అక్షాంశ రేఖాంశాలు: 22°58′N 76°04′E / 22.96°N 76.06°E / 22.96; 76.06

దేవాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవాస్
నగరం
టేక్రీ కొండపై నుండి దేవాస్ నగర రాత్రి దృశ్యం
టేక్రీ కొండపై నుండి దేవాస్ నగర రాత్రి దృశ్యం
దేవాస్ is located in Madhya Pradesh
దేవాస్
దేవాస్
Coordinates: 22°58′N 76°04′E / 22.96°N 76.06°E / 22.96; 76.06
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాదేవాస్
తహసీల్దేవాస్
విస్తీర్ణం
 • Total50 కి.మీ2 (20 చ. మై)
 • Rank900th
Elevation
535 మీ (1,755 అ.)
జనాభా
 (2011)[1]
 • Total2,89,550
 • జనసాంద్రత5,800/కి.మీ2 (15,000/చ. మై.)
భాష
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
455001 to 455005
టెలిఫోన్ కోడ్91-(0)727
ISO 3166 codeMP-IN
Vehicle registrationMP-41
Website
;

దేవాస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం, మాళ్వా ప్రాంతంలోని నగరం. బ్రిటిషు పాలనా కాలంలో ఈ నగరం, దేవాస్ జూనియర్ స్టేట్, దేవాస్ సీనియర్ స్టేట్ అనే రెండు సంస్థానాలకు రాజధాని నగరంగా ఉండేది. ప్రస్తుతం దేవాస్ జిల్లాకు ముఖ్యనగరం. దేవాస్ ఒక పారిశ్రామిక నగరం. ఇక్కడ ప్రభుత్వ బ్యాంక్ నోట్ల ముద్రణాలయం ఉంది [3] [4]

చరిత్ర

[మార్చు]

దేవాస్ గతంలో బ్రిటిష్ ఇండియాలోని రెండు సంస్థానాలకు రాజధానిగా ఉండేది. దేవాస్ సమైక్య సంస్థానాన్ని 18 వ శతాబ్దం మొదటి భాగంలో మరాఠాల పువార్ వంశానికి చెందిన తూకాజీ రావు, జివాజీ రావు అనే అన్నదమ్ములు స్థాపించారు. వారు 1728 లో మరాఠా పేష్వా, బాజీ రావుతో కలిసి మాళ్వా లోకి ప్రవేశించారు. సోదరులు ఈ సంస్థానాన్ని తమలో తాము విభజించుకున్నారు. వారి వారసులు ఈ సంస్థానాలను సీనియర్, జూనియర్ శాఖలుగా పాలించారు. 1841 తరువాత, ఈ రెండూ విడివిడిగా ప్రత్యేక సంస్థానాలుగా పరిపాలించారు. అయితే రెంటికి చెందిన భూములు కలిసిపోయి ఉండేవి. రాజధాని దేవాస్‌ పట్తణం లోని ప్రధాన వీధికి రెండు వైపులా ఉన్న భాగాల్లో ఒక్కో భాగం ఒక్కో సంస్థానం అధీనంలో ఉండేవి. ఎవరి భాగంలో వారికి వేరువేరుగా నీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాట్లు ఉండేవి.

సీనియర్ శాఖ విస్తీర్ణం 446 చ.కి.మీ. ఉండేది. 1901 లో 62,312 లో జనాభా ఉండేది. జూనియర్ శాఖ 440 చ.కి.మీ. విస్తీర్ణంతో, 54,904 జనాభా కలిగి ఉండేది. [5] రెండు దేవాస్ సంస్థానాలూ సెంట్రల్ ఇండియా ఏజెన్సీ యొక్క మాల్వా ఏజెన్సీలో భాగంగా ఉండేవి.

భౌగోళికం

[మార్చు]

దేవాస్ ఇండోర్‌కు ఈశాన్యంగా, ఉజ్జయినికి ఆగ్నేయంగా, షాజాపూర్‌కు నైరుతిలో ఉంది. నగరం మాళ్వా పీఠభూమి మైదాన ప్రాంతంలో ఉంది. దక్షిణాన, భూమి క్రమేణా వింధ్య శ్రేణికి పెరుగుతుంది. వింధ్య పర్వతాల్లో పుట్టిన చంబల్, కాశీ సింధ్ నదులు నగరం గుండా ప్రవహించి గంగానదిలో కలుస్తాయి. దేవాస్ లోని ప్రధాన నది క్షిప్రా.

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, దేవాస్ మొత్తం జనాభా 2,89,550, వీరిలో 1,50,081 మంది పురుషులు, 1,39,469 మంది మహిళలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల జనాభా 35,437. దేవాస్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 215,088, ఇది జనాభాలో 74.3%, పురుషుల అక్షరాస్యత 79.9%, స్త్రీల అక్షరాస్యత 68.3%. దేవాస్‌లో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత రేటు 84.6%, ఇందులో పురుషుల అక్షరాస్యత 91.1%, స్త్రీ అక్షరాస్యత 77.7%. షెడ్యూల్డ్ కులాల జనాభా 56,366 కాగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 9,861. 2011 లో దేవాస్‌లో 57,397 గృహాలు ఉన్నాయి.[1]

పరిశ్రమ

[మార్చు]

1800 లలో నల్లమందు ఉత్పత్తి కేంద్రంగా దేవాస్ ప్రసిద్ది చెందింది. ఈ విషయం రాయల్ కమిషన్ ఆన్ ఓపియం 1895 మొదటి నివేదికలో ఉంది. [6] 1970 ల చివరలో, 1980 ల ప్రారంభంలో వేగవంతమైన పారిశ్రామికీకరణ జరిగింది, కానీ మౌలిక సదుపాయాలు సరిపోకపోవడం వల్ల, 1980 ల చివరి నుండి వేగం మందగించింది. ఇటీవలి సంవత్సరాలలో, కొన్ని పరిశ్రమలు వృద్ధికి తోడ్పడటానికి తగిన మౌలిక సదుపాయాల కొరత కారణంగా తమ కార్యకలాపాలను మూసివేసాయి. నగరంలో అనేక పారిశ్రామిక యూనిట్లు ఉన్నాయి, వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. టాటా, కిర్లోస్కర్, జాన్ డీర్ వంటి పెద్ద సంస్థలు ఇక్కడ ఉన్నాయి.

రవాణా

[మార్చు]

రైలు

[మార్చు]
రైల్ స్టేషన్

దేవాస్ జంక్షన్ (డిడబ్ల్యుఎక్స్), ఒక ప్రామాణిక బ్రాడ్-గేజ్ రైల్వే స్టేషన్, ఇది పశ్చిమ రైల్వే జోన్ లోని రత్లాం డివిజన్‌కు చెందినది. ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపుతుంది.

దేవాస్ జంక్షన్ ఇండోర్ జంక్షన్- ఉజ్జయిని జంక్షన్ బ్రాంచ్ లైన్ లో ఉంది. ఇది నాగ్దా భోపాల్ జంక్షన్ పశ్చిమ మధ్య రైల్వే లింక్ లైన్‌ను కలిపే మార్గం కూడా నగరం గుండా వెళ్తుంది. ఇండోర్-ఉజ్జయిని మార్గాన్ని విద్యుదీకరించారు.

రోడ్లు

[మార్చు]

జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల విస్తృతమైన నెట్‌వర్క్ ద్వారా దేవాస్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. NH-52 నగరం గుండా కైతల్‌కు వెళుతుంది. ఎన్‌హెచ 86 దేవాస్‌ను కాన్పూర్‌కు కలుపుతుంది. దేవాస్-భోపాల్ కారిడార్ అని పిలువబడే 4 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే ద్వారా దేవాస్ రాష్ట్ర రాజధాని భోపాల్‌కు అనుసంధానించబడి ఉంది.

శీతోష్ణస్థితి

[మార్చు]
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 26.5
(79.7)
29.3
(84.7)
34
(93)
38.1
(100.6)
40.4
(104.7)
36.3
(97.3)
29.7
(85.5)
28.5
(83.3)
29.7
(85.5)
31.7
(89.1)
29.3
(84.7)
27.1
(80.8)
40.4
(104.7)
రోజువారీ సగటు °C (°F) 18.3
(64.9)
20.5
(68.9)
25.1
(77.2)
29.7
(85.5)
33
(91)
30.6
(87.1)
26.3
(79.3)
25.4
(77.7)
25.6
(78.1)
24.7
(76.5)
21
(70)
18.7
(65.7)
24.9
(76.8)
అత్యల్ప రికార్డు °C (°F) 10.2
(50.4)
11.8
(53.2)
16.2
(61.2)
21.3
(70.3)
25.6
(78.1)
24.9
(76.8)
22.9
(73.2)
22.3
(72.1)
21.5
(70.7)
17.7
(63.9)
12.7
(54.9)
10.4
(50.7)
10.2
(50.4)
సగటు వర్షపాతం mm (inches) 9
(0.4)
2
(0.1)
7
(0.3)
3
(0.1)
7
(0.3)
122
(4.8)
327
(12.9)
274
(10.8)
240
(9.4)
30
(1.2)
13
(0.5)
5
(0.2)
1,039
(41)
Source: climate-data.org [7]


మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Census of India: Dewas". www.censusindia.gov.in. Retrieved 27 November 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 7 January 2021.
  3. "Bank Note Press (BNP) Dewas". SPMCIL. Archived from the original on 20 ఆగస్టు 2012. Retrieved 25 August 2012. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "Amid cash crisis, Bank Note Press ropes in retired employees".
  5.  One or more of the preceding sentences incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). "Dewas". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 8 (11th ed.). Cambridge University Press. p. 137.
  6. First Report of the Royal Commission on Opium: With Minutes of Evidence and Appendices... (in ఇంగ్లీష్). H.M. Stationery Office. 1894. p. 149. dewas city.
  7. "Dewas climate: Average Temperature, weather by month, Dewas weather averages - Climate-Data.org". Retrieved December 17, 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=దేవాస్&oldid=4218711" నుండి వెలికితీశారు