దేవ్‌సిన్హ్ చౌహాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌

కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు సంజయ్ ధోత్రే

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2014
ముందు దిన్షా పటేల్
నియోజకవర్గం ఖేదా

గుజరాత్ శాసనసభ్యుడు
పదవీ కాలం
2007 – 2014
ముందు రాకేష్ రావు
తరువాత కేసరిసిన్హ్ సోలంకి
నియోజకవర్గం మాటర్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-10-29) 1964 అక్టోబరు 29 (వయసు 59)
నవగామ్‌, ఖేడా జిల్లా, గుజరాత్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి భారతిబెన్ దేవ్‌సిన్హ్‌ చౌహన్
సంతానం 2
నివాసం నడియాడ్, ఖేడా జిల్లా, గుజరాత్
వృత్తి ఇంజనీర్, రాజకీయ నాయకుడు
మూలం [1]

దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎంపీగా ఎన్నికై 2019లో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ 1964 అక్టోబరు 29న గుజరాత్ రాష్ట్రం, ఖేడా జిల్లా, నవగామ్‌లో సోమాభాయ్ చౌహన్, హీరాబెన్ దంపతులకు జన్మించాడు. ఆయన గుజరాత్ లోని పోర్ బందర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కోర్సు పూర్తి చేసి, 1989 నుండి 2002 వరకు ఆల్ ఇండియా రేడియో (AIR) లో ఇంజనీర్‌గా పనిచేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగానికి రాజీనామా చేసి 2002లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాటర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2012లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖేడా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు.

దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ 2016లో ఖేడా జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచి 2021 మే 7 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో సమాచార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

మూలాలు[మార్చు]

  1. Loksabha (2019). "Devusinh Jesingbhai Chauhan". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
  2. TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.