దేవ్.డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవ్ డి
({{{year}}} హిందీ సినిమా)
200px
దేవ్ డి చిత్రం వాల్ పోస్టర్
దర్శకత్వం అనురాగ్ కశ్యప్
నిర్మాణం యునైటెడ్ టెలివిజన్ ఇండియా, బిందాస్
రచన Anurag Kashyap
Vikram Motwane
Novel:
Sharat Chandra Chatterji
తారాగణం Abhay Deol
Kalki Koechlin
Mahi Gill
Dibyendu Bhattacharya
సంగీతం Amit Trivedi
ఛాయాగ్రహణం Rajeev Ravi
కూర్పు Aarti Bajaj
పంపిణీ UTV Motion Pictures
UTV Spot Boy
విడుదల తేదీ February 6, 2009
నిడివి 138 min
దేశం భారత దేశం
భాష [[హిందీ]]
వసూళ్లు US$ 4,247,969
All Movie Guide profile
ఐ.ఎమ్.డీ.బి పేజీ

దేవ్.డి అనేది 2009 లోని భారతీయ బాలీవుడ్ ప్రేమకథా చిత్రం, ఇది ఫిబ్రవరి 6 2009న విడుదలైంది.[1] అనురాగ్ కశ్యప్ రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం, శరత్ చంద్ర చటోపాధ్యాయ యొక్క సాంప్రదాయ బెంగాలి నవల దేవదాస్ యొక్క ఆధునిక చిత్రణ.[2][3], ఇంతకుముందు P.C.బారువా, బిమల్ రాయ్ మరియు ఆధునిక కాలంలో సంజయ్ లీలా భన్సాలీ వంటి ప్రసిద్ధ చిత్ర నిర్మాతలతో చిత్ర నిర్మాణానికి అనువుగా రూపొందించబడింది [4]. దేవ్.డి, మాధ్యమం, విమర్శకులు మరియు ప్రజలతో ఒకే విధంగా ఆమోదించబడింది, మరియు అది హిందీ చిత్రాలకు మార్గదర్శనం చేసే చిత్రాలలో ఒకటిగా పరిగణించబడింది.

ఇతివృత్తం[మార్చు]

దేవ్ (అభయ్ డియోల్) ఒక గొప్ప పంజాబీ వ్యాపారవేత్త కుమారుడు. అతను మరియు పారో (మహి గిల్) చిన్ననాటి ప్రియ నేస్తాలు. కానీ దేవ్, ఒక అభద్రమైన పొగరుమోతు యువకుడు, తన ప్రేమ మరియు ఆమె పట్ల జాగ్రత్తను తెలియచేయడానికి బదులు, పారోని అల్పమైన విషయాలకు ఏడిపిస్తుంటాడు.

కుటుంబ సంబంధాలు పితృస్వామిక సంప్రదాయాల ద్వారా మరియు వివాహాలు అధికారం మరియు "గౌరవాల" ఆటగా దిగజారిన సమకాలీన పంజాబ్ మరియు ఢిల్లీలలో ఈ చిత్రం సాగుతుంది.

దేవ్ తండ్రి తన కొడుకు చెడు అలవాట్లకు లోనవడం గ్రహించి ఉన్నత చదువులకు లండన్కు పంపుతాడు. కానీ ఇద్దరూ దూరమైన తరువాత, పారో మరియు దేవ్ ల యువప్రేమ వికసిస్తుంది. దేవ్, పారోని కలవడానికి చండీఘర్ వస్తాడు. ప్రేమకోసం పడే ఈ పాటు కొన్ని విషాద సంఘటనలకు దారితీస్తుంది. ఈ జంట జీవితంలో ఎప్పుడూ చక్కబడరని, ఇక్కడ కొన్ని అనుమానపు బీజాలు నాటబడతాయి. దేవ్, పారో గురించి పుకార్లు విన్న తరువాత, వాటిని నమ్మి పారోని మోసం చేస్తాడు. పరస్పర అపనమ్మకం మరియు లింగ పరంగా స్త్రీ ఏ విధంగా ప్రవర్తించాలన్న పురుషదృష్టి వారు విడిపోవడానికి కారణం. పారో, అతను తనని అవమానించడం విని అతనిని తిరస్కరిస్తుంది, మరియు తల్లితండ్రులు ఎంపిక చేసిన వ్యక్తిని పెళ్ళాడడానికి అంగీకరిస్తుంది. ఆమె పెళ్ళి రోజున, అతను ఆ పుకార్లు అసత్యాలని తెలుసుకుంటాడు. కానీ అతని అహం అతని తప్పును అంగీకరించనీయదు, మరియు ఆమెను మరొకరిని పెళ్ళి చేసుకోనిస్తాడు.

చందా ప్రవేశం. ఈ భాగం పేరుమోసిన ఢిల్లీ పాఠశాల సెక్స్ MMS అప్రతిష్ఠను గుర్తుకు తెస్తుంది. తన కూతురి యొక్క అపకీర్తి వలన అవమానం పొందిన ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. కుటుంబం ఆమెను వదలివేస్తుంది. ఆమె ఒక గాయపడిన అమాయకపు పాఠశాల విద్యార్థిని నుండి వేశ్యగా మారడాన్ని ఈ చిత్రం చిత్రీకరిస్తుంది. చందా వృత్తిపరమైన వేశ్య కానప్పటికీ, అంత విభిన్నమైనదేమీ కాదు. ముజ్రాలు ప్రదర్శించడానికి బదులుగా, ఆమె ప్రసిద్ధి చెందిన అమెరికన్ శృంగార శ్రేణుల నుండి దృశ్యాలను నటిస్తుంటుంది. అయితే, ఆమె తన వృత్తి కొరకు చదువును వదలివేయకుండా కొనసాగిస్తుండడం మరియు నిష్క్రమించే మార్గాన్ని తెరచి ఉంచుకోవడం ఆమెను ప్రత్యేకంగా నిలుపుతాయి.

పారో వివాహంతో బాధ అనుభవించిన దేవ్, మద్యాన్ని మరియు మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తాడు. అతను చండీఘర్ నుండి ఢిల్లీకి పారిపోవడంలో తన ప్రేమను వెంబడించడంతో పాటు, తన తండ్రి నుండి తప్పించుకొనే ప్రయత్నం కూడా ఉంది. కొన్ని నెలల తరువాత, పారో తనను కలిసిన అనంతరం, దేవ్ పారో భర్తను ఒక అర్ధరాత్రి సమయంలో కలుస్తాడు. పారో విధితో రాజీ పడుతుంది, కానీ ఆమె హృదయం మాత్రం ఇంకా చిన్ననాటి స్నేహితుని కోసం పరితపిస్తుంటుంది. ఆమె ప్రేమ ఎప్పుడూ అతని పట్ల అత్యంత జాగ్రత్తగా మారుతుంది. మరొక వైపు, దేవ్, ప్రేమను మించి- శారీరకంగా ఆమెను కోరుతుంటాడు -కానీ అదృష్టం సహకరించదు. పారో నుండి విడిపోవడం మాత్రమే కాక ఆమె మరొకరిని ప్రేమిస్తుందనే ఆలోచన అతనిని మిక్కిలి బాధ పెడుతుంది.

పరిహాసంగా, అతని జీవితం ఎప్పుడూ స్త్రీల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఒకరు స్వయంగా నాశనం చేసుకోవడానికి కారణమైతే మరొకరు రక్షిస్తారు. చివరకు అతను తాను పారోని ఎప్పుడూ నిజంగా ప్రేమించలేదని తెలుసుకుంటాడు. అతను చందా దగ్గరకు వెళ్లి ఆమెతో జీవితం కొనసాగిస్తాడు.

నటీ నట వర్గం[మార్చు]

 • చిన్ననాటి దేవేంద్ర సింగ్ (దేవ్) గా ఏకాంష్ వత్స్
 • దేవేంద్ర సింగ్ ధిల్లాన్ గా అభయ్ డియోల్
 • లేని/చంద్రముఖిగా కల్కి కోచ్లిన్
 • పర్మిందర్ (పారో)గా మహి గిల్
 • చున్నిలాల్ గా దిబ్యేన్దు భట్టాచార్య
 • భువన్ (పారో భర్త)గా అసిం శర్మ
 • రసికగా పరఖ్ మదన్
 • బార్ నాట్యకారులుగా ట్విలైట్ ప్లేయర్స్

నిర్మాణం[మార్చు]

ఈ చిత్ర మూల భావనను అభయ్ డియోల్ అనురాగ్ కశ్యప్ కు సూచించారు, ఆయన చిత్రకథపై విక్రమాదిత్య మోత్వానితో కలసి పనిచేసారు, "తరం X గురించి ముఖ్య వార్తాంశాలు" అనే వాక్యాన్ని ఉపయోగించి చిత్రానికి యువ భావనను తీసుకువచ్చారు. ఈ చిత్ర నిర్మాత రోనీ స్క్రూవాలా, మరియు ఈ చిత్రాన్ని మధ్య ఢిల్లీలోని పహార్ గంజ్తో సహా అనేక ప్రాంతాలలో చిత్రీకరించారు[5].

అభివృద్ధి[మార్చు]

అనురాగ్ కశ్యప్ ఇంతకూ ముందు 9 సార్లు దేవదాస్ పేరుతో నిర్మించిన చిత్రాన్ని పునర్నిర్మించడానికి ఇష్టపడలేదు.[2][6] 1917 నాటి శరత్ చంద్ర చటోపాధ్యాయ సాంప్రదాయ నవల ఆధునిక రూపంగా అతని చిత్రం తీయబడింది.[2] కశ్యప్ తన స్వంత దృష్టికోణంలో దేవదాస్ ను అసలు నవలను ప్రతిబింబించేలా, కానీ 2008 లక్షణాలతో ఉండేలా, ప్రధాన నాయకుడు దేవ్ దాస్ ఒక త్రాగుబోతు, ఇంద్రియ భోగాలను కోరే వంచకుడు, తనను తాను నాశనం చేసుకుంటున్నానని తెలియకుండానే నాశనమయ్యేవాడిగా ఉండేలా చిత్రాన్ని తీయాలని నిశ్చయించుకున్నారు.[2][7] చిత్రంలో దేవ్ గా తన పాత్ర గురించి మాట్లాడుతూ అభయ్ డియోల్ రేడియో సర్గమ్తో, "ఈ కథ నేను ఆంగ్లంలో చదివిన పుస్తకంలోని కథలాగానే ఉంది. ఆ పుస్తకంపై నా అర్ధం ప్రకారం నేను ఆ పాత్రను పోషించాను. అతని ప్రవర్తన సమకాలీనంగా ఉంటుంది, అనేక విధాలుగా అతను పట్టణ నాగరీకుడుగా ఉంటాడు, అతని పరిసరాలలో అతను ఒక దారితప్పిన, ఎదిరించే మరియు వ్యసనపరుడైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు."[8]

ప్రారంభ జాప్యాలు[మార్చు]

కశ్యప్ యొక్క నో స్మోకింగ్ బాక్స్ ఆఫీసు వద్ద సరిగా ఆడకపోవడం వలన, యునైటెడ్ టెలివిజన్ (UTV) ఆ దర్శకుడి తరువాతి ప్రకల్పన అభయ్ డియోల్ నటించిన దేవ్.డి నుండి తప్పుకుందనే పుకార్లు వ్యాపించాయి. అయితే UTV అభయ్ తో మూడు చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకుందని ఈ నటుడు నవంబరు 2007 నుండి మార్చి 2008 వరకు కశ్యప్ యొక్క చిత్రం కొరకు తన తేదీలను ఇచ్చాడని, ఈ చిత్రాన్ని ఒకే ప్రణాళికలో పూర్తిచేయాలని అనుకుంటున్నారని పరిశ్రమం వర్గాలు తెలిపాయి. ప్రారంభ గాయాల నుండి బయటపడి, చిత్రం ప్రారంభమైనపుడు UTV తప్పుకుందనే పుకార్లు వ్యాపించాయి.[9] ఆ సమయంలో, UTV వెనక్కి తప్పుకుందనే పుకార్లను దర్శకుడు ఖండించారు. తాను ముందు ప్రారంభించిన హనుమాన్ రిటర్న్స్ చిత్రం పూర్తైన తరువాత ఈ చిత్రానికి పనిచేయడం ప్రారంభించాలని అనుకోవడం వలన ఆలస్యం జరిగిందని వివరించారు. తాను ఇంకా చంద్రముఖి కొరకు చూస్తున్నానని, ఇప్పటివరకు అభయ్ మరియు నూతన తార మహి గిల్ను బంధించానని పేర్కొన్నారు.[10], చంద్రముఖి పాత్ర కొరకు సరిపోయే నటిని వెదకడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోవడం వలన చిత్రం మరింత ఆలస్య అయింది, చివరకు పరీక్షార్దులలో చివరి అభ్యర్థి అయిన కల్కి కోచ్లిన్ను ఆయన ఎన్నుకున్నారు[5].

విడుదల[మార్చు]

బాక్స్ ఆఫీసు[మార్చు]

దేవ్ డి 15 మిలియన్ రూపాయల ప్రారంభ దిన సగటు వసూళ్లను చేసింది. అయితే ఈ చిత్రం వెంటనే బాక్స్ ఆఫీసు వద్ద పుంజుకొని నిర్మాణానికి ఖర్చైన 60 మిలియన్ల రూపాయలను కొన్ని వారాలలోనే వసూలు చేసింది.[11] మొదటి నాలుగు వారాలలోని నికర వసూళ్లు 150 మిలియన్ల రూపాయలు.[12]

స్వీకారం[మార్చు]

దేవ్.డి ఎక్కువగా అనుకూల సమీక్షలనే పొందింది. టైమ్స్ అఫ్ ఇండియా సమీక్షకుడు, నిఖత్ కజ్మీ "బాలీవుడ్ కు ప్రకాశవంతమైన పురోగతి" అని ఈ చిత్రానికి కితాబు నిచ్చి 5/5 రేటింగ్ ఇచ్చారు.[13]. ఇండియన్ ఎక్స్ప్రెస్కు చెందిన శుభ్ర గుప్త, అభయ్ డియోల్ నటనను మరియు పూర్తి చిత్రాన్ని ప్రస్తుతించారు.[14] హిందూస్తాన్ టైమ్స్, "మృదువైన నడత మరియు సాహసోపేత వివరణతో హిందీ సినిమా హద్దులను నెట్టివేసింది" అని పొగడి 3.5/5 రేటింగ్ ను ఇచ్చింది.[15] AOL ఇండియాకు నోయోన్ జ్యోతి పరాశర ఈ చిత్రం చూసి పూర్తిగా ముగ్దులై, "వెళ్లి దేవ్ డి చూడండి మరియు దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ సామర్ధ్యానికి మచ్చు తునకతో ముగ్దులు కండి". కనీసం మొదటి అర్ధ భాగం మిమ్మల్ని మంత్ర ముగ్దులని చేస్తుంది" అని ప్రకటించారు.[16]

పురస్కారాలు మరియు ప్రతిపాదనలు[మార్చు]

 1. క్వీన్స్ ల్యాండ్ ఆస్ట్రేలియాలో 2009 ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్ కొరకు ప్రతిపాదించబడింది.[17]
 2. దేవ్ డి 2010 లోపామ్ స్ప్రింగ్స్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడుతుంది, ఇది పామ్ స్ప్రింగ్స్,పామ్ స్ప్రింగ్స్ రీగల్ 9

789 E. తహక్విత్జ్ కాన్యాన్ వే, పామ్ స్ప్రింగ్స్, CA 92262 కాలిఫోర్నియా, USAలో 5-18 జనవరి 2010 [18]

సంగీతం[మార్చు]

Dev.D
దస్త్రం:Dev.D, 2009 film, soundtrack album cover.jpg
Soundtrack album by Amit Trivedi
ReleasedDecember 2008
GenreFilm Soundtrack
Length01:01:31
LabelT-Series
Amit Trivedi chronology
Aamir
(2008)
Dev.D
(2009)

దేవ్.డి 18 ట్రాక్ లు అమిత్ త్రివేది అనే కళాకారుడి ద్వారా చేయబడ్డాయి. ఇది డిసెంబర్ 31 న T-సిరీస్ ద్వారా విడుదలైంది, దీనిలో రెండు ప్రత్యేకమైన పంజాబీ పాటలున్నాయని, ఒకటి సహజమైన పంజాబీ కాగా మరొకటి వీధి సంగీత బాజా సొగసు కలిగినదని ఆయన చెప్పారు. ఒక రాజస్థానీ జానపద ప్రేమ గీతం, దానితో ప్రపంచ సంగీతానికి చెందిన మరొక రాక్ పాత, 1970’-80’ల పాప్ మేళవింపుతో ఒక అవధి పాట ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.[19][20] ఈ చిత్ర సంగీతం విపరీతమైన అనుకూల స్పందనలను పొందింది. విమర్శకుడు జోగిందర్ తుతేజ మాట్లాడుతూ, "ఈ సంగీతం వ్యాపార పరంగా విజయం సాధిస్తుందా లేదా అనే ఆలోచనను వదలివేయండి; ఇది ఒక శ్రేష్టమైన సంగీతం అనేదే ఎక్కువ గుర్తించవలసిన విషయం" అన్నారు.[21] ఈ సంగీతం యువకులలో బాగా ఆదరణ పొందింది."ఎమోసనల్ అత్యాచార్" అనే పాట జనాలలో బాగా ప్రసిద్ధి చెందింది మరియు ఆ పాట పేరు ఎక్కువ మంది భారతీయ యువకుల ఊతపదంగా మారింది.[22]

సూచనలు[మార్చు]

 1. Passionforcinema.com, 30 డిసెంబర్ 2008, అనురాగ్ కశ్యప్ వ్యాఖ్య
 2. 2.0 2.1 2.2 2.3 Passionforcinema.com, 9 జూలై 2007, అనురాగ్ కశ్యప్ ముఖాముఖి
 3. Hollywood.com, "మూవీస్ ఫ్రమ్ స్పాట్ బాయ్ మోషన్ పిక్చర్స్"
 4. దేవ్. డి - పునర్విమర్శ న్యూ యార్క్ టైమ్స్.
 5. 5.0 5.1 'దేవ్ డి' సుధీర్ మిశ్రా యొక్క 'అవుర్ దేవదాస్' వలె లేదు ది హిందూ, బుధవారం, 10 డిసెంబర్ 2008.
 6. IMDB పూర్వం చిత్రీకరించబడిన వృత్తాంతాలు]
 7. Masala.com, "అనురాగ్ కశ్యప్ తన దేవదాస్ ను సాధ్యమైనంత ఆధునీకరించాలని అనుకుంటున్నారు"
 8. RadioSargam.com, "అభయ్ డియోల్ రేడియో సర్గమ్ లో దేవ్ డి" గురించి మాట్లాడుతారు"
 9. In.movies.yahoo, 17 నవంబర్ 2007, "UTV బేక్స్ అవుట్ అఫ్ దేవ్ డి?"
 10. Buzz18.com, 1 ఫిబ్రవరి 2008, "ఇది అధికారికం: అంబిక-అనురాగ్ విడిపోయారు- అనురాగ్ చిత్రాన్ని ఇప్పుడు UTV సోదర సంస్థ అయిన, స్పాట్ బాయ్ నిర్మిస్తుంది."
 11. "Dev D hits Box Office gold". NDTV Movies. Retrieved 2009-03-15. Cite web requires |website= (help)
 12. "Bollywood box-office report of the week". Bollywood Trade News Network. Retrieved 2009-03-15. Cite web requires |website= (help)
 13. మూవీ రివ్యూ: దేవ్ డి ది టైమ్స్ అఫ్ ఇండియా, ఫిబ్రవరి 5, 2009.
 14. మూవీ రివ్యూ: దేవ్ డి
 15. [1]
 16. [2]
 17. www.asiapacificscreenawards.com, "ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్"
 18. www.psfilmfest.org, "పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్"
 19. Radioandmusic.com, 5 సెప్టెంబర్ 2008, "అమిత్ త్రివేది UTV స్పాట్ బాయ్ యొక్క తరువాతి రెండు చిత్రాలకు సంగీతం రూపొందిస్తారు"
 20. Rediff.com, 21 జూలై 2008, "సంగీతాన్ని అందించడం, ఆమిర్ నుండి దేవ్ డి వరకు"
 21. BollywoodHungama.com, 7 జనవరి 2009, "బాలీవుడ్ హంగామా దేవ్.డి సంగీత సమీక్ష"
 22. RadioSargam.com, 24 జనవరి 2009, "దేవ్.డి సంగీతం పై రేడియో సర్గమ్ సమీక్ష"

వెలుపటి వలయము[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దేవ్.డి&oldid=2289471" నుండి వెలికితీశారు