దేవి శ్రీ ప్రసాద్
| దేవిశ్రీ ప్రసాద్ | |
|---|---|
| జననం | ప్రసాద్ 1979 ఆగస్టు 2 వెదురుపాక |
| ఇతర పేర్లు | దేవి |
| మతం | హిందూ |
| తండ్రి | సత్యమూర్తి |
దేవీశ్రీ ప్రసాద్ సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడై సంచలనం సృష్టించాడు.
బాల్యం
ఆయన తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. ఆయన తండ్రి అత్తగారి పేరులోని దేవి, మామ గారైన ప్రసాదరావు పేరులోని ప్రసాద్ తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ అని పేరు పెట్టాడు.[1] దేవిశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. మద్రాసులో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.
సంగీతం అందించిన చిత్రాలు
పురస్కారాలు
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - వర్షం (2004)
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - బొమ్మరిల్లు (2006)
- సంతోషం పురస్కారం - జల్సా (2008)
- సినీ-మా పురస్కారం - ఆర్య 2 (2010)
- మా సంగీత పురస్కారం - గబ్బర్ సింగ్ (2012)