశ్వరి
- రజియా సుల్తానా
- మహ్మద్ రయీస్
- వడ్త్య దేవేందర్
- గోపాలదాసు చెన్నయ్య
- నేనావత్ ప్రవళిక
- నేతాళ్ళ భాగ్యలక్ష్మీ
- హనుమంతు వెంకటేష్ గౌడ్
- జయప్రకాష్ నారాయణ
- తస్కిన్ సుల్తానా
- షగుఫనాస్
- పులిజాల లక్ష్మీ
- గాజుల మురళి
- ఎండి. రహత్ ఆలీ (వైస్ చైర్‌పర్సన్)
- ఆలంపల్లి నర్సింహా (చైర్‌పర్సన్)
- చిత్రం శ్రీవాణి
- వీరమోని అంజిగౌడ్
- శ్రీధర్ గౌడ్
- కొండ్ర మల్లీశ్వరి
మూలాలు
[మార్చు]- ↑ "Devarkonda Municipality". devarakondamunicipality.telangana.gov.in. Archived from the original on 10 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 11 April 2021.
- ↑ "Basic Information of Municipality, Devarkonda Municipality". devarakondamunicipality.telangana.gov.in. Archived from the original on 10 మే 2021. Retrieved 11 April 2021.
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 11 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 11 April 2021.
- ↑ skannegari. "Devarakonda Municipality election - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.
వెలుపలి లంకెలు
[మార్చు]- దేవరకొండ పురపాలక సంఘ అధికారిక వెబ్‌సైటు Archived 2021-04-11 at the Wayback Machine