దేవునిగుట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవునిగుట్ట ఆలయం

దేవునిగుట్ట తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు మండలం, కొత్తూరు సమీపంలో ఉన్న గుట్ట.[1][2] ఈ గుట్టపై సా.శ. 6 లేదా 7వ శతాబ్దాలకు చెందిన ఆలయం ఉంది. దీనిని దేవునిగుట్ట ఆలయం అని పిలుస్తారు. ఈది విష్ణు కుండినులు కట్టించినదిగా చెప్తారు దీనిలో వీరి ఆరాధ్య దైవం అయిన శ్రీ పర్వతుడు (శివుడు) విగ్రహాలు ఉన్నాయి.[3]

నిర్మాణం[మార్చు]

దాదాపు నాలుగు అడుగులున్న ఇసుక రాతి ఇటుకలను పేర్చి దేవునిగుట్టపై 24 అడుగుల ఆలయాన్ని నిర్మించారు. ఇసుక రాళ్లను అతికించడానికి డంగు సున్నం వాడారు. దేవునిగుట్టపై ఉన్న రాతిని తొలిచి చిన్నచిన్న ఇటుకలుగా తయారుచేసి, ఒక్కో ఇటుకపై ఒక్కో భాగం చెక్కి వాటిని ఆరు అడుగుల ఎత్తులో పేర్చి రాచకొలువులో లలితాసనంలో బోధిసత్వుడు కూర్చున్న దృశ్యరూపం ఇవ్వడం జరిగింది.[4] మధ్యలో ఖాళీ ఉండి రెండు పొరలతో నిర్మితమైన గోడకు రెండువైపులావున్న రాళ్లపై బుద్ధుడి జీవిత చరిత్రను ప్రతిబింబించే చిత్రాలెన్నో చెక్కి ఉన్నాయి.

ఇతర వివరాలు[మార్చు]

2018లో వెలుగులోకి వచ్చిన ఈ దేవునిగుట్టకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడమేకాకుండా, కాంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం కంటే ముందే తెలంగాణలో కూడా అటువంటి నిర్మాణాలు జరిగాయనడానికి ఈ ఆలయం సాక్ష్యంగా నిలుస్తుంది.[5]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (25 February 2018). "దేవునిగుట్ట శిల్పసంపద అద్భుతం". Archived from the original on 26 January 2019. Retrieved 26 January 2019.
  2. ఈనాడు, ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి (24 January 2019). "దేవుని గుట్ట ఆలయం అద్భుతం". Archived from the original on 26 January 2019. Retrieved 26 January 2019.
  3. Sakshi (9 January 2022). "పునర్నిర్మాణంతో పునరుజ్జీవం!". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.
  4. The Hans India, Sunday Hans (27 January 2019). "Devuni Gutta: A researcher's paradise". Adepu Mahender. Archived from the original on 27 January 2019. Retrieved 27 January 2019.
  5. సాక్షి, తెలంగాణ (24 January 2019). "వావ్‌.. దేవుని గుట్ట!". Archived from the original on 26 January 2019. Retrieved 26 January 2019.