దేవినేని మాణిక్యం,దాసరి వెంకటసుబ్బయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ముసునూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేవినేని మాణిక్యం,దాసరి వెంకటసుబ్బయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ముసునూరు.

  • ఈ పాఠశాల పూర్వ విద్యార్థుల ప్రోతాహంతో, పాఠశాలకు అదనపు హంగులు ఏర్పడినవి. జిల్లాలోనే అతున్నతమైన పాఠశాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. ఈ పాఠశాలలో 1948 నుండి 2000 సం. వరకూ చదివి ఎక్కడెక్కడో ఉంటున్న 3 వేలమంది విద్యార్థులు, చాలా ప్రయాసలకోర్చి, 2012,జనవరి-13,14,15 తేదీలలో ఈ గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని, మూడు రోజుల సంక్రాంతిని ఇక్కడే జరుపుకున్నారు. తమ చిన్ననాటి ముచ్చట్లను నెమరువేసుకున్నారు. ఆ సమయంలోనే ఒక కమిటీని వేసుకొని, పాఠశాల అభివృద్ధికి తోడ్పడటానికి నిశ్చయించుకొని, విరాళాలు గూడా ప్రకటించారు. ఆ నిధులతో వెంటనే 10 లక్షల రూపాయలతో, 7 ఎకరాల పాఠశాల స్థలం ఆక్రమణలకు గురికాకుండా విశాలమైన ప్రహరీగోడ, వర్షపునీరు పారుదలకు ఒక కాలువ, ఆటలకు అనుకూలంగా క్రీడాస్థలం నిర్మించారు. తరువాత సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు రు. 3 లక్షలతో ఒక కళావేదిక నిర్మించారు. విద్యార్థులకు బల్లలు అందజేశారు. ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి, ఒక పేద విద్యార్థిఉన్నత విద్యకు ఆర్థికసాయం అందజేశారు. ఏటా 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానం పొందినవారికి ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేస్తున్నారు. పూర్వ విద్యార్థులకోసం కమిటీ, ఫేస్ బుక్ లో ఒక గ్రూపు గూడా ప్రారంభించింది. sri Devineni manikyam, Dasari venkatasubbayya zph school musunuru oso పేరుతో ఉన్న ఈ గ్రూపులో ప్రస్తుతం 150 మందికిపైగా విద్యార్థులు చేరారు. 1984-85 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 2012,మే-13న ఏర్పాటుచేసిన సమావేశంలో, తమ గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా సేవాకార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఏటా కనీసం రెండు బ్యాచిల విద్యార్థులైనా సమావేశాలు ఏర్పాటు చేసుకునే విధంగా పూర్వవిద్యార్థులను ప్రోత్సహించుచున్నారు. [1]
  • ఈ పాఠశాలలో 1993-94 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు, 2014,మే-11, ఆదివారం నాడు పాఠశాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారు తమ చిన్ననాటి తీపి గురుతులను నెమరు వేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను సన్మానించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమ సహ విద్యార్థికి ఒక లక్ష రూపాయలను అందజేయడానికి నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి, తోటి స్నేహితులను ఆదుకోవడానికి కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. [2]

[1] ఈనాడు కృష్ణా; 2014,ఫిబ్రవరి-23; 8వ పేజీ. [2] ఈనాడు కృష్ణా; మే-12,2014; 16వ పేజీ.