దేశబంధు గుప్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేశబంధు గుప్త
2010 భారత పోస్టల్ స్తాంపుపై గుప్త
జననం1901 జూన్ 14
మరణం1951 నవంబరు 21
మరణ కారణంవిమాన ప్రమాదం
విద్యాసంస్థఎస్ టి స్టీఫెన్సన్ కళాశాల
వృత్తి
  • రాజకీయవేత్త
  • జర్నలిస్ట్
  • స్వాతంత్ర్య సమరయోధుడు
  • శాసనసభ్యుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత స్వాతత్ర్యోద్యమం,
ది డైలీ తేజ్
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిసోనా దేవి

రతీ రామ్ దేశబంధు గుప్తా, ( 1901 జూన్ 14- 1951 21 నవంబరు 21) లాలా దేశబంధు గుప్తాగా ప్రసిద్ధి. ఇతను భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, శాసనసభ్యుడు, పాత్రికేయుడు. హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో షాదిరామ్, రాజారాణి గుప్తా దంపతులకులకు జన్మించాడు.[1]

పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి, ఢిల్లీ అసెంబ్లీ హోదా కోసం వాదించడానికి అతను విస్తృతంగా పనిచేశాడు. పంజాబ్, హర్యానాను వేరు చేయాలని కూడా అతను వాదించాడు.

జననం

[మార్చు]

దేశబంధు గుప్తా హర్యానా రాష్ట్రంలోని పానిపట్లో గల బడి పహాడ్ ప్రాంతంలో రతీ రామ్ గుప్తాగా జన్మించాడు. అతని తండ్రి షదిరామ్. ఇతడు ఉర్దూ భాషలో పండితుడు.[2]

వివాహం, కుటుంబం

[మార్చు]

అతను 19 ఏళ్ల వయస్సులో, 17 ఏళ్ల సోనా దేవిని వివాహం చేసుకున్నాడు. అతనికి విశ్వబంధు గుప్త, ప్రేంబంధు గుప్త, రమేష్ గుప్త, సతీష్ గుప్త అనే నలుగురు కుమారులు ఉన్నారు.[3]

విద్య, స్వాతంత్ర్యోద్యమం

[మార్చు]

రతీ రామ్ గుప్తా పానిపట్ లోని ఒక మదరసాలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు, ఆపై సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకున్నాడు. ఈ సమయంలోనే జలియన్‌వాలా బాగ్ మారణకాండ వంటి సంఘటనలు జరిగాయి. ఈ ఘటన యువకుడైన రతీ రామ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. దీని ద్వారా భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో మరింత ప్రత్యక్ష పాత్ర పోషించడానికి దేశబంధు గుప్తా ప్రేరణ పొందాడు. అతను సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి వైదొలగాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎస్ కె రుద్రకు నోటీసు ఇచ్చాడు. ఎస్ కె రుద్ర సానుభూతితో దీనిని అంగీకరించి, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి తన నిర్ణయాన్ని తెలిపాడు. యువకుడైన రతీ రామ్‌ని స్వాతంత్ర్యోద్యమం వైపు ప్రోత్సహించాడు. స్వాతంత్ర్య ఉద్యమంలో, అతను లాలా లజపతిరాయ్, స్వామి శ్రద్ధానంద్ లతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అతను లాలా లజపతిరాయ్ విశ్వాసపాత్రుడు.[4]

రాజకీయ కార్యకలాపాలు

[మార్చు]

దేశబంధు గుప్తా రాజకీయ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం అనేది భారత స్వాతంత్ర్య పోరాటంలో చేరటానికి గల ప్రధాన కారణం. స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్న ఫలితంగా అనేక సందర్భాల్లో అతను రాజకీయ ఖైదు అనుభవించాడు. అతను మొదట 19 సంవత్సరాల వయస్సులో జైలు శిక్ష అనుభవించాడు.[5]

హర్యానా, పంజాబ్ ల విభజన

[మార్చు]

అతను 1927లో జైలు నుండి విడుదలైన తర్వాత హర్యానా, పంజాబ్‌ల విభజన కోసం ప్రచారం చేశాడు. ఇందులో రణబీర్ హుడా వంటి నాయకులు కూడా పాల్గొన్నారు.[6]

మరణం

[మార్చు]

స్వాతంత్ర్య పోరాటంలో, రాజకీయ కార్యకలాపాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్న రతీ రామ్ దేశబంధు గుప్తా 1951 21 నవంబరు 21 న కలకత్తాకు దగ్గరలో విమాన ప్రమాదం వల్ల మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. Upamanyu, Narendra Kumar. Sansmaran: Lala Shri Deshbandhu Gupta Ji. Yuva Netritva Jyoti Sansthan. 2008
  2. Bhardwaj, Rakesh. "Desh Bandhu Gupta: Too illustrious a son to be forgotten in hometown", The Tribune. 16 July 2003
  3. Chandra, Bipin. History of Modern India. Orient Blackswan: 2009
  4. "Haryana Sets Up Deshbandhu Gupta Award", The Hindu. 21 August 2008
  5. "Hooda Announces Award on Works on Lala Deshbandhu Gupta", OneIndia. 20 August 2008
  6. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-otherstates/Haryana-sets-up-Deshbandhu-Gupta-award/article15286347.ece